Monday, January 6, 2025

****సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమిటంటే..

భగవంతుడి గురించి ఇటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు కావాలి  ఎందుకంటే ప్రతి మతము తమ గ్రంథం ప్రకారం మా దేవుడే గొప్ప అని చెప్పుకుంటారు అటువంటి అప్పుడు ఎవరు చెప్పింది నమ్మాలి? ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమిటంటే.. 
1.పోతులూరి వీర బ్రహ్మంగారు  యాగంటి బసవయ్య (కర్నూలు జిల్లా) రోజు రోజుకు పెరుగుతున్నారని చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా బోర్డు పెట్టారు ఈ నందీశ్వరుడు పెరుగుతున్నారని కానీ కొంతమంది కొన్ని రకాల రాళ్లు ఉండటం వల్ల నందీశ్వరుడు పెరుగుతున్నారని వితండవాదం చేస్తున్నారు అలాంటప్పుడు నందీశ్వరుడు చుట్టూ ప్రాంతము పెరగాలి కదా? గుడి కూడా పెరగాలి కదా? మరి పోతులూరి వీరబ్రహ్మం గారు ఏ విధంగా చెప్పారు అంటే దానికి సమాధానం చెప్పరు.
2.ప్రహ్లాద్ జానీ (గుజరాత్) అమ్మవారు భక్తుడు చిన్న వయసులోనే ఇంటిదగ్గర ఎవరికీ చెప్పకుండా అడవులకు వెళ్లి తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందారు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కనీసం మంచినీళ్లు కూడా ముట్టలేదు 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును . కనుక్కోలేకపోయారు ఇది సైన్స్ కి అందదు ఇది సనాతన గ్రంధాల్లో దీని మర్మం రహస్యం ఉంటాది  తపస్సు చేస్తే మూలాధార చక్రం నుండి  సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు  ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా. ఉన్నారు ఇటువంటి . వారు కొన్ని వేలమంది ఉన్నారు 
3. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారు 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి ఆ జ్యోతులను  ఆర్పి వేయడానికి అక్బర్ టిప్పు సుల్తాను శతివిధాలుగా ప్రయత్నించారు కానీ ఏమి చేయలేకపోయారు ఇప్పుడు కూడా మీరు హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి ఆలయానికి వెళ్లి వెళ్లి చెక్ చేసుకోవచ్చు
4. అరుణాచల రమణ మహర్షి కొండగృహల్లో తపస్సు చేసినప్పుడు క్రిమి కీటకాదులు కుట్టిన శరీరం నుంచి రక్తం కారిన ఎన్నో రోజులు ఆహారం తీసుకోకుండా తపస్సు నుంచి బయటికి రాలేదు ఇది ఎలా సాధ్యం? రమణ మహర్షి తన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు(1950 April 14 న తన దేహాన్ని విడిచిపెట్టారు )కొన్ని వేలమంది చూస్తుండగా తన దేహం నుంచి ఒక జ్యోతి వచ్చి శివలింగంలో ఐక్యమైపోయింది ఇది ఎలా సాధ్యం? (ఆ మరుసటి రోజే దీని గూర్చి రేడియోలో వార్తాపత్రికలు ద్వార తెలియజేశారు)
5. సర్ థామస్ మన్రో ( బ్రిటిష్ అధికారి) 1801 వ సంవత్సరంలో మంత్రాలయ పీఠం నుంచి పన్ను కట్టలేదని స్వయంగా తానే మంత్రాలయం వెళ్లి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళగానే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి నుంచి బయటికి వచ్చి అతనితో ఇంగ్లీషులో చాలా టైము మాట్లాడారు కానీ థామస్ కు తప్ప రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న వారికి ఎవరికీ కనిపించలేదు ఇది ఎలా సాధ్యం? ( ఈ విషయం  థామస్ మన్రో తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు)

Sekarana....

No comments:

Post a Comment