🎻🌹🙏 మన మహర్షులు చరిత్రలు..
🌹🙏ఈరోజు 42 వ ధౌమ్య మహర్షి గురించి తెలుసుకుందాము..🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿ధౌమ్య మహర్షి తండ్రి వ్యాఘ్రపాదుడు ధౌమ్య మహర్షికి ఒక అన్న ఉన్నాడు .
అతని పేరు ఉపమను ఉపమన్యు ధౌమ్యుల తపస్సు గురించి మనం ఉపమన్యు మహర్షి కథలో తెలుసుకున్నాం .
🌸 వీళ్ళిద్దరు పరమేశ్వరుడిని గురించి ఘోర తపస్సు చేశారు . పరమేశ్వరుడు పరివారంతో సహా ఉపమన్యు ధౌమ్యులకి ప్రత్యక్షమయ్యాడు .
🌿 వాళ్ళిద్దరు వేద మంత్రాలతోను సహస్రనామాలోనూ శివుణ్ణి స్తుతించారు . ఈశ్వరుడు వాళ్ళిద్దర్ని ఏంకావాలో అడగండి అన్నాడు .
🌸 ఉపమన్యు దేవా ! ఎప్పుడు శివభక్తి కలిగివుండేటట్లు , సర్వవిషయ జ్ఞానమూ , క్షీరాన్నంమీద కలిగిన ఇష్టమే నీ దర్శన వరకు వచ్చింది .
🌿కాబట్టి నీ అభిషేకానికి ఉపయోగించే ఆవుపాలు మాకే కాకుండా మా వంశం అందరికి ఎప్పుడు సమృద్ధిగా దొరికేటట్లు అనుగ్రహించు .
🌸 అంతేకాదు నాతోనే వుంటూ నన్నే అనుసరిస్తున్న నా తమ్ముడు ధౌమ్యుడిని కూడా అనుగ్రహించు అని ప్రార్ధించాడు .
🌿 నువ్వు ఏం కావాలని అడిగావో అన్నీ మీకు ఇస్తున్నాను . అంతేకాదు మీకు జనన మరణాలు , వృద్ధాప్యము లేకుండా మీరెక్కడ వుంటే అక్కడ ఆవుపాలు సమృద్ధిగా దొరికేట్టు అనుగ్రహిస్తున్నాను .
🌸 చివరికాలంలో మీరు మీ బంధువులు కూడా మోక్షం పొంది నను చేరతారు .
నీ తమ్ముడు ధౌమ్యుడు హరి ప్రియులైన పాండవులకి గురువుగా వుండి శ్రీకృష్ణు కటాక్షం పొందుతాడు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు పరమేశ్వరుడు .
🌿అన్నగారి దగ్గర సెలవు తీసుకుని భగీరథిని దాటి ' ఉత్కచ ' అనే తీర్థం వెళ్ళి అక్క ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు ప్రారంభించాడు ధౌమ్యుడు .
🌸 అంగారవర్ణుడనే గంధర్వరాజు పాండవులతో స్నేహంగా ఉండేవాడు . ఒకసారి గంధర్వరాజు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు .
🌿 తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు . అర్జునుడితో ఎంత గొప్ప మహారాజయిన కష్టాలు పడకుండా ఉండాలంటే ఒ పురోహితుడు ఉండాలి అని చెప్పాడు గంధర్వుడు .
🌸ఆ పురోహితుడు కూడా వేదాల చదువుకున్నవాడు , జపాలు , హోమాలు , యజ్ఞాలు చేయించగలవాడు , సత్యాన్నే పలికేవాడు బ్రాహ్మణులలో ఉత్తముడు అయివుండాలి .
🌿 అగ్ని పరిగ్రహము , బ్రహ్మణ సంగ్రహము లేక పోయిన రాజు రాణించడని చెప్పాడు అంగారవర్ణుడు . అలాంటివాడు ఎవరో చెప్పండి నేను వెళ్ళి అడిగి తీసుకువస్తాను అన్నాడు
🌸 అర్జునుడు గంధర్వరాజుతో ... ' ఉత్కచ ' అనే తీర్థంలో తపస్సు చేసుకుంటున్న ధౌమ్యుడు మీకు అన్ని విధాల తగిన బ్రహ్మాణుడని చెప్పాడు గంధర్వరాజు
🌿పాండవులు ధౌమ్యుడి దగ్గరకి వెళ్ళి తమకి పౌరోహిత్యం చెయ్యమని అడిగారు . ధౌమ్యుడు అంగీకరించాడు .
🌸 గొప్ప తేజస్సుతో బుద్ధిలో బృహస్పతి సమానుడు , వేదవేదాంగవేత్త , గొప్ప ఋషి అయిన ధౌమ్యుడు పాండవులకి పురోహితుడుగా వున్నాడు .
🌿 ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రం పడేసినప్పుడు పాండవుల వైపు పురోహితుడుగా వుండి పెళ్ళి జరిపించాడు ధౌమ్యుడు .
🌸 కృష్ణుడి అనుమతితో సుభద్రని పెళ్ళిచేసుకున్నాడు అర్జునుడు . వాళ్ళకి కలిగిన అభిమన్యుడికి , జాతకర్మ ఉపనయనం లాంటివన్నీ చేసి వేదవేదాంగాలు నేర్పించాడు ధౌమ్యుడు .
🌿ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యాలనుకుని చెయ్యలేనేమో అని భయపడ్తుంటే , ధైర్యం చెప్పి అందరు ఆనంద పడేలా యాగం పూర్తి చేయించాడు ధౌమ్యుడు .
🌸 ధర్మరాజు జూదంలో ఓడిపోయి అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు సామవేదం చదువుతూ ధౌమ్యుడు , అగ్నిహోత్రం పట్టుకుని వేలకొలదీ బ్రహ్మణులు కూడా బయలుదేరి వెళ్ళారు .
🌿వాళ్ళనిచూసి ధర్మరాజు ధౌమ్యుడి పాదాలమీద పడి మహాత్మా ! మీరే ఏదేనా ఉపాయం చెప్పాలి . వీళ్ళందర్ని ఎలా పోషించాలని అడిగాడు .
🌸 ధౌమ్యుడు ధర్మరాజుకి ధైర్యం చెప్పి సూర్యభగవానుణ్ణి ప్రార్ధించమన్నాడు . ధర్మరాజు ధౌమ్యుడు చెప్పిన ప్రకారం చేసి బ్రహ్మణులందరికీ భోజనం పెట్టగలిగాడు .
🌿 ఒకనాడు రోమశ మహర్షి ధర్మరాజు దగ్గరకి వచ్చి ఇంద్రుడు తీర్థయాత్రలు చేయించమని నన్ను పంపాడు . నేను కూడా ధౌమ్యుడితో కలిసి మీతోనే వుంటానని చెప్పాడు .
🌸 నారదుడు కూడా ధర్మరాజుకి తీర్థయాత్రలు చెయ్యమని చెప్పాడు . ధౌమ్యుడు , రోమశుడు మిగిలిన బ్రహ్మణోత్తములు అందరూ తనతో కలిసి వస్తుంటే తీర్థయాత్రలకి బయలుదేరాడు ధర్మరాజు .
🌿ఒకనాడు బ్రాహ్మణులందర్నీ చూసి మీ అందరి ఆశీర్వచనాలతో మా అరణ్యవాసం పూర్తయింది . ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యడానికి మిమ్ముల్నందర్నీ వదిలి వెళ్ళాలంటే బాధగావుంది .
🌸ఏ విఘ్నలు లేకుండా మా అజ్ఞాతవాసం కూడా పూర్తయేటట్లుగా ఆశీర్వదించమని అడిగాడు ధర్మరాజు .
🌿 బాధపడుతున్న ధర్మరాజుని చూసి ధర్మరాజా ! ఒక్కొక్కసారి శత్రువులకోసం సరయిన సమయం వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు .
🌸 దేవేంద్రుడంతటి వాడు నిషధ పర్వతం మీద మారు వేషంలో విష్ణుమూర్తి భగవంతుడయివుండి అదితిగర్భంలో వున్నాడు .
🌿ఔర్వుడు తల్లి తొడలో దాక్కున్నాడు . మార్తాండుడు ఆవు శరీరంలో అజ్ఞాతంగా వున్నాడు . తర్వాత అందరూ సుఖంగానే వున్నారు . కదా !
🌸 అలాగే నువ్వు కూడా ఒక సంవత్సరం పూర్తవగానే సుఖంగా వుంటావని ఓదార్చాడు ధౌమ్యుడు .
🌿ధౌమ్యుడు పాండవులతో మీరు రాజకుమారులు కనుక సేవకులుగా ఎలా వుండాలో తెలియదు .
🌸నేను మీకు సేవాధర్మాలు గురించి చెప్తాను అవి ఆచరించి కొంతకాలం మీరు రాజకుమారులమనే మాట మర్చిపొండని చెప్పి వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పాడు .
🌿పాండవులు అజ్ఞాతవసానికి బయలుదేరేముందు అగ్నిహోత్రం వెలిగించి వెళ్ళినపని జరగాలని పూజచేశాడు .
🌸 పాండవులు ధౌమ్యుడికి , అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి బయలుదేరి వెళ్ళారు . చివరకి మహాభాతర యుద్ధం పూర్తయ్యాక శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ధర్మరాజుకి శాస్రోక్తంగా పట్టాభిషేకం చేశాడు ధౌమ్యుడు .
🌿అంతేకాకుండా ధర్మరాజుతో దేవ , పితృ పూజలు అతిధి తర్పణాలు , బ్రహ్మణార్చనలు లాంటి ధర్మకార్యాలన్నీ చేయించి
🌸 మొదటి నుంచి చివరి వరకు పాండవుల పౌరోహిత్యం అద్భుతంగా చేసి అందరిలో గొప్పవాడిగా నిలిచి మోక్షాన్ని పొందాడు ధౌమ్యుడు . ఇదండి ధౌమ్య మహర్షి కథ !!
🌿రేపు మరెన్నో విశేషలతో మరో మహర్షి చరిత్ర తెలీసుకుందము స్వస్తి..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment