❁┈┈┈┈┈ ॐ ┈┈┈┈┈❁
☀️ ఆదివారం ఆణిముత్యాలు
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
*• సజీవ సత్యాలు •*
ఆశానామ నది మనోరథ జల తృష్ణ తరంకులా
రాగ గ్రాహవతి వితర్క విహాగా ధైర్య దృమధ్వంసిని
మోహవర్తసుదుస్తరాస్తిగహనా ప్రోత్తుంగ చింతాతటి
తస్యాః పారగతా విశుద్ధమనసో నందతి యోగీశ్వరాః
*ఆశ అనే పేరు గల నదిలోని నీళ్లు కోరికలు.*
*దురాశ నదిలో కలిగిన తరంగాల వంటివి.*
*నదిలోని మొసళ్లు లాంటివి తీవ్రమైన కోరికలు.*
*అనుమానం అనే పక్షి యొక్క బలం ధైర్యం అనే చెట్టును కూల్చేస్తుంది*
*భ్రమలు సుడిగుండములవంటివి .*
*నది చాలా లోతైనది*
*దాని ఒడ్డున బాధలు అనే ఎతె్తైన పర్వతాలున్నాయి.*
*నదిని దాటటం చాలా కష్టం.*
*ఐతే ఎవరైతే మనస్సును క్రమబద్ధం చేసుకుంటారో, ఆశ అనే నదిని అవలీలగా దాటి సంతోషంగా ఉంటారు.*
*అందుకే మనిషికి ఆశ ఉండాలి.*
*అది జ్ఞానం వైపుకు మరలాలి.*
*ఆశతో మనిషి ముందుకు వెళ్లాలి.*
*అనుకున్న పనులను సకాలంలో సన్మార్గంలో పూర్తి చేయడానికి ఆశ పనికిరావాలి.*
*ఆశ ఎపుడూ దురాశ కాకూడదు.*
*దురాశ దుఃఖానికి చేటు తెచ్చేదే అవుతుంది కానీ సుఖానికి నిచ్చెన కాలేదు.*
*కనుక ఆశ పట్ల ప్రతిమనిషి జాగరూకతతో వ్యవహరిం చాలి.*
*అంతేకాక అనుమానం అనే మొసళ్ళకు బానిసలు కాకూడదు.* ✌️
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
ధర్మో రక్షతి రక్షితః
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
పిల్లలకు బతుకు,బాధ్యత తో పాటు
భారతీయత కూడా నేర్పండి
🙋🏻♂️ జై హింద్ 🇮🇳 జై భారత్ 🫡
No comments:
Post a Comment