Xx2. V. 1B. 031122-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
యోగీశ్వరుడైన "శ్రీకృష్ణుడు"
భగవద్గీత లో ఇలా అన్నాడు...
➖➖➖✍️
పత్రం పుష్పం ఫలం తోయం
యోమే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతం
అశ్నామి ప్రియతాత్మనః
"ఎవరైతే నాకు పత్రమైనను., పుష్పమైనను., ఫలమైనను., చివరకు ఉదకమైనను భక్తితో సమర్పిస్తారో..., వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను’ అది పై శ్లోకం తాత్పర్యం!
భగవంతుడికి మనం చేసే చిన్న పాటి సేవ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
ధూప, దీప, పుష్ప, గంధాలతో మనం పరమాత్మకు ప్రతిరోజూ చేసే పూజ కూడా ఎంతో గొప్ప భగవద్ అనుగ్రహాన్ని వర్షిస్తుంది.
తెలిసి చేసినా, తెలియక చేసినా సరే మనం చేసే చిన్నపాటి సేవకి పరమాత్మ విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు.
జగద్గురు శ్రీ ప్రభుపాదాచార్యుల వారిని ఒకసారి ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడిగాడు....
“మీరు ప్రతిరోజూ కృష్ణుడి పాదాలమీద పువ్వుల తో పూజ చేస్తున్నారు కదా, ఒకరోజు తర్వాత వాడిపోతుంది. మరి ఆ పువ్వు పొందే ప్రయోజనం ఏమిటి?”
దానికి జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు...
“ఈ పువ్వు ఏ మొక్క నుంచి వచ్చిందో, ఆ మొక్కలోనున్న జీవుడు వచ్చే జన్మలో ఉత్కృష్టమైన మానవ జన్మని పొందుతుంది".
దీనికి పురాణంలో ఒక కథ కూడా ఉంది.
ఒక వూరిలో పాడుబడ్డ దేవాలయం మీద ఒక పక్షి ఎగురుతూ వెళ్ళింది. అది అలా ఎగిరి వెళ్లడంలో దాని రెక్కల నుంచి వచ్చిన గాలికి గోపురం మీద ఉన్న ధూళి తొలిగి శుభ్రపడింది.
తెలియక చేసినా కూడా అదొక గొప్ప భగవద్ సేవ. తర్వాతి జన్మలో ఆ పక్షి లోని జీవుడు ఒక రాజకుమారుడిగా జన్మించాడు.
ఎప్పుడో ఒక్కసారి చేస్తేనే పరమాత్మ అంత అనుగ్రహిస్తే, అదే మనం నిరంతరం శ్రీమన్నారాయణుడి పాద పద్మములను సేవిస్తే మనల్ని రక్షించడా స్వామి?
తప్పక అనుగ్రహిస్తాడు. జీవరాసులలో మానవజన్మ పరమోత్కృష్టమైన జన్మ. మోక్ష సాధనకి మానవ జన్మే చిట్టచివరి జన్మ అవుతుంది.✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment