Tuesday, February 7, 2023

అమృత వచనం

 https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v

🌺 అమృతం గమయ 🌺

*అమృత వచనం*

అందరి *కన్నీళ్లు* మనం తుడవకపోయినా పర్లేదు *కానీ*! ఏ ఒక్కరి *కన్నీళ్లకు* మనం *కారణంగా* ఉండకూడదు 

       మనం *కంటితో* చూడనివి *చెవులతో* విననివి ఎప్పుడూ *నమ్మవద్దు* . ఇతరులకు చెప్పవద్దు ఎందుకంటే *కొంతమంది* చెప్పేమాట వల్ల కొన్ని *స్నేహాలు* చెడిపోతాయి *కుటుంబ బంధాలు* తెగిపోతాయి . 

    *మనిషి* అందంగా కనపడాలంటే ఎన్నో రకాల *తెరలు* తొలగించాలి , కానీ *మనసు* అందంగా కనపడాలంటే మాత్రం *అహం , అసూయ , ఈర్ష్య , ద్వేషం* అనే *అడ్డు* పొరలను *తొలగిస్తే* చాలు .

      మన *వ్యక్తిత్వానికి* మించిన *అందం* లేదు , మనలో *సాధనకు* మించిన *అదృష్టం* లేదు , నీ *ప్రేమకు* మించిన *తోడు* లేదు , నీలో *ప్రతిభకు* మించిన *ధనం* లేదు , మన *విజయానికి* మించిన *ఆనందం* లేదు , నీ *ధైర్యానికి* మించిన *శక్తి* లేదు , మన *త్యాగానికి* మించిన *గొప్పతనం* లేదు .

      నాదే *కరెక్ట్* అనుకోవడం *అహంకారం*, ఎదుటివారు ఎందుకూ *పనికి రాని* వారు అనుకోవడం *అవివేకం*, తనవైపు నుంచే *ఆలోచిస్తూ* ఎదుటి వారి గురించి *పట్టించుకోక* పోవడం *స్వార్థం* . దయచేసి ఎదుటివారిని గుర్తించటానికి ప్రయత్నిస్తే మనల్ని కూడ మనం ఉన్నామని ఎవరో ఒకరు తప్పక గుర్తిస్తాడు. ఎవరు గుర్తించకపోయినా దైవం గుర్తించక మానడు.

No comments:

Post a Comment