Sunday, February 19, 2023

మంచి మాటలు

 🙏మంచి మాటలు 🙏

పేదరికం వేరు
దారిద్ర్యం వేరు
రెండూ వేరు వేరు


పేదరికం అంటే లేకపోవడం 
దారిద్ర్యం అంటే ఎంతున్నా
చాలదనుకోవడం 

అలాగే తృప్తి, సంతోషం, ఆనందం ఈ మూడూ వేరు వేరు

తృప్తి అనేది శరీరానికి చెందినది (ఇది తాత్కాలికం)
సంతోషం అనేది మనసుకి చెందినది (ఇదీ తాత్కాలికమే)
ఆనందం అనేది ఆత్మకు సంబందించినది (ఇది శాశ్వతం)

ఇక దానాలు మూడు రకాలు
అన్నదానం
వస్త్రదానం
విద్యాదానం 

అన్నదానం చేస్తే దాని విలువ ఆరు గంటలు వుండొచ్చు

మరి వస్త్రదానం చేస్తే దాని విలువ ఆరు నెలలు వుండొచ్చు

ఇక విద్యాదానం చేస్తే దాని విలువ ఒక జీవితం అంతా వుంటుంది

కానీ ధ్యాన దానం చేస్తే దాని విలువ ఈ జన్మకే కాకుండా మళ్ళీ జన్మకు కూడా ఉపయోగపడుతుంది

ఇదే ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది

అందుకే ధ్యానం శరణం గచ్ఛామి

ధ్యానమే ధన్యం
ధ్యానమే ధనం
ధ్యానమే ఇంధనం
ధ్యానమే ధర్మం
ధ్యానమే నిత్యం
ధ్యానమే మౌనం
ధ్యానమే సత్యం 
👏👏👏👏👏

No comments:

Post a Comment