Sunday, December 3, 2023

పేదల బడిలో అలజడి

 *పేదల బడిలో అలజడి*✍️

🚩 ఐదేళ్ళ సర్కారు ఏలుబడి
ప్రజల బడులపై పిడుగుపడి🚩

🚩నాడునేడుతో అందచందాలు అద్దబడి
డీఎస్సీలు లేక చదువులు చచ్చుబడి🚩 

🚩అమ్మఒడితో ప్రజాబడికి వాతపడి
ప్రైవేటు బడికి ఆనందాల జడి🚩

🚩విలీనంతో దూరమాయ పల్లె బడి
ఇంటి ముందుకొచ్చె బస్సుబడి🚩

🚩ప్రపంచ బ్యాంకుకు ప్రభుత్వం లోబడి
విద్యాసంస్కరణలతో అమ్మబడి మూతబడి 🚩

🚩117తో వర్కులోడు మీదబడి
బోధన నాణ్యత పలచబడి🚩

🚩ప్రజాబడులపై ప్రభుత్వ దూత దాడి
ఉపాధ్యాయుల గుండెల్లో అలజడి🚩

🚩యాపులతో చదువులు తడబడి
ఉపాధ్యాయులపై పెరిగిన పనిఒత్తిడి🚩

🚩దూత మెప్పుకై అధికారగణం పరుగడి 
తాఖీదులతో టీచర్లపై విరుచుకుపడి🚩

🚩వర్కుబుక్కులతో రోజంతా కుస్తీపడి
బోధనలేక మనసు దిగులుపడి🚩

🚩మనమంతా ఏకమై నిలబడి
కాపాడుకుందాం మనబడులను కలబడి 🚩సేకరణ మోహన్ 💐💐🙏🙏

No comments:

Post a Comment