అగ్రరాజ్యం అసలు రంగు..
భారత్‌పై అమెరికా స్ట్రాటజీ ఇదేనా..?
---
అమెరికాతో శతృత్వం పెట్టుకోవడం డేంజర్.. కానీ అదే అమెరికాతో మిత్రుత్వం అంటే.. అది ప్రాణాంతకం. ఈ విషయం మరోసారి నిజమని నిరూపించే ఘటన.. అనుభవంలోకి వస్తోంది. ప్రస్తుతం భారత్ విషయంలో అమెరికా నెరపుతున్న హత్యారాజకీయాలు అలాగే ఉన్నాయి. తాజాగా అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ టెర్రరిస్టు, సిఖ్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు ప్రయత్నించారంటూ భారత్ పై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. అక్కడితో ఆగకుండా.. న్యూయార్క్ లోని ఓ కోర్టులో జో బైడెన్ ప్రభుత్వం అధికారికంగా పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్ ప్రకారం.. అమెరికా పౌరుడైన గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేయడానికి ప్రయత్నించారని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని చెక్ రిపబ్లిక్ రాజధానిలో అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ నిఖిల్ గుప్తాకు, భారత్ కు చెందిన ఓ ఉద్యోగి (సీసీ-1 అనే పేరును పేర్కొంది) సహకారం ఉందని తెలిపింది. ఓ డ్రగ్ ఏజెంట్ ను ఎంగేజ్ చేసుకున్నాడని.. అతడితో లక్ష డాలర్లతో బేరం కుదుర్చుకున్నాడని.. ఆల్ రెడీ 15 వేల డాలర్లు కూడా చెల్లించినట్లు అభియోగాలు మోపింది. వీరిద్దరి మధ్య జరిగిన మెయిల్స్, చాట్ వివరాలు అన్నింటినీ పిటిషన్ తో పాటు కోర్టుకు సమర్పించింది. అంతేకాకుండా.. కెనెడాలో హత్యకు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను కూడా ఈ కేసులో ప్రస్తావించింది.
దీంతో ఇది అంతర్జాతీయంగా భారత్ యొక్క పరువు, ప్రతిష్టకు సంబంధించిన అంశంగా పరిణమించింది. ఇప్పటికే కెనెడాలో నిజ్జర్ హత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న భారత్.. తాజాగా అమెరికా నుంచి వస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటునేది ఆసక్తికరంగా మారింది. అయితే అమెరికా ఆరోపణలపై భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. అగ్రరాజ్యం చేస్తున్న ఆరోపణలపై హై లెవెల్ కమిటీ వేసింది. అసలు ఉగ్రవాది అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ అంశంపై అమెరికా ఎందుకింత పట్టుదలతో ఉందనే విషయం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి గురుపత్వంత్ సింగ్ పన్నూను ఖలిస్తానీ ఉగ్రవాదిగా భారత్ చాలాకాలం క్రితమే ప్రకటిచింది. సిఖ్ ఫర్ జస్టిస్ అనే సంస్థకు అధినేతగా ఉంటూ అమెరికా గడ్డ నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. అతడు పూర్తిగా.. అమెరికా, పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మ అని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే వీరు కోరుతున్న ఖలిస్తానీ ప్రత్యేక భూభాగంలో రాజధాని లాహోర్ కనిపించదు. అంతేకాదు.. గురునానక్ జన్మించిన ప్రదేశాన్ని కూడా చూపించరు. పాక్ సాయంతో అంతర్జాతీయంగా భారత్ వ్యతిరేక కుట్రలు చేయడమే అతడి పని. ఇలాంటి ఉగ్రవాదికి అమెరికా మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే అమెరికా చేస్తున్న ఆరోపణలు చాలా సిల్లీగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. "రా" లాంటి అంతర్జాతీయ గూఢచారి సంస్థ చేసే కార్యకలాపాలు మెయిల్స్, వాట్సాప్ చాట్ లల్లో ఉంటాయా..? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక్కడే అమెరికా చేస్తున్న ఆరోపణలు.. పెద్ద డొల్ల అని తేలిపోతోంది. అలాగే నిజ్జర్ హత్య విషయం తమకు ముందే తెలుసని.. అమెరికా చెబుతుండటం కూడా సందేహించాల్సిన అంశంగా మారింది. నిజ్జర్ హత్యకు ముందు, ఆ తర్వాత చాలాసార్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోడీ చాలాసార్లు కలిశారు. కానీ ఎక్కడా ఈ విషయం ప్రస్తావనకు రాలేదు. అంటే కావాలనే అమెరికా.. భారత్ ను ఈ విషయంలో ఇరికించాలనే ఇంతకాలం వేచిచూసిందని అర్థం చేసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ పై అమెరికా ఆరోపణలు అంతర్జాతీయ విశ్లేషకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఖలిస్తానీ తీవ్రవాదులు భారత్ కు వ్యతిరేకంగా మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాగే ఈ ఆరోపణల ద్వారా భారత్ ను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని వివరిస్తున్నారు. మెరుగైన సత్సంబంధాలు నెరపుతున్నా అమెరికా మాట తూచా తప్పకుండా భారత్ వినడం లేదు. ఉదాహరణకు రష్యా నుంచి చమురు కొనొద్దని అమెరికా చెప్పినా.. భారత్ వినలేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారత్ పేరు మార్మోగుతోంది. ప్రధాని మోడీ ఎక్కడికెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. మోడీ ఏనాడో అంతర్జాతీయ నాయకుడయ్యారు. దీన్ని జీర్ణించుకోలేని అగ్రరాజ్యం.. ఇలాంటి కుట్రలకు తెరతీస్తోంది. ఓ ఆసియా దేశం.. ఇలా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగడాన్ని అమెరికా ఎట్టిపరిస్థితుల్లో సహించదు. అందుకే కావాలనే భారత్ ను లొంగదీసుకోవాలనుకునే క్రమంలోనే అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు చెబుతున్నారు.
Posted by Ritam తెలుగు
No comments:
Post a Comment