*ర కారం -రుద్రుని*
*అ- కారం బ్రహ్మని*
*మ -కారం విష్ణువు ని సూచిస్తుంది*
*రామనామం పరబ్రహ్మ స్వరూపానికి ప్రతిక* .
*రామ అనే అక్షరం లో రా అనే అక్షరానికి తత్ అంటే పరబ్రహ్మం*
*మ అనే అక్షరానికి త్వం అంటే జీవాత్మ అని అర్థాలు . రామ అనే *పదం జీవాత్మ పరమాత్మ ల కలయక అని అర్థం* .
*అష్టాక్షరి మంత్రమైన " ఓం నారాయణాయనమః " లోని రా బీజాక్షరం*
*పంచాక్షరి మంత్రమైన " నమః శివాయ " లోని మా అనే బీజాక్షరం కలిసి*
*రామ అనే నామం ఏర్పడింది* .
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే !!
స్వయానా శివుడు పార్వతి దేవికి చెప్పిన విషయం ఒకసారి శ్రీరామ నామం పాటిస్తే వేయి విశ్నునామలు స్మరించినట్లే అని . అంతటి గొప్పది రామనామం .రామ బాణం కంటే రామ నామమే
మహిమన్మితమైనది అని నిరూపించాడు హనుమ. ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి అని పురాణాలూ చెబుతున్నాయి .
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘువరాన్వాయ రత్నదీపం
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి !!
అను రామస్లోకం విన్నంతనే ప్రతి మానవ హృదయం లో కదలాడే శ్రీరామచంద్రుడు
పితృవాక్య పరిపాలన దక్షుడు, ఎకపత్నివ్రతుడు, పరక్రామవంతుడు,ధర్మరక్షకుడు
సాక్షాత్తు మహావిష్న్వు స్వరూపుడు .
శ్రీరాముడు మనవ జన్మనేత్తి ,జీవించి ,కష్టసుఖాలు అనుబవించి ధర్మమార్గం లో మానవులు ఏ విదంగా నడుచుకుంటే ,జీవితాలు సుఖమయమవుతాయో,ప్రశాంతత లబిస్తుందో తన జీవన విదానం ద్వారా స్పష్టం చేసాడు .
శ్రీరాముడు పరమాత్ముడు,సీత ప్రకృతి శక్తి స్వరుపిని. చైత్ర మాసం లో పునర్వసు నక్షత్రం లో శుద్ధ నవమి నాడు కర్కాటక లగ్నం లో దశరథ మహారాజు,కౌసల్యల్కు సల్వలక్షణ సమన్వితుడైన శ్రీరాముడు జగత్కల్యననికై జన్మించిన రోజే శ్రీరామ నవమి .శ్రీరామ నవమి బారతియులందరికి ఒక మహోత్తరమైన పండుగ .
భద్రాచలం లో ప్రతియేడు రంగరంగా వైబోగంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణం వర్ణనాతీతం. చలువపందిళ్ళ మద్యన పచ్చని మామిడి తోరణ మంటపం లో శ్రీరామ కళ్యాణ మహోత్సవం అత్యంత శొబయమనంగ ,కన్నుల పండుగగా జరిగే సీతారాముల కల్యాణం చూతము రారండి .
"రామ ఏవ పరంబ్ర్హమా, రామ ఏవ పరంతపః
రామ ఏవ పరంతత్వ శ్రీ రామో బ్రహ్మ తారకం "
రామనామం వలన బ్రహ్మ హత్య పాపం ,మద్యపాన దోషం ,గురుపత్ని సంయోగ పాపములు సైతము రామనామ స్మరనచే హరించును . సకల కల్మష నాశక మంత్రం .
పాలన ధర్మరక్షణ వ్యక్తి గత కుటుంబ ధర్మ నిర్వహణ.. రెండుంటికి పొంతన కుదరనప్పుడు దేనికి విఘాతం కలగకుండా కాపాడిన రాముడు ,దశరథ రామునిగా ,సీతరామునిగా,అయోధ్య రామునిగా విజయశీల వ్యక్తిత్వాన్ని ప్రతిస్టించాడు .
రాముడు నేర్పిన ధర్మాలు
(1) పాలన ధర్మాలు
(2) కుటుంబ ధర్మాలు
(3) నైతిక ధర్మం
(4) దాంపత్య ధర్మం
భద్రాచలం
--------------
భద్రాద్రి నిలయం రామం నత్వపాపైః ప్రముచ్యుతే
భద్రాచల నిలయుడైన శ్రీరాముని సేవించినవారు,సకల పాపా విముక్తులై తరిస్తారు
శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యకి ఎంతటి ప్రదన్యథొ ఉందొ అంతటి ప్ర్రదన్యథ భద్రాచల క్షేత్రానికి ఉన్నది .
క్రీ .శ 1658-87 సంవత్సరాల మద్య కాలం లో గోల్కొండ కోటను రాజదానిగా పాలించే తానాషా వద్ద మంత్రులగా ఉండిన అక్కన్న-మాదన్న ల మేనల్లుడైన కంచర్ల గోపన్న (భక్త రామదాసు ) భద్రాద్రికి తహసిలదుర్గ ఉంటూ అలయమను కట్టించారు అని చరిత్ర ఆదరంగా తెలుస్తుంది .
శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్యం కల క్షేత్రం భద్రాచల దివ్య క్షేత్రం. భద్రుడు (రాముడు)
అచలుడు (కొండ). రాముడు కొండ పైన నేలువున్నాడు కనుక క్షేత్రం భద్రాచలం గ ప్రసిద్దిచెందింది .
ఇతర క్షేత్రాలలో కోటిమందికి అన్నదానం చేస్తే కలుగు పుణ్యఫలం కాశి క్షేత్రం లో వేయిమందికి చేస్తే
కలుగు పుణ్య ఫలం శ్రీ భద్రాచల దివ్య క్షేత్రం లో ఒకరికి అన్నదానం చేసిన కలుగుతుంది అని బ్రహ్మ పురాణం చెబుతుంది .
ఎవరు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు కల్యానముర్తి ఆయన శ్రిరమచంద్రస్వామి వారిని సేవించుటకై భద్రాచల క్షేత్రానికి విచ్చేస్తారో వారు అక్షయమైన ఫలాన్ని పొందుతారు అని బ్రహ్మ పురాణం చెబుతుంది .
No comments:
Post a Comment