🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"386"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"విరాగి నిమిత్తమాత్రుడిగానే ఉంటాడు కదా, సంసార జీవితం ఎలా గడుపుతాడు ?"*
*"విరాగి తన భార్య అందం, ఆకారం, అలంకరణలతో నిమిత్తం లేకుండా ధర్మబద్ధమైన సంసారం చేస్తాడు. అదే మన భారతీయ వివాహ వ్యవస్థ చెప్తున్న నిజమైన వివాహబంధం. అందుకే కాశీకి ప్రయాణమైన విరాగికి తమ అమ్మాయిని ఇస్తామని పెళ్ళిలో అడగటం మన వివాహవ్యవస్థలో సంప్రదాయంగా ఉంది. మన బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య దశలన్నీ మోక్షాపేక్షతోనే సాగాలన్నది మన సనాతన సంస్కృతి. మోక్షాపేక్షతో ఉన్నవాడే విరాగి. అతడు మాత్రమే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు ధర్మబద్ధంగా పూర్తి చేయగలడు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
No comments:
Post a Comment