అరుణాచల శివ
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
జ్ఞాని తాను శరీరముకంటే వేరని, శరీరములోపల హృదయసమునందు నిరంతరము స్ఫురించుచు శరీరమునంతటిని ఆక్రమించి ప్రపంచమంతటను వ్యాపించి 'నేను పూర్ణుడను' అను అనుభూతితో విలసిల్లుచు అఖండమైన సత్తే తన శరీరముగా భావించును. అజ్ఞాని శరీరము మాత్రమే తాను అని భావించును.
జ్ఞానికి సర్వాత్మకమైన సత్తే ఆత్మ, దానిలో శరీరముగూడ అంతర్భవించును. అజ్ఞానికి శరీరము మాత్రమే ఆత్మ. అపరిణుతుడైన అజ్ఞానికి గ్రహణ సామర్ధ్యము లోపించుటవలన అతని జ్ఞానము అపూర్ణమగును. అదే పూర్ణ సత్యమను ప్రతీతి(జ్ఞానము) మిథ్యాజ్ఞానమగునుగాని ఆ అపూర్ణజ్ఞానమే మిథ్య అని చెప్పరాదు. అపరిణుతుడైన అజ్ఞానికి తన శరీరమునందు మాత్రమే ఆత్మానుభవము కలుగును. పరిణతుడైన జ్ఞానికి స్వశరీరమైన సర్వ జగత్తునందును ఆత్మానుభవము కలుగును.
No comments:
Post a Comment