Xx5.x. 1-8. 051122-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఆరోగ్యానికి ప్రధానం!
➖➖➖✍️
ఆరోగ్యమునకు కేవలం ఔషధములే ప్రధానము కాదు, మంచి మాటలు, మంచి నడత, మంచి చూపులు, మంచి తలంపులు, మంచి వినికిడి అవసరము. ఇవే దేహానికి అమృతత్వము నందించే టానిక్కులు.
దుర్భావములూ, దుశ్చింతలూ హృదయములో నింపుకొని ఎన్ని విలువైన ఔషధములు సేవించినప్పటికీ రోగ నివారణ కాదు.
సద్గుణములను అనుభవించి, సదాచారములను ఆచరించి, సచ్చింతనలను సంకల్పించుకుంటే అవి మనకు సరైన ఆరోగ్యాన్ని అందివ్వడమేగాక డాక్టర్లు ఇచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తాయి. మరియు ఆత్మానందాన్ని కూడా చేకూరుస్తాయి.
నేడు మానవుడు అనేక విధములైన రోగములతో వివిధ క్లేశములు అనుభవించుటకు కారణం మనస్సుకు సరైన పోషణ లేకనే. శరీరమునకు వివిధ రకములైన రుచికరమైన ఆహారమును అందిస్తున్నాడు కానీ మనస్సుకు అవసరమయ్యే ఆధ్యాత్మిక సాధన అనే ఆహారాన్ని అందివ్వడం లేదు. అది లేకనే రోగములన్నీ వచ్చి మీద పడుతున్నాయి.
నిత్యం భగవన్నామమును స్మరించుట, ప్రవచనాలు వినుట మున్నగు ఆధ్యాత్మిక సాధనలు సక్రమంగా చేస్తుంటే ఏ రోగము మన దరి చేరదు.✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖనోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment