🌻పుర్రెకో బుద్ది🌻
🔅🔅🔅🔅🔅🔅🔅🔅
అది త్రేతయుగము ముగిసి ద్వాపర యుగం మొదలైన కాలంలో బలరామ కృష్ణులు కంసుని సంహారం కోసం మథురా నగరం రాజవీధిలో వెళుతున్నారు వారి బట్టలు మాసి వున్నందున దారిన మంచి మాంచి పట్టు పీతంబరంలు పట్టు పంచెలు ఉతికి నెత్తిన పెట్టుకొని ఎదురొచ్చిన చాకలిని చూసి బలరాముడు అయ్యా మేము నంద రాజ కుమారులం మాకు సుచి అగు పంచెలు రెండు ఇవ్వవల్సింది గా చాకలిని కోరగా ,,,ఆగ్రహించిన చాకలి మదోన్మత్తం తో నేను ఎవరో తెలుసా కంసుని ఆస్థాన చాకలి వాడిని గొల్ల పిల్లలు అయిన మీకు పట్టు పంచలు కావాల్సి వచ్చిందా చిక్కటి పాలు పెరుగు తిని మీకు కొవ్వు పట్టి ఇలా మాటడుతున్నారు ఈ విషయం కంసుని తెలిస్తే మీ తలలు తెగిపోతాయ్ అయిన కంసుని దాకా ఎందుకు నా బలం మీకు తెలియదు ఒక గుద్దు తో ఇద్దరిని నేలకులుస్తా అని పొగరుగా సమాధానం ఇచ్చాడు... అప్పుడు కృష్ణుడు బలరాముని తో అన్నాడు అన్నా త్రేతాయుగం నాడు సీతను పరిత్యజించడానికి కారణం అయిన ఈ పుర్రే ఎన్ని పుర్రెలుగా మారిన దీని బుద్ధి మారడం లేదు కదా అన్నా కనుక ఈ పుర్రెను ఇక సహించి ఉపయోగం లేదు అని పిడికిలి తో ఆ చాకలి పుర్రె పగలగొట్టి ఆ పుర్రె యొక్క జీవుడిని అంతటితో జన్మ జన్మాంతాలుగా మధ మత్సర్యాలతో పాప కూపం లో కూరుకి పోతున్న ఆ జీవుడిని సద్గతి ప్రసాదించాడు... ఎంతటి మూర్ఖునికి అయిన బుద్ధి మార్చుకోవడానికి అవకాశాలు ఇస్తూనే వుంటాడు ఈశ్వరుడు అయిన మారక పోతే ఆయనే ఎదో రూపంలో శిక్షించి సద్గతి నీ ప్రసాదిస్తాడు అందుకే మన ప్రయత్నంతో మన బుద్ధి మారడం కష్టం కనుక ఎప్పుడూ ఈశ్వరుడిని నా బుద్ది నీ పాదాలను వదలకుండా వుండేలా చూడు స్వామీ నా ఆలోచనల మీద ఎల్లప్పుడు నీ పర్యవేక్షణ వుండేలా కరునించమని ప్రార్థించాలి 🙏
సర్వేజనసుఖినోభవంతు.
No comments:
Post a Comment