ఆశిస్తే ఆనందం
శాసిస్తే సంతోషం
ఉండవని తెలిసినా
ఆలోచన అలసిపోదు
ఆవేదన ఆగిపోదు
మనసేమో ఊరుకోదు
సందేహం సమసిపోదు
గతమంటే మారిపోదు
ప్రస్తుతం ఉండిపోదు
అనుకుంటే అయిపోదు
అనుకోకుంటే కాకపోదు
అన్నీ తెలిసినా...
అందరూ కావాలని
అందరిలో ఉండాలని
అన్నీ పొందాలని
ఆశ ,శ్వాస వదులుకోలేము
ఇదే మానవ జీవితం…!!
No comments:
Post a Comment