*"స్వయంభూజ్ఞానం":: సాధారణము, దైవీయుతము*
*"Swayambhu" knowledge:: Ordinary & Divine (Marefat/ Irfaan)*
*~~~~*
- సద్గురు శ్రీ మెహెర్
చైతన్యజీ మహరాజ్
(Part - 10 )
*(ప్రశ్న:: _మనకు ఇలా లక్షలాది దేవుళ్ళు ఉండడానికి కారణం ఏమిటి ??_*
(Or)
_*శివుడు తాండవం చేయవలసిన అవసరం ఏమిటి??*_)
*గురుదేవులు:: ఇక ఇటువంటి ఊహా ప్రపంచంలో–*
ఒక్కడే దేవుడు; (కానీ)
ఆయన,
ఒక్కడైన ఆ దేవుడు,
లక్షలాది దేవుళ్ళుగా
విభజింపబడిపోయాడు–
మన "ఊహ"ను
పరిపోషింపచేయడం కోసం.
*ఆ "ఊహ"లో కొట్టుమిట్లాడిపోతున్నాడు (మానవుడు). కాస్సేపు ఒక విగ్రహం బాగుందనుకుంటే, మరికాసేపు మరొక విగ్రహం బాగుందనుకుంటాడు.*
_ఈ విధంగా అనేక అనేక "కల్పిత దేవుళ్ళ"ను సృష్టించుకున్నాడు._
*ఈ "కల్పిత దేవుళ్ళ"ను సృష్టించుకోడానికి ముందు,*
- "అగ్ని"ని దేవుడన్నాడు,
- "వాయువు"ను
దేవుడన్నాడు,
- "చెట్టు"ను దేవుడన్నాడు,
- "పుట్ట"ను దేవుడన్నాడు,
- ఏదో ఒక ఉపద్రవం వచ్చి
గాలివాన వస్తే,
దీనిని ఏదో దేవుడన్నాడు;
వాటికి అవసరమైన
ఉపాసనలన్నాడు,
బలులు అన్నాడు,
మరొకటన్నాడు,
మరొకటన్నాడు.
*ఈ "ఊహ"కు ఎక్కడా అంతు లేకుండగా పెరిగిపోయింది. ఆ imaginationకు ఇక హద్దూ పద్దూ లేకుండగా పోయింది.*
_అటువంటి ఈ స్థితిలో, "దేవుణ్ణి" తప్ప అన్నింటినీ స్వీకరించేటువంటి స్థితికి వచ్చేసాడు– దేవుడి పేరుతో._
*అదీ ఇక్కడ మెహెర్ బాబా జ్ఞాపకం చేసేది.*
*దేవుని కొరకు చేసినటువంటి అన్వేషణ, ఈ లక్షలాది జన్మలలో చేసినటువంటి అన్వేషణ– ఎక్కడకు తీసుకు వచ్చింది అంటే,*
"దేవుణ్ణి" తప్ప,
మిగిలినటువంటి
ప్రతీ దానినీ
స్వీకరింపచేసేస్తుంది.
*అది, మన యొక్క ఈ "ఊహ"– "చైతన్యము"పై ప్రప్రథమ ముద్ర వేసినటువంటి ఈ ముద్ర,*
- భౌతిక చైతన్యముగా,
- సూక్ష్మ చైతన్యముగా,
- మానసిక చైతన్యముగా
*ఈ స్థితులన్నింటినీ అనుభవింప చేసేటువంటిది imagination.*
*ఇదంతా, ఈ కల్పిత దేవతలను సృష్టించుకొని మానవుడు– ఎవరో (ఎక్కడో) ఉంటాడు (ఒక) జిజ్ఞాసి, ఏ ఏకలవ్యుడిలాంటి వాడో ఉంటాడు. (ఆయన)::*
_గురువును అన్వేషించాడు. (ఆ గురువు) నీకు విద్యను చెప్పను పొమ్మన్నాడు. (అయినా) "నీవే నాకు గురువు" అని చక్కగా బొమ్మను చేసుకొని, ఊహించుకొని– విద్యను అభ్యసించాడు._
*అటువంటి జిజ్ఞాసువులు లేకపోలేదు, ఉన్నారు. (కానీ) ఇటువంటివన్నీ ఆధారంగా చేసుకొని, స్వార్థపరులైనటువంటి వారందరూ కూడా– ఈ కల్పిత దేవతలను సృష్టించి, మనముందుంచారు. ఎందుకంటే, ఈ imagination పెరిగిపోయింది. ఆ imaginationలో (ఏమనుకుంటాము అంటే)–*
"దేవుడు తప్ప గతి లేదు;
దేవుడే నాకు సహాయం
చేయాలి.
- "రోగము" వస్తే,
దేవుడే తగ్గించాలి;
- "ఆర్థిక ఇబ్బందులు" వస్తే
దేవుడే తొలగించాలి.
వీటికి అన్నింటికీ
తృప్తిని ఇచ్చేది
దేవుడే!"
*అనేటువంటిది మనలో మిగిలిపోయింది. దానిని ఆసరాగా తీసుకున్నారు. "దక్షిణలివ్వండి, వ్రతాలు చేయండి" అని చెప్పి మనలను ప్రలోభపెడుతున్నారు, భ్రమపెడుతున్నారు.*
_ఇటువంటి భ్రమలకు లోనైనటువంటి మానవునకు ఒక్కటే లక్ష్యము. ఏమిటది?_
"దుఃఖము" నుండి
తప్పించుకోవాలి;
"సుఖము"ను
అనుభవించాలి (అని).
_"సుఖానుభవం", Happiness అనేటువంటిది కోరిక. దానిని ఆలంబనంగా చేసుకొని– ఈ దేవతలను, దేవుళ్ళను, ఈ అక్కరలేని వారందరినీ సృష్టించేసారు._
*అందుకని ఆయన ఈ నిద్రావస్థ నుండి లేచాడట– "ఏమిటి ఈ ఘోరం ఇలాగ జరిగిపోయింది" అని. లేచి, విలయ తాండవం చేసాడట. శివ తాండవం.*
*గోపీకృష్ణ అని ఒకాయన, అందులో ప్రావీణ్యం గడించాడు.*
_ఒకసారి అది (ఆ తాండవాన్ని, ఆయన) చూడడం తటస్థించింది. ఒళ్లు గగుర్పొడిచేసింది. భయం వేసేసింది, ఆ నృత్యం చూచేసరికి. అటువంటి విలయ తాండవంలో, ఆయనకు solution అక్కడ కనిపించిందట. ఏమిటంటే,_
"నేను వ్యక్తం కావాలి"
అని.
*ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిదంతా, "బ్రహ్మాండ్" లోనిది.*
_అలాగ "వ్యక్తం కావాలి!" అనేటువంటి అనుభవం నుండే– అవ్యక్తమైనటువంటి సృష్టి అంతా వ్యక్తమైంది..._
To be contd.....
No comments:
Post a Comment