*::::::: మానసిక పెట్టుబడి ::::::::*
మనం కొంత మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తాం.
అలాగే కొంత పెట్టుబడి పెట్టి భూములు, భువనాలు, షేర్లు కొంటాం.
ఇలా మనం పెట్టుబడి పెట్టేది లాభం లేదా ప్రతిఫలం ఆశించి.
లాభం రాకపోతే దుఃఖిస్తాం.
ఇది భౌతిక పెట్టుబడి .
మనం ఇతరులను ప్రేమిస్తాం, ఇతరులను సాకుతాము, ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటాం.
ఎందుకంటే తిరిగి వారు మనలను ప్రేమిస్తారని,సాకుతారని, అనగా ప్రతిఫలం ఆశిస్తున్నాము. ఇక్కడ మన పెట్టు బడి ప్రేమ.
అందుకని ఇది మానసిక పెట్టుబడి.
అందుకే అన్నారు అన్ని సంబంధాలు వ్యాపార సంబంధాలు అయినాయి అని.
ధ్యానం పెట్టుబడి కాదు. శిక్షణ
*షణ్ముఖానంద 9866699774*
No comments:
Post a Comment