Sunday, February 5, 2023

శ్రీరమణీయం: మనోవృత్తుల మాట ఏమిటి ? వాటిని ఎలా నిరోధించుకోవాలి ??"

 💖💖💖
       💖💖 *"456"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"మనోవృత్తుల మాట ఏమిటి ? వాటిని ఎలా నిరోధించుకోవాలి ??"*

*"మనం చేసే పనులకు సంబంధించిన జ్ఞాపకాలే మనోవృత్తులు అవుతున్నాయి. సాఫీగా సాగే నీటి ప్రవాహం ఒకచోట గుండ్రంగా సుడులు తిరుగుతుంది. అది సుడిగుండం. అది ప్రవాహంలో భాగమే. కానీ అందులో ప్రవాహంలో లాగా తాజా నీరు ఉండదు. మన మనోవృత్తులు కూడా అంతే. మనసుకు పాత విషయాలను అందించి తాజాదనాన్ని (వర్తమానాన్ని) లేకుండా చేస్తాయి. కళ్ళెదురుగా చూసిందే మనసులో సుడిగుండంలా తిరుగుతూ పదే పదే జ్ఞప్తికి తేవటం మనోవృత్తి అయ్యింది. మనసులో తిరిగే విషయాలను గుర్తించి ఆ వ్యాపకాలను తగ్గించుకుంటే మనోవృత్తులు బలహీనపడి అద్భుత శాంతి వస్తుంది. మనోవృత్తి ఆగిన ప్రతిక్షణం మనలో జరిగేది ధ్యానమే. మన చుట్టూ అన్నీ ఉన్నా, మనలో అనేక జ్ఞాపకాలు ఉన్నా, అవేవి మనసులోకి రాని క్షణం మనలో శాంతి నెలకొంటుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            

No comments:

Post a Comment