Wednesday, November 16, 2022

మంత్రం నిరంతరంగా కొనసాగటం లేదు, మంత్రాన్ని ఎప్పటివరకు జపించాలి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"383"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
    
*"మంత్రం నిరంతరంగా కొనసాగటం లేదు, మంత్రాన్ని ఎప్పటివరకు జపించాలి ?"*
**************************

*"మన మనసే మంత్రస్వరూపమని తెలిసే వరకు మంత్రం కొనసాగుతూనే వుంటుంది. నిద్రలో మనం ఎక్కడికి పోలేదు. మన మనసు కూడా ఎక్కడికి పోలేదు. కానీ మనసులోవున్నవన్నీ పోతున్నాయి. పడుకున్నప్పుడు సంసారంతోపాటు మనం పూజించే ఇష్టదైవాన్ని కూడా మనసు వదిలివేస్తుంది. సహజంగా వచ్చే నిద్రలోనూ, మంత్రజపంలో వచ్చే సమాధిస్థితిలోనూ ప్రపంచంలో మనం నేర్చుకున్నవన్నీ వదిలివేయక తప్పదని మనకు తెలుస్తుంది. ఏదైనా వదిలిపెట్టేదే అని తెలిసినప్పుడు ఇక సంపాదించటం ఆపేస్తాం !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            

No comments:

Post a Comment