Saturday, May 30, 2026

 *పాపానికి, పాతకానికి ఉన్న తేడా ఏమిటి ?*

*పాపము అనారోగ్య రూపముగా బాధిస్తుంది. ఆ బాధను అనుభవిస్తే పాపం పోతుంది. పాపముతో పాటుగా పుణ్యం కూడా ఉంటే అనారోగ్యం ఉన్నప్పటికీ చేయవలసిన మంచి కార్యానికి ఆటంకం లేకుండా చేయగలుగుతాము.* ఉదాహరణకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకున్న రోజు పాపం ఫలితంగా జ్వరం వచ్చినప్పటికీ, ఏ ఆటంకం లేకుండా వ్రతాన్ని పూర్తి చేయటం పుణ్యఫలితం. పాపం ఫలితంగా కష్టాలు, అడ్డంకులు వస్తాయే కానీ శరీరం పడిపోదు.

కానీ పాతకం ఫలితంగా శరీరం పడిపోతుంది.పంచ మహా పాతకాలు.. బ్రహ్మ హత్య, బంగారాన్ని దొంగిలించటం. కల్లు త్రాగటం , పరస్త్రీని వాన్చించటం, ఈ నాలుగు పాతకాలలో ఒకటి గాని,నాలుగు గాని చేసిన వారితో స్నేహం చేయటం లాంటివి చేస్తే పాతకం చుట్టుకుంటుంది.
మరి తేరుకోవడం కష్టం.
అందుకు జాగ్రత్త గా వుండాలి.
🌷🌷🌷🌷.          *ఆధ్యాత్మిక కుటుంబం*                      

No comments:

Post a Comment