Sunday, February 5, 2023

శ్రీరమణీయం: వ్యక్తిత్వం ఏవిధంగా విశృంఖలం అవుతుంది ?

 💖💖💖
       💖💖 *"453"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
    
*"వ్యక్తిత్వం ఏవిధంగా విశృంఖలం అవుతుంది ?"*

*"మనలో వ్యక్తమయ్యే గుణాలనే వ్యక్తిత్వం అంటారు. పట్టుబట్టలతో ఇంట్లో కూర్చొని పూజ చేస్తున్నప్పుడు మనకి ఏగుర్తింపు ఉండదు. ఇంట్లోలేని వ్యక్తిత్వం బయట ఎవరైనా తనను గమనిస్తున్నారని తెలియటంతోనే బిడియపడటం, గుర్తింపును కోరుకోవటంతో మొదలైన వ్యక్తిత్వం తనను ఇంకా ఎవరెవరు గుర్తిస్తున్నారనే గమనింపుతో మరింతగా విస్తరిస్తుంది. ఇతరుల మెప్పుకోరుకునే వ్యక్తిత్వం వృద్ధి అవుతుంది. మనం ఎవరి ఇంటికో వెళ్తాం. వాళ్ళు మనల్ని ఆదరిస్తే సంతోషం, లేకుంటే కోపం వస్తుంది. అనుకున్నది జరగకపోతే అసహనం వస్తుంది. మన మనసు ఇలా ఎన్నో నాటకాలు ఆడుతుంది. అందరితో కలిసి ఉన్నప్పుడు తాను ఆడ, మగ అనే భావంతో ఉంటుంది. అదే బాత్రూంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భావం కలుగదు. మనలోని అన్ని గుణాల కలయిక వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. ఆ వ్యక్తిత్వం సమూలంగా పోవాలంటే మనలోని అన్ని రకాల గుణాలు పోవాలి !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            

No comments:

Post a Comment