*ఉపనిషత్తులు అంటే ఏమిటి?*
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
*జన్మరాహిత్యానికి లేక మోక్ష ప్రాప్తికి ఉపయోగించే మంత్రవాక్య సముదాయాన్ని ఉపనిషత్తులంటారు.*ఆత్మ జ్ఞానము అని మరొక అర్థము.*
*ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే గురువునకు సమీపముగా ఉండి నేర్చుకొనుట అని ఇంకొక అర్థము. ఉపనిషత్తులకు ఉన్న ఇంకొక పేరేమిటి?*
*సామాన్యంగా ఉపనిషత్తులు వేదాలకు చివరి భాగాలలో ఉంటాయి. అందుచేత ఉపనిషత్తులకు వేదాంతములు అని ఇంకొక పేరు ఉంది. ఉపనిషత్తులను ‘రహస్యం’ అని ఎందుకు పిలుస్తారు?*
*‘ఉపనిషత్’ శబ్దానికి చెప్పిన అనేక అర్థాలలో ఒకటి ‘రహస్యము’ అను అర్థం. రహస్యము అనగా తెలియడం కష్టమైనా ప్రయత్న పూర్వకంగా తెలిసికొన దగినది. ఎక్కడనో సుదూర దేశంలో ఉన్న వస్తువు కూడా తెలియనిదే. కాని దాని ‘రహస్యం’ అని అనం. ఏది మనకు దగ్గరనే ఉంటూ మనకు తెలియదో అది పరమ రహస్యం. ఇలాంటి పరమ రహస్యం ఆత్మతత్వం. ఆత్మా అనేది ‘నేను, నేను’ అను అనుభవంలో అందరికీ గోచరమైనదే. అయినా కూడా దాని తత్వం, యథార్థ స్వరూపం ఏమో ఎవరికీ తెలియదు. అందుచేతనే ఇది పరమ రహస్యం, ఉపనిషత్తు. ఈ పరమ రహస్యానికే కాకుండా, దీనిని బోధించే గ్రంధానికి కూడా ఉపనిషత్తు అని పేరు.*
*ఉపనిషత్తు అనే పదానికి ఉన్న మరి కొన్ని అర్థాలు*
*జీవులలో ఉండే అవిద్య అను సంసార భీజమును నాశనము చేయునది అని ఒక అర్థం. మోక్షాన్ని ఆకాంక్షించే వారిని పరమాత్మ దగ్గరకు జేర్చెది అని ఒక అర్ధం.*
*జన్మ, వార్ధక్యము మొదలైన ఉపద్రవాలను శిథిలము చేయునది అని ఒక అర్థం.*
*అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే “గ్రంథం” అని ఒక అర్థం, ఆ గ్రంథం ద్వారా అందించ బడిన “విద్య” అని ఇంకొక అర్థం – ఇంకా ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి.*
@@@@@@@@@
*ఉపనిషత్తులు వేదాలకు శిరస్సులనదగినవి. అవి జ్ఞాన భాండాగారాలు.*
*భారతీయులకు పరమ ప్రమాణమై నవి. జ్ఞాన అనుష్టానానికి ఇవి మూల గ్రంధములు.*
*పరమాత్మ యొక్క యదార్ధ తత్త్వాన్ని తెలియజెప్పేవే ఈ ఉపనిషత్తులు.*
*నాలుగు వేదాలలోను మొత్తం 1180 ఉపనిషత్తు లున్నాయి.*
*21+109+1000+50 = 1180. అయితే 108 ఉపనిషత్తులు ముఖ్యంగా ప్రచారంలో ఉన్నాయి. 108 అనే సంఖ్య బ్రహ్మాన్ని సూచించే సంఖ్య అని చెబుతారు.మానవ శరీరం లో 108 ముఖ్యనాడులు ఉంటాయి. రాశి చక్రంలో 27నక్షత్రాలు,ఒక్కో నక్షత్రం 4 పాదాలను కలిగి ,9నక్షత్ర పాదాలు ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అలా 9 పాదాలు 12 రాశులలో 9×12=108 ఉంటాయి. అందుకే జపమాల 108 పూసలతో ఉంటుంది.*
*అసలు ఈ 108 ఉపనిషత్తుల పేర్లు ఏ రకమైన సందేహం లేకుండా మనం తెలుసుకో గలగటానికి ముక్తికోపనిషత్తే మూల కారణంగా చెప్పవచ్చు*.
*మానవజాతికి ఆదర్శమూర్తియైన శ్రీరామచంద్రుడు పరమ భక్తాగ్రేసరుడైన ఆంజనేయుని కొరకు చెప్పబడిన ఉపనిషత్తులో ఈ 108 ఉపనిషత్తుల పేర్లు, వాటి యొక్క శాంతి మంత్రములు ఇవ్వబడినవి*.
*ఈ ఉపనిషత్తును ముక్తికోపనిషత్తు అని ఎందుకన్నారు?*
*కొన్ని ఉపనిషత్తులకు వాటిలోని మొదటి మంత్రంలోని మొదటి పదం వల్ల ఆయా పేర్లు వచ్చినవి. ఉదా: ఈశ, కేన.*
*ఈ ఉపనిషత్తు ముక్తినందుకొనుటకు సులభమైన రాజ మార్గాన్ని ప్రసాదించటం కారణంగా దీనికి ముక్తికోపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇది సార్ధక నామధేయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ముక్తిలోని రకాలు, సాయుజ్యముక్తి నందుకొనే విధానము విపులంగా వివరించబడినందున మోక్షార్ధులైన వారికి ఇది చాలా ముఖ్యమైన ఉపనిషత్తు అని చెప్పవచ్చు*.
*108 ఉపనిషత్తులను 7 విభాగాలుగా చెప్పవచ్చు.*
అవి.
*1. సన్యాస ఉపనిషత్తులు*
*2. యోగ ఉపనిషత్తులు*
*3. సామాన్య వేదాంత ఉపనిషత్తులు*
*4. వైష్ణవ ఉపనిషత్తులు*
*5. శైవ ఉపనిషత్తులు*
*6. శక్తి ఉపనిషత్తులు*
*7. దశోపనిషత్తులు*
*ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ,ఛాందోగ్య, బృహదారణ్యక అనేవి దశోపనిషత్తులు.*
*దశోపనిషత్తులకు ముగ్గురు ఆచార్యులు శంకర, రామానుజ, మధ్వాచార్యులు భాష్యాలు వ్రాయటం జరిగింది.*
*మోక్షార్థులకు ఇవి చాలా ప్రధానమైనవి. ఈ దశోపనిషత్తులు అవగాహన కావాలంటే సామాన్య వేదాంత ఉపనిషత్తులకు చెందిన ముక్తికోపనిషత్తు అధ్యయనం చేయటం ఎంతో ముఖ్యం.*
*108వదైన ఈ ముక్తికోపనిషత్తును అధ్యయనం చేసిన తరువాతనే దశోపనిషత్తుల అధ్యయనానికి పూనుకుంటారు. కనుక ఇది చాలా ముఖ్యమైనది.*
౪౪౪౪౪౪౪౪౪౪౪
*“ఓం శాంతిః శాంతిః శాంతిః” అనే శాంతి పాఠానికి అర్థం ఏమిటి?*
*ప్రతి మనిషిని మూడు రకాల దుఃఖాలు బాధించడానికి అవకాశం ఉంది. వాటిని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు లేక తాపాలు అంటారు.*
*శరీరంలో ఉద్రేకాల వలన కలిగే రోగాలు, సోమరితనం, కపటం మొదలైన దుర్గుణాల వలన కలిగే ఉపద్రవాలను ఆధ్యాత్మికదుఃఖాలు అంటారు.*
*పంచమహా భూతాల నుండి (ఆకాశం, వాయువు, అగ్ని, జాలం, పృథ్వి), శత్రు, చోర, మృగ, కీటకాదుల వలన కలిగే ఉపద్రవాలను ఆదిభౌతిక దుఃఖాలు అంటారు.*
*అతివృష్టి, అనావృష్టి, పిడుగు పాటు, గ్రహ బాధలు మొదలగు వాటి మూలంగా కలిగే ఉపద్రవాలను ఆది దైవిక దుఃఖాలు అంటారు.*
*పరమాత్మ చింతనము ఈ పై మూడు రకాలదుఃఖములను శాంతింప జేయు గాక అని ఈ శాంతి పాఠము బోధిస్తోంది.*
∆∆∆∆∆∆∆∆∆∆∆
*పది ఉపనిషత్తులను గుర్తించే శ్లోకం ఏది?*
*ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరాః!*
*ఛాందోగ్యమైతరేయం చ బృహదారణ్యకం తథా!!*
∆∆∆∆∆∆∆∆∆∆∆
*శంకర భగవత్పాదులు ఎక్కువ పర్యాయములు ఉదాహరించిన ఇంకొక ఉపనిషత్తు ఏది?*
*శ్వేతాశ్వతరోపనిషత్తు.*
∆∆∆∆∆∆∆∆∆∆∆
*నాలుగు వేదాలకు చెందిన మహా వాక్యాలేమిటి?*
*అవి ఏ ఉపనిషత్తులలో ఉన్నాయి?*
*ఋగ్వేదం – ప్రజ్ఞానం బ్రహ్మ – ఐతరేయోపనిషత్తు*
*యజుర్వేదం – అహంబ్రహ్మాస్మి – బృహదారణ్యకోపనిషత్తు*
*సామవేదం – తత్వమసి – చాందోగ్యోపనిషత్తు*
*అథర్వణవేదం – అయమాత్మాబ్రహ్మ – మాండూక్యోపనిషత్తు*
No comments:
Post a Comment