🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"379"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మంత్రం సిద్ధిస్తే సమాధిస్థితి వస్తుందంటున్నారు మరి నిద్రలో ఉన్న స్థితి ఏమిటి ?"*
**************************
*"మనసు మంత్ర సాధనలో పొందే సమాధిస్థితిని ప్రతిరోజు మనం నిద్రలో కూడా పొందుతున్నాం. కానీ నిద్ర సమయంలో మన ప్రమేయం, ప్రయత్నం ఏవీ లేవు. నిద్రలో మనసుకి దేన్నీ తెలుసుకునే లక్షణం కూడా ఉండదు. అందువల్లనే నిద్రలో మనసు యొక్క స్వరూపం మనం తెలుసుకోలేం. మంత్రజపం చేస్తున్నప్పుడు అలాకాదు. మనసు యొక్క స్వరూపం వివిధ స్థాయిల్లో ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. మనసు స్వరూపంగా ఉన్న శాంతి అర్థమవుతుంది. మనసే మంత్ర స్వరూపంగా మారి అది విడిగా కనిపించనంతగా లీనమైపోతుందన్న సత్యం అనుభవంలోకి వస్తుంది. మంత్రం మనసులో లైనమయ్యే స్థితి, నిద్రలో సహజంగా పొందే స్థితి రెండూ ఒకటే. అదే మన యొక్క స్వస్థితి. భౌతిక విషయాల నుండి మరలి శివనామం జపించిన మనసు చివరికి ఆ శివనామాన్నే పొందుతుంది. ఆ సమయంలో అదే మన మనసు సహజ స్వరూపమని అర్థమవుతుంది. దీన్నే దైవదర్శనం లేదా ఆత్మదర్శనం అని అంటారు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
No comments:
Post a Comment