*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 307 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. వివేకవంతులు దేవుడికి లొంగి పోతారు. తమకి ఆక్రమించు కొమ్మని ఆహ్వానిస్థారు. దేవుణ్ణి సొంతం చేసుకోలేవు, నువ్వు దేవుడికి సొంతం కావచ్చు. వ్యక్తి లొంగిపోవాలి. సంపూర్ణంగా లొంగిపోవాలి. 🍀*
*విజయానికి ప్రేమ ఒక్కటే వంతెన. కానీ అది వింతైన వంతెన. కానీ ప్రేమకు అవసరమయిన మొదటి విషయం ఆత్మ సమర్పణ. అది లొంగిపోవడం ద్వారా పొందే విజయం. అందువల్ల అక్కడ అద్భుత సౌందర్యముంది. అది దౌర్జన్య పూరితం కాదు, స్వీకరించే తత్వం. అది ఆక్రమించడం ద్వారా కాదు. లొంగిపోవడం ద్వారా విజయం సాధిస్తుంది.*
*దేవుణ్ణి ఆక్రమించు కోవాలనుకున్న వాళ్ళు బుద్ధిహీనులు. అది వాళ్ళ వల్ల కాదు. వివేకవంతులు దేవుడికి లొంగి పోతారు. తమకి ఆక్రమించు కొమ్మని ఆహ్వానిస్థారు. దేవుణ్ణి సొంతం చేసుకోలేవు, నువ్వు దేవుడికి సొంతం కావచ్చు. ప్రేమ లొంగిపోవడానికి సిద్ధపడుతుంది. వ్యక్తి లొంగి పోవాలి. సంపూర్ణంగా లొంగిపోవాలి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment