110223a1130. 120223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀767.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*కత్తిని ఉంచటానికి ఒరను ఉపయోగిస్తాం. అవసరమైనప్పుడు ఒర నుంచి కత్తిని బయటకుతీస్తాం.*
*పని పూర్తయ్యాక మరలా ఒరలో కత్తిని ఉంచుతాం. *
*ఇక్కడ కత్తి వేరు, ఒర వేరు. ఒరలో ఉన్నంత మాత్రాన కత్తి, కత్తి కాకుండా పోదు. ఒరని కత్తి ఉపయోగించుకుంటుంది. *
*అలాగే ఆత్మ ఈ శరీరమనే కోశాన్ని ఉపయోగించుకుంటుంది. ఇక్కడ ఒర అంటే శరీరము. అలాగే కత్తి అంటే ఆత్మ అని తీసుకోండి.*
*పంచకోశాలతో తయారైంది ఈ శరీరము. శరీరంతో ఉన్నంతమాత్రాన మనిషి ఆత్మ కాకుండా పోడు.*
*చైతన్య స్వరూపమైన ఆత్మ పంచకోశాలను కలిగిన శరీరంలో ఉంది. అలాగని ఆత్మ పంచకోశాలు కాదు. దేహమూ కాదు. ఆత్మ మాత్రమే.*
*పంచకోశాల కన్నా వేరుగా ఉన్న ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి. పంచకోశాలతో కప్పి ఉన్న జీవుడు తాను పరిమితుడనని భావిస్తుంటాడు. వాటి వికారాలన్నీ తనవిగా భ్రమపడతాడు. వాటి గుణాలు తనవే అనుకుంటాడు. తన నిజస్వరూపాన్ని మరచిపోతాడు.*
*విచారణ చేసి చూస్తే, తాను ఈ పంచకోశాలు కాదని, వాటికన్న తాను వేరుగా, విలక్షణంగా, వాటిని గమనిస్తూ, కేవలం సాక్షిగా చూస్తూ ఉన్న ఆత్మ చైతన్యాన్ని అని గ్రహిస్తాడు.*
*చూడడం అనేది నిరంతరం ప్రాక్టీస్ చేయాలి.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment