Wednesday, February 8, 2023

ఆశ్రితులుగా ఉన్నవారు ఆశ్రయ దాతలు మేలుకోరటం ఉత్తమమైన ధర్మం. ఇదే ఆశ్రిత లక్షణం అంటుంది మహాభారతం.

 మనిషి మరో మనిషికి ఆసరా ఇవ్వటం, ఆశ్రయం కల్పించడం మానవతకు సీమాభూమి.ఇది అతనిలోని దైవ సంపద్విరూప వీచిక.దీనివల్ల ఆ మానసి భగవంతునికి ప్రీతిపాత్రుడు అవుతాడు. ఇక ఆశ్రయం పొందిన వాడు ఆశ్రయం పచ్చగా ఉన్నంతవరకు ఆశ్రి
తుడు కూడా ఉంటాడు. ఆశ్రయ ప్రాప్తాలైన సుఖ భోగాలు అనుభవిస్తాడు. ఆశ్రయ దాత తనకే ఠికానాలేని స్థితికి వచ్చాడు. ఏమవుతుంది?సంపదలు పోగానే బంధువులు సాగిపోయినట్లు ఆశ్రయం వట్టి పోగానే ఆశ్రితులు అన్యాశ్రయాన్వేషణ చేసుకుంటూ వదిలిపోతారు. ఇది లోక సాధారణం. పచ్చగా ఉన్నవాడు తాను నిప్పచ్చరమైన స్థితికి చేరుకునేటప్పటికీ "వీడిక మనకేం చేస్తాడు? అన్న ఎల్లి దపు తలంపుతో ఇంతకాలం వాడు కల్పించిన ఆశ్రయానికి కృతజ్ఞతగానో, కృతఘ్నతగానో వీడిపోతాడే తప్ప తనని కష్టాల్లో ఆదుకున్న వాడిని ఆశ్రయ దాతను గూర్చి ఆలోచిస్తూ కూర్చోడు. తన దారి తాను చూసుకుంటాడు. గుట్టు చప్పుడు కాకుండా మరో గూడు వెతుక్కుంటాడు.ఇది కాని పని సుమా అంటుంది మహాభారతం.నీ ఆశ్రయ దాత దుస్థితి నీది కాదా? దానికోసం నువ్వు అనుతప్పించవద్దా! అంటుంది. ఈ సందర్భంగా ఒక కథను పేర్కొంటుంది. ఒక అడవిలో వేటగాడు విషలిప్త బాణంతో లేడిని కొట్టబోగా గురి చెప్పి అది ఒక చెట్టుకు గుచ్చుకుంది.పళ్ళు, కాయలు, ఆకులు, కొమ్మలతో పక్షులతో పచ్చగా నవనవలాడుతున్న చెట్టు బాణపు ప్రభావం వల్ల మ్రోడు వారి పోయింది.ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక ఉంటోంది.చెట్టు మ్రోడైపోయినా కదలకుండా ఆ చిలుక మాత్రం ఆ తొర్రలోనే ఉంటోంది. అప్పుడు దేవేంద్రుడు ఆ మ్రోడు వారిన చెట్టు దగ్గరికి వచ్చి ఆ చిలుకతో మ్రోడువారిన దాన్ని వదిలి మరో పచ్చని చెట్టును వెతుక్కోవచ్చు కదా! అంటాడు. "పండినప్పుడు ఉండి, ఎండి పోగానే వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా?నాకు ఆశ్రయము ఇచ్చింది ఈ ఫలవృక్షం.దానికి కష్టకాలం వచ్చింది.నా ఆశ్రయ దాతను కష్టాల కడలిలో వదిలేసి నాపాటికి నా బ్రతుకు కోసం నేను పరుగులెత్తడం ఆశ్రితలక్షణం కాదు కదా! అంటుంది ఆ చిలుక ఇంద్రునితో .ఇది విని ఇంద్రుడు చాలా సంతోషించాడు. నీ సద్బుద్ధి నాకు నచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. వరమేదైనా కోరుకో ఇస్తానన్నాడు. అప్పుడు చిలుక తనను ఆశ్రయించి ఇప్పుడు మ్రోడు వారిన వృక్షానికి పూర్వవైభవం వచ్చేటట్లు చేయమంది. ఇంద్రుడు సరే అన్నాడు మ్రోడు కాస్తా పళ్ళు, కాయలతో, ఆకులతో, కొమ్మలతో నవనావలాడుతున్న చక్కటి ఫలవృక్షంగా ఏర్పడింది. చిలుక తానున్న చెట్టు మ్రోడు వారగానే మరో చెట్టును వెతుక్కోవటం పెద్ద కష్టమేమి కాదు.కొరగాని ఆశ్రయాన్ని విడిచి సమర్థమైన ఆశ్రయాన్ని అన్వేషించి చేరుకోవటం నీతి, లోకరీతి కూడాను.కాని అది మానవత కాదు సుమా అంటుంది మహాభారతం. ఆశ్రితులుగా ఉన్నవారు ఆశ్రయ దాతలు మేలుకోరటం ఉత్తమమైన ధర్మం. ఇదే ఆశ్రిత లక్షణం అంటుంది మహాభారతం.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment