*శుభోదయం..😊🙏🏻💐*
ఇరవై ఏళ్ళ క్రితం..
ఓ విధి.. విచిత్రాల విధి.. అంటూ..
*విధి* చూసాం..
*అంతరంగాలు* చూసాం..
*మెట్టెలు సవ్వడి* చూసాం..
*మొగలిరేకులు* చూసాం..
*కలవారి కోడలు* చూస్తున్నాం..!
ఏండ్లు గడిచిపోయినవి..
టీవీ సీరియల్లు చూస్తూ చూస్తూ..
అప్పుడు వారెలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే ఉన్నారు..
మనమే ఏంటో..
ఇలా ఐపోయాం..!?
కదలలేక మెదలలేక
మోకాళ్ళు పట్టేసి..
ఊబకాయంతో..
మధుమేహంతో
రకరకాల రుగ్మతలతో..
బాధపడుతున్నాం..
గంటల తరబడి ఠంచనుగా
ఆ సమయానికి టీ.వి మ్రోగాల్సిందే..
ఒకటి తరువాత ఒకటి
సాంతం ఎంతో ఏకాగ్రతగా చూడాల్సిందే..
భార్యకోసం భర్త ,
భర్త కోసం భార్య ,
వీరికోసం కోడలు పిల్ల..
ఆ పిల్ల - పిల్లలతో సహా
ఇంటిల్లిపాదీ మూకుమ్మడిగా....
మనస్సుల్లో..
ఆ భావావేశాల ఆవేశం నింపుకోవాల్సిందేనా..!?
వారి కంటనీరు చిందించే అభినయం మన గుండెల్లోనూ
వ్యధగా మారాల్సిందేనా..!?
వారి కక్ష్యలు , పగలు
మన ఎదలోనూ రగలాల్సిందేనా..!?
ఈర్ష్యాద్వేషాలతో,
విషపు ఆలోచనలతో..
మన మనసులూ కలుషితం కావాల్సిందేనా..!?
ఎంత ప్రమాదం..!
ఎంత ప్రమాదం..!!
ఇది కాదు మన జీవన శైలి
ఇది కాదు మన జీవన సరళి
ఇది కానే కాదు మన దినచర్య...
టీవీ సీరియల్ల విషంతో..
మన మనసులు నింపుకొవద్దు..!
అతిగా మొబైల్ వాడకంతో శరీరాలను
రేడియేషన్ కి గురిచేయద్దు..
గంటల తరబడి వీక్షణతో
శరీర కదలికలను మరిచిపోవద్దు.
*మానసిక ప్రశాంతతకు నిత్యం ధ్యానం చేద్దాం..!*
*నిత్య ప్రాణాయామ ప్రక్రియతో జీవితాలను అందంగా ఆరోగ్యంగా తీర్చి దిద్దుకుందాం..!*
*యోగాసనాలు, సూర్య నమస్కారాల సాధనతో సంపూర్ణ ఆరోగ్యవంతులౌదాం*
మంచి ఆహారం ,
మంచి ఆలోచనలు..
శీరీరానికైనా..
మనసుకైనా..
తరతరాల ఆరోగ్యాన్ని సిద్దింపజేస్తాయి..!
అమ్మ బాగుంటే
కుటుంబం బావుంటుంది..
కుటుంబం బాగుంటే
ఇళ్ళు బావుంటాయి
ఇళ్ళు బాగుంటే
ఊర్లు బావుంటాయి
ఊర్లు బాగుంటే..
తరతరాలూ
ఈ దేశం బావుంటుంది..!
*మెరుగైన సమాజ నిర్మాణానికి అమ్మే పునాది రాయి..!*
*అమ్మలందరికీ వేనవేల వందనాలు..!!*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
*- సదా మీ శ్రేయోభిలాషి*
No comments:
Post a Comment