Saturday, August 3, 2024

ఆలోచించి చూడండి. నిజమనిపిస్తే ఆచరించండి.

 🌹గుడ్ మార్నింగ్ 🌹మనది ఏ మతమైనా కావచ్చు - మనము ఏ దేముడినైనా నమ్మవచ్చు - మనము ఏ గురువునైనా అనుసరించవచ్చు - ఏ విధానాలు, ఆచారాలు సాంప్రదాయాలు పాటించవచ్చు - ఇవన్నీ ఎందుకు అనేది మనలో మనమే సూటిగా ప్రశ్నించుకోవాలి.
1) ఏదో చిన్నతనము నుండి ఇంట్లో వారు చేసేవి, చేయించినవి అలవాటుగా చేస్తున్నాను - ఉపయోగము లేదు.. 2) దేముడు రక్షిస్తాడు కనుక ఆ రక్షణ కొరకు నాకు వీలైనవి అన్నీ చేస్తున్నాను - ఉపయోగములేదు సృష్టి దైవ విధానము కర్మ సిద్దాంతము ప్రకారము నడుస్తున్నది. ఇది దేముడు పెట్టినదే. ఎవరు చేసిన పనుల ఫలితాలు వారు అనుభవించక తప్పదు. 3) గురువులు, మహాత్ములు, మతాల, మార్గాల పెద్దలందరూ - మత దైవ ప్రచారాలు చేస్తూ - ఎన్నో దైవ మహిమలు, రక్షణలు చెబుతున్నారు కనుక అవి నమ్మి - నా మతము, నా దేముడు అన్న అభిమానముతో - మహిమల, రక్షణల నమ్మకముతో వారు చెప్పినవి, నేను నమ్మినవి చేస్తున్నాను - ఉపయోగములేదు. ఇక్కడ కూడా కర్మ సిద్ధాంతమే పనిచేస్తుంది. దేముడు మనుషుల వలె పక్షపాతిగా వుండే అవకాశము లేదు. మరల ఒక్కసారి మనలో మనమే సూటిగా దైవాన్ని గుర్తు ఉంచుకొని స్వార్ధన్ని వదలి vunnadi ఉన్నట్లుగా ప్రశ్నించుకోగలిగితే - సమాధానము సూటిగా తెచ్చుకోగలిగితే - మనకు, సృష్టికి కారణమైన శక్తి దైవము. మొత్తము సృష్టి - అందులో అన్నీ దైవానివే. కనుక జీవనములో మంచిగా జీవించటానికి అవసరమైన - నాలో చెడు పోవటానికి అవసరమైన గుణ మార్పు కొరకు - మతాన్ని, దైవాన్ని, గురువును, విధానాలను అనుసరిస్తున్నాను. నిరంతరం మంచిగా జీవించే ప్రయత్నం చేస్తున్నాను... నాకు సృష్టికి మూలమైన శక్తి దైవమే కనుక ఆ దివ్య దైవ శక్తిని తెలుసుకునే ప్రయత్నం - సాధించ గలిగితే ఆ శక్తిలో లయించిపోయే ప్రయతం చేస్తున్నాను - మీరు ఎక్కడ ఎవరితో, ఏ విధముగా దైవ మార్గములో సాగుతున్నా - ఈ భావాలతో సాగుతుంటే - మొత్తము ఉపయోగమే.ఆలోచించి చూడండి. నిజమనిపిస్తే ఆచరించండి. 🌹god bless you.

No comments:

Post a Comment