*:::::::::::: సంబంధం ::::::::::*
జీవితం అంటేనే సంబంధం.
సంబంధం లేకుండా జీవితం లేదు.
మన చుట్టూ మనతో పాటు వుండే మనుషులు, వస్తువులు,సంఘటనలు, సమాచారం,వీటి అన్నింటితో వున్న సంబంధమే జీవితం.
ప్రశ్న ఏమిటంటే మనం వీటితో నేరుగా సంబంధం పెట్టుకున్నామా??? లేదు
. ముందుగా మనం వీటి అన్నింటి పట్ల అభిప్రాయాలు, ఇష్టాలు, అనుభవాల జ్ఞానం,వీటి తాలూకా ముద్రలు పెట్టు కొని సంబంధం కొనసాగిస్తున్నాము.
అనగా మన సంబంధం మనం అభిప్రాయాలతోనే , ముద్రలతోనే,కాని అసలు విషయం తో కాదు.
అందుకే ఘర్షణ, అసంతృప్తి,
అలాగే మనం ధ్యానం తో నేరుగా సంబంధం లో లేము. మన సంబంధం, మనం ఇచ్చు కున్న ధ్యానం యొక్క నిర్వచనం తో.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment