Friday, January 10, 2025

 🦚🌹🌻🌈💞💜💃

*వివాహం తరువాత జాబ్ వద్దన్నాడు వదిలేశా..!* 

 *ఫోన్ నెంబరు మార్చేయాల్సిందే అన్నాడు మార్చేశా..!* 

 *ఫేస్బుక్ కూడదన్నాడు నెట్ కట్టేశా...!* 

 *మగ స్నేహితులుతో స్నేహం అవసరమా అన్నాడు స్నేహానికి చరమగీతం పాడా...!* 

 *లెగిన్స్ అంటే అసహ్యం అన్నాడు. చుడీదార్ కి మారా..!!* 

 *హీల్స్ కి నో అన్నాడు. సాదారణ చెప్పులకి యస్ అన్నాను...!* 

 *జాకెట్ కి కిటికీలేంటన్నాడు... మెడ వరకు మొత్తం కప్పేలా వస్త్రాలకి ప్రాధాన్యం ఇచ్చా...!* 

 *పెదాలకి రంగులేంటి అన్నాడు పాండ్స్ ని కూడా దూరంగా ఉంచా...!* 

 *పార్లర్ కి వెళ్ళద్దు అన్నాడు. పార్లర్ గడప తొక్కడమే మానేశా..!* 

 *కొన్ని రోజులు సంతోషంగా ఉన్న తర్వాత ..* 

 *పిల్లల కోసం కొన్ని రోజులు ఆగుదాం అన్నాడు.. మాత్రలనే మాసం మాసం పెంచుకుంటూ వచ్చా..!* 

 *వారంలో ఏడు రోజులూ తనకిష్టమైన వంటకాలే వండాలి..!* 

 *వారాంతంలో స్నేహితులుతో గడిపి సగం రాత్రి ఇంటికి తిరిగేవారు..!* 

 *రాత్రి ఒంటిగంటకి ఇంటికి చేరా అంటూ తన మొబైల్ కి అమ్మాయి పేరున్న నెంబరు నుండి మెసేజ్..!* 

 *తెల్లారక ఎవరని అడిగా ... ex lover అన్నాడు..!* 

 *వదిలెయ్యమన్నాను.. వల్ల కావడం లేదన్నాడు...!* 

 *ప్రయత్నం చేయ్ నీకు తోడు నేనున్నాను అన్నాను.. నువ్వూ తను ఒకటా అన్నాడు..!!* 

 *వేరు వేరే .. నేను లీగల్ తనుఇల్లీగల్ అన్నాను... నాకు చెంప పగిలింది..!* 

నీ *కోసం అన్నీ వదిలేశాను నా కోసం ఇదొక్కటి వదిలెయ్యలేవా అన్నాను.. కుదరదు its true love అన్నాడు..!!* 

 *నాక్కూడా ట్రూ లవ్ ఉంది అన్నాను. మరిచిపోవాలని వారం రోజులు బంధించి హింసించాడు..!!* 

 *ఓర్చుకున్నాను. తనలో ఎటువంటి మార్పూ లేదు..!* 

 *తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేశాను. !* 
 *తిరిగి లిప్ స్టిక్ రాయడం మొదలెట్టాను.!* 
 *తిరిగి జాకెట్ కి కిటికీలిచ్చాయ్.!* 
 *తిరిగి వేషధారణలోకి లెగిన్స్ వచ్చాయి.!* 
 *పార్లర్ సాధరంగా అక్కున చేర్చుకుంది.!* 
 *వంటల్లోకి నాకు నచ్చిన వంటలూ చేరాయి.!* 

 *సోషల్ మీడియా అంతటా ప్రేమ కవితలు రాశా.!* 

 *తిరిగి జాబ్ కి వెళ్ళడం మమొదలుపెట్టా.!* 

 *జాబ్ నుండి లేట్ గా ఇంటికి రావడం మొదలెట్టా.!* 

 *మగ స్నేహితులతో స్నేహం చిగురించింది..!* 

 *అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలు మొదలయ్యాయి.!* 

 *చాటుమాటుగా ఫోన్ కాల్స్ మక్కువయ్యాయి.!* 

 *మొబైల్ కి,  లాప్టాప్ కి పాస్వార్డ్ లకి అంకురార్పణ చేశా!* 

 *తనకి ఉన్న వెయ్యి పనుల్లో నన్ను గమనిస్తూ ఉండటమే ముఖ్యమైన పని ఇప్పుడు.!* 

 *తన ఇంటి భోజనం తనకే సొంతం అన్నట్లు దొంగతనం జరగకుండా కాపాడుకోవడానికి సెలవు రోజుల్లో కూడా బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు.!* 

 *ఎలాగైనా నా ex lover కాళ్ళు చేతులు పట్టుకోవాలని నా చుట్టూనే తిరగసాగాడు.!* 

 *ఈ జన్మలో కనిపెట్టడం తన వల్ల కాదు..* 

 *కారణం ఎటువంటి ex lover కూడా లేడు..* 

 *లేని ఒక లవర్ ని వెతికి వెతికి తనకి తెలియకుండానే నా చుట్టూ తిరగడం ప్రారంభించి, తన ex lover కి దూరంగా జరిగాడు..!* 

 *తనని పూర్తిగా మరిచిపోయి నాకు సొంతం అయ్యేంత వరకు నాకొక ex lover ఉన్నాడు.!* 

 *ఓ నా ఊహా lover ...* 
 *నీకు వేల వేల వందనాలు..* 

 *******  *అర్ధం కాకుంటే అర్ధం చేసుకొండి* 

 *సేకరణ* 
🌻🌹🌈💞🦚💜💃

No comments:

Post a Comment