ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే --
➡️ అంత ఎక్కువగా మనస్సు స్థిరమవుతుంది
➡️ అంతగా మన చైతన్యం విస్తరిస్తుంది
➡️ అంతగా వివేకం పెరుగుతుంది
➡️ అంతగా సత్యం గోచరిస్తుంది
ఈ విశ్వ రహస్యాలు మనకు మరింత వివరంగా, యధాతథంగా ప్రకాశిస్తాయి.
నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం - దాని పేరు ధ్యానం.
➡️ మౌనం వలన మన ప్రాణ శక్తి బయటకు పోకుండా ఆదా అవుతుంది.
➡️ కానీ ధ్యానం వలన బయటి విశ్వశక్తి మన లోపలికి వస్తుంది.
ధ్యానం అన్నది మౌనంతోనే ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment