Sunday, February 19, 2023

భగవద్గీత - ప్రాముఖ్యత

 *భగవద్గీత - ప్రాముఖ్యత*

*Importance Of Bhagavadgeeta*

*కోర్కె కలుగుతుంది. కోరుకున్నది సొంతం కావాలనిపిస్తుంది. సొంతమైనది మరల కోర్కెను కలిగిస్తుంది. ఈ విధంగా ఒకదాని వెంట మరొక కోరిక.. చివరకు తుఫానులో చిక్కుకున్న పడవలాగా క్రుంగదీస్తుంది. కేవలం ఒక జంతువులాగా చేస్తుంది మనల్ని. ఇది మానవుని పతనావస్థ.* 

*మనం ఇటువంటి విషమ పరిస్థితులను అధిగమించడానికి వేదాంతం మనకు మార్గాన్ని నిర్దేశిస్తుంది.*

*ఇంద్రియ నిగ్రహంతో, మానసిక సమతుల్యత కలుగుతుంది. మానసిక సమతుల్యతతో బుద్ధి నిశ్చలమవుతుంది. అప్పుడు ఎటువంటి భయం లేకుండా మనం ప్రపంచ వ్యవహారాలను నడుపుకోవచ్చు.*

*మంచి గుర్రాలు, వాటిని అదుపులో పెట్టె పగ్గాలు, మంచి రథసారథి - ఇవి ఉంటే మన జీవన ప్రయాణం సుఖంగా సాగుతుంది. బలహీనమైన పగ్గాలు, అదుపు తప్పిన గుర్రాలు అయినట్లయితే ప్రయాణం ప్రమాదకరం అవుతుంది.* 

*జీవితం అంటే బాగా ధనం సంపాదించి సుఖంగా ఉండటం కాదు. పూర్తి జీవన విధానంలో పరిపూర్ణుడుగా కాగలిగితే జీవితంలో ఉత్తీర్ణుడైనట్లుగా భావించాలి.*

*నేను సాధారణమైన వ్యక్తిలా ఉండాలా? లేక అసాధారణమైన వ్యక్తిలా ఉండాలా? అని, మనకు మనమే ప్రశ్నించుకోవాలి.* 

*ఎవరో వచ్చి మనల్ని తీర్చిదిద్దరు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి.*

*ధన్యవాదాలు....*

No comments:

Post a Comment