1201. 2-5. 050223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ఇండోనేషియా వాళ్ళంటున్నారు…*
*ఇస్లాం మామతం!*
*కానీ…*
*రామాయణమే… మాసంస్కృతి!!*
➖➖➖✍️
*ఒకసారి #పాకిస్తానీ నియంత జనరల్ జియావుల్ హక్ ఇండోనేషియా వెళ్ళాడు. అది ఒక ముస్లిందేశమని అందరికీ తెలిసిన విషయమే.*
*వాళ్ళు సైన్యశిక్షణానంతరం ఉండే passing out parade కి జియావుల్ హక్ ని ముఖ్య అతిథి గా ఆహ్వానించారు.*
*ప్రతీ అధికారి అక్కడున్న #హనుమంతుని విగ్రహం ముందు పెరేడ్ చేస్తున్నాడు. ఆ విగ్రహం ముందే శపథం స్వీకరిస్తున్నాడు. ఇది చూసిన జియావుల్ కి ఒళ్ళు మండిపోయింది. అక్కడి సైన్యాధికారిని ఇదేమిటని అడిగాడు.*
*అతను ఎంతో గర్వంతో - "తాము మతాన్ని మార్చుకున్నామేగానీ, మా సంస్కృతిని, పూర్వీకులను మార్చుకోలేదు గదా!" అని సమాధానమిచ్చాడు.*
*వాళ్ళు పరిరక్షిస్తున్న సంస్కృతి భారతీయులనుండి వారసత్వంగా గ్రహించినదే కదా! వాళ్ళే అంత శ్రద్ధ తీసుకుంటున్నపుడు భారతీయులమైన మనం, మన సంస్కృతీ పరిరక్షణలో ఇంకెంత శ్రద్ధ వహించాలి?*
*సెక్యులరిజం అనే గోలలో పడిపోయి, మతనిరపేక్ష దేశం నుండి సంస్కృతీనిరపేక్ష దేశంగా ఎలా, ఎందుకు వెళ్ళిపోతున్నాము? మన సంస్కృతిని మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము. ఎలాగో చెప్తాను. ఒక ఉదాహరణ చూపిస్తున్నాను…*
*1950వ దశకం లో #ఇండోనేషియా లో #అంతర్రాష్ట్రీయ_రామాయణ మహోత్సవం జరిగింది.*
*అందులో భాగంగా జరిగే ఒక నృత్యనాటికలో పాల్గొనుటకు కళాకారులను పంపమని ఆదేశం ప్రపంచదేశాలకు ఆహ్వానం పంపింది.*
*కొన్ని ముస్లిందేశాలు కూడా కళాకారులను పంపాయి.*
*కానీ అప్పటి ప్రధాని నెహ్రూ - "మనది సెక్యులర్ దేశమనీ, అందువలన కళాకారులను పంపటం కుదరదు" అని తెలిపాడు.*
*అంటే, #మనదేశ సంస్కృతీ పరిరక్షణ కన్నా అతగాడికి సెక్యులరిజం ఎక్కువైపోయింది.*
*అయితే, ఆశ్చర్యంగా ఇందిరాగాంధీ ఇంకొకపని చేసింది. మొరాకో రాజధానిలో జరిగే అంతర్రాష్ట్రీయ ముస్లిం సమ్మేళనానికి అప్పటి కేంద్రమంత్రి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ను పంపింది.*
*అసలు విషయమేమంటే - మనకు అసలు ఆహ్వానం అందనే లేదు. పైగా ఏమని సమర్థించుకుందో తెలుసా?*
*చాలాముస్లిందేశాలకన్నా మనదేశంలో ముస్లింల జనాభా ఎక్కువట , కాబట్టి పంపక తప్పలేదట.*
*మీరంతా తెలివైనవారు కాబట్టి నేను విషయాన్ని వివరించనవసరం లేదు*.
*గత సంవత్సరం, #ఇండోనే షియా దేశం యొక్క విద్య, మరియు సంస్కృతీ శాఖామంత్రి #అనీస్_బాస్వేదన్ మనదేశం వచ్చారు.*
*ఏమన్నారో చూడండి …
*”మా దేశం రామాయణ ప్రదర్శనలకు పెట్టిందిపేరు. మా కళాకారులు సంవత్సరంలో రెండుసార్లు మీదేశం లోని వివిధ నగరాలలో పర్యటించి రామాయణప్రదర్శనలు చేయడానికి అనుమతించండి. మీ కళాకారులు కూడా మా దేశానికి రండి.*
*ఇరుదేశాలు కలిసి ప్రదర్శనలు చేద్దాము. ఇరుదేశాల విద్యార్థులకు కూడా శిక్షణ ఇద్దాము.*
*మా విద్యావిధానంలో రామాయణాన్ని చేర్చాము"*
*ఈ విషయం మీ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించిందా? లేదా? చెప్పండి.*
*ఇండోనేషియా మొదటి రాష్ట్రపతి #సుకర్ణో సమయంలో , పాకిస్థాన్ కు చెందిన డెలిగేషన్ ఒకటి అక్కడ పర్యటించింది.*
*అపుడు వాళ్ళు #రామలీల ప్రదర్శించడాన్ని చూసి షాక్ తిన్నారట. ఒక ముస్లిం దేశంలో రామలీలా? అని అడిగారట. దానికి సుకర్ణో సమాధానమేమిటో తెలుసా?*
*ఆయన ఇలా 👇అన్నారట: -*
*ఇస్లాం మా మతం! అంతే , కానీ రామాయణం మా సంస్కృతి!!*
*వారి కరెన్సీ నోట్ పై బొజ్జ గణపయ్య చిత్రం ముద్రించారు*
*అటువంటి దేశాధ్యక్షుడికి, తమ సంస్కృతీ పరిరక్షణలో భారతీయులకు ఆదర్శంగా నిలుస్తున్న ఇండోనేషియా ముస్లింలకు శతకోటిప్రణామాలు.*
*ఏదేశమేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీతల్లి భూమి భారతిని.* ✍️
హరిః ఓమ్. హరిః ఓమ్.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment