Sunday, February 5, 2023

శ్రీరమణీయం: సంసారిగా ఉంటూ సన్యాసిగా జీవించటం కుదురుతుందా ?

 💖💖💖
       💖💖 *"455"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"సంసారిగా ఉంటూ సన్యాసిగా జీవించటం కుదురుతుందా ?"*

*"అది మనసును బట్టి ఉంటుంది. అద్ధం ఎప్పుడూ తాజా ప్రతిబింబాన్నే చూపుతుంది. అది ప్రతిరూపాలను తనలో దాచుకోదు. అభ్యాసం చేసి మన మనసును కూడా నిరంతరంగా అలా ఉంచుకోగలిగితే అది సన్యాస జీవితంతో సమానం అవుతుంది. నిజానికి మన మనసు అనేక విషయాలను సహజంగానే సన్యసిస్తుంది. ఆఫీసు పనిలో మునిగిన మనసు ఇల్లు, ఇల్లాలు, పిల్లలను జ్ఞాపకమైనా తెచ్చుకోదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీసును స్మరిస్తూ కూర్చోదు. టీవీ సీరియల్ చూసే గృహిణి ఎవరైనా పరిచయస్తులు వస్తే అయిష్టంగానే టీవీ కట్టేస్తుంది. కానీ టీవీ చూస్తున్నప్పుడే తన కొడుకు మేడపై నుండి పడితే కనీసం టీవీని పట్టించుకోకుండానే పరుగు పెడుతుంది. ఇలా మనం నిత్య జీవితంలో ఎన్నో విషయాలను సహజంగానే వదలుగలుగుతున్నాం . మనసును అలా మలుచుకోగలిగినప్పుడు సంసారికి కూడా అది సన్యాస జీవితంతో సమానమే !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            

No comments:

Post a Comment