*దేవుడున్నాడు*
💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫
🕉 ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను సామాన్య మానవుల వలె దేవుడిని నమ్మేవాడు.
🕉 అంటే పూలు, పళ్ళు, దీపం, ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు.
🕉 అతనికి అలా ఏమీ లభించలేదు. దానితో కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది.
🕉 ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు.
🕉 ఏదైనా మంత్ర జపం సద్గురువు ద్వారా దీక్ష గా తీసుకుని చేయాలని ఎవరో చెప్పగా అతను విన్నాడు.
🕉 ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్ళి , దర్శనం చేసుకుని, తన కోరిక వెల్లడించాడు.
🕉 సాధువు అంతా శాంతంగా విని, " నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను కానీ నీ తపన చూస్తుంటే.........." అని అనగానే.....
🕉 భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేసాడు.
🕉 "కానీ జప విధానం కొంచెం కష్టం. నీవు చేయగలవో లేదో...." అని అంటూ ఉండగానే.......
🕉 ఎంత కష్టమైనా నేను చేయగలను.. మంత్రం ఫలిస్తే చాలు " అన్నాడు భక్తుడు ఆనందంగా.......
🕉 అయితే విను ... నేను చెప్పే మంత్రం పఠించ వలసిన అవసరం లేదు. కానీ రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి .... అలా తొమ్మిది రోజులు చేయాలి.
🕉 ఆ పంచాక్షరీ మంత్రం ఏమిటంటే... *"దేవుడున్నాడు"* .
🕉 భక్తుడు అయోమయంగా చూసాడు.. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు....ఎన్నో మంత్రాలూ, లక్షల,...కోట్ల జపం విన్నాడు కానీ, ఇదేమిటి ????? పైగా పంచాక్షరీ మంత్రంట ఏమిటిది !!!!! అనుకున్నాడు.
🕉 దేవుడు ఉన్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది...
🕉 మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి....???? అదీ, ఇంకొకరితో .... తనను పిచ్చివాడి క్రింద జమ కడ్తారేమో!!!!!! అనుకుంటూ ఉండగా.....
🕉 సాధువు ఒకటే మాట చెప్పాడు. "నన్నేమీ ప్రశ్నించ వద్దు. మంత్రం ఫలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్లు చేసి, ఆపై నాకు కనిపించు" అన్నాడు.
🕉 భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు... సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా *"దేవుడున్నాడు"* అని ఎలా అనటం?
🕉 ఇంతలో అతని భార్య వచ్చి, పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్ప బోయింది.
🕉 భక్తుడు అప్రయత్నంగా అన్నాడు *"దేవుడున్నాడు"* అని, అంతే! ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.
🕉 భక్తుడికి చాలా ఆనందం వేసింది.... వెంటనే అతనికి ఏదో అర్థం అయినట్లు... కానీ ఇంకా సరిగా కానట్లు వింత భావన కలిగింది.
🕉 ఆ పై ఇంక ఏ మంచి కనిపించినా *"దేవుడున్నాడు"* మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో.....
🕉 ఏదైనా చెడు కనిపిస్తే *"దేవుడున్నాడు"* అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతో..
🕉 అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే *"దేవుడున్నాడు"* శిక్షిస్తాడనే అర్థంతో....
🕉 పూజలు అనే విషయం వస్తే, *"దేవుడున్నాడు"* అని భక్తివిశ్వాసాలు వ్యక్తపరుస్తూ, అనేవాడు.
🕉 తొమ్మిది రోజులు గడిచాయి. జరిగినదంతా నెమరువేసుకుంటూ, సాధువు దగ్గరికి వెళ్ళాడు.
🕉 సాధువు అన్నాడు, నువ్వు ఎప్పుడు, ఎవరితో, రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకనవసరం.
🕉 నువ్వు అలా అంటూ గ్రహించినదేమిటో నాకు చెప్పు అని.
🕉 భక్తుడు తెల్లబోయాడు.... అయినా వెంటనే తేరుకుని అన్నాడు... నాకు తెలిసింది ఏమిటంటే...
🕉 *దైవం సర్వాంతర్యామి...* *అంతటా వున్నాడు....* *సర్వజ్ఞుడు......*
*అతనికి తెలియనిది, మనం దాచగలిగేదేమీ లేదు...* *నిష్పక్షపాతంగా, న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు.* *దయాసాగరుడు....*
*ఆనందస్వరూపుడు...*
🕉 భక్తుడిని మధ్యలో ఆపి సాధువు ఇలా అన్నాడు " ఇప్పుడు చెప్పు... నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు? అని..
🕉 భక్తుడు తన్మయత్వం తో కళ్ళు మూసుకుని అన్నాడు, "ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులో నుండి *"దేవుడున్నాడు"* అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు అనుకుంటున్నాను అని.
✅👉 నీతి... కర్మఫలం... స్వర్గం... నరకం... పాపభీతి... త్యాగం... కరుణ... సానుభూతి... ప్రేమ... సేవ... మానవత్వం... సత్యం... ధర్మం... మొదలైన ఉదాత్తమైన భావాలకి ఆలంబన, ఆధారం... *దేవుడున్నాడు"* అని మనసారా విశ్వసించటమే !!
✅👉 ఈ పంచాక్షరీ మంత్రాన్ని నిత్యం జపించండి (నమ్మండి) తరించండి.
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈
No comments:
Post a Comment