Friday, November 4, 2022

::::: వర్తమాన జీవితం:::::

 *::::: వర్తమాన జీవితం::::::*
     వర్తమాన జీవితంలో రెండు భాగాలు వుంటాయి.
1) జరిగి పోయిన కాలంలో మనం చేసిన పనుల పర్యవసానాలను అనుభవిస్తూ వుండటం.
2) రేపు వుండబోయే జీవితానికి బీజాలు నాటడం.
    మన జీవితం కార్యకారణ క్రమం.ఇది అనేక సంఘటనల కలగలపు. ఒక సంఘటన మరోక సంఘటనకి దారి తీస్తూ వీటి పర్యవసనాలను అనుభవించడం.
   నిజానికి పర్యవసానాలు సంఘటనలకు విడిగా లేకున్నా వీటి అనుభూతి భౌతిక జీవితానికి సమాంతరంగా వుంటుంది.ఈ అనుభూతే పర్యవసానం.
   ధ్యానం పర్యవసానాలను ఓర్పు తో అనుభూతి చెందిస్తూ,
రేపటి మంచి పర్యవసానాలకు 
బీజాలు నాటుతుంది
 ఈ వివరణ ఈ జీవిత కాలానికి మాత్రమే సంభందించిన విషయం. జన్మల గురించి నాకు అనుభవం లేనందున మాట్లాడను.
షణ్ముఖానంద 9866699774.
ఇట్లు
ద్రష్ట లేని దృష్టి.

No comments:

Post a Comment