🍀🪷🌹💦🌻🌈
🦋ఒక సీతాకోకచిలుక తన గూటి నుంచి బయటకి రావడానికి నానా కష్టాలు పడుతుంది. ఒక బాలుడు అది బయటికి ఎలా వస్తుందా అని రెండు మూడు గంటల పాటు దాని పోరాటం చూస్తూ కూర్చున్నాడు.
ఒక చిన్న రంధ్రం నుంచి బయటకి రావడానికి అది పడుతున్న కష్టం చూడలేకపోయాడు ఆ బాలుడు. ఆ సీతాకోకచిలుకకు చిన్న సహాయం చేద్దామని కత్తెరతో గూడును కత్తిరించాడు. సీతాకోకచిలుక గూటి నుంచి బయటపడింది కానీ ఉబ్బిన శరీరంతో, ఎదగని రెక్కలతో, అక్కడక్కడే తిరుగుతూ ఉండిపోయింది……
రెక్కలు విప్పి సీతాకోకచిలుక అందంగా ఎప్పుడు ఎగురుతుందా అని చూస్తూ కూర్చున్నాడు. కానీ సీతాకోకచిలుక జీవితంలో ఇక ఎగరలేదు.
నిజానికి అది తనంతట తాను పోరాడి గూటి నుంచి బయటికి వస్తేనే సంపూర్ణమైన ఎదుగుదలతో అందమైన సీతాకోకచిలుకగా మారుతుందని ఆ బాలుడికి తెలియదు….
మన జీవితకాలంలో కూడా మనం సీతాకోకచిలుకలా, ఎన్నో కష్టనష్టాలు, సమస్యలు,ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం ఈ జీవన పోరాటాలు మనకు కూడా శారీరక బలాన్ని, సామర్థ్యాన్ని,సత్ప్రవర్తనను, గొప్ప జీవితాన్ని అందించి ఉన్నతంగా ఎదిగేట్లు చేస్తాయి
🕉️🌞🌎🏵️🌼🚩
No comments:
Post a Comment