ఒక పెద్దాయన చెప్పింది విని నాకు మైండ్ పోయింది🌹దీనమ్మ జీవితం 🌹POSTCARD (89) from kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7jIloQMagwU
Transcript:
(00:01) మన లైఫ్ లో చాలా సంఘటనలు జరుగుతాయి. మనక ఎంతో మంది కలుస్తారు. మనం ఎన్నో మాటలు మాట్లాడతాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజు అట్లా ఎందుకు జరిగింది అని ఒక రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. ఇది అందరికీ జరగొచ్చు కొన్నిసార్లు నా లైఫ్ లో అట్లా జరిగిన తర్వాత చాలా కాలానికి ఓహో ఆ వ్యక్తి అటువంటి మానసిక అవస్థలో అటువంటి మాట అన్నాడా అని అనిపిస్తుంది నాకు మనం సినిమా చూసినప్పుడు కూడా సినిమాలో ఉన్న అన్ని డైలాగ్స్ ఎవరికీ గుర్తుండవు ఒక డైలాగ్ ఏదో గుర్తుంటుంది.
(00:42) ఒక స్టెప్ ఏదో హుక్ స్టెప్ అంటారు అట్లా గుర్తుంటుంది. అట్లా కొన్ని మాటలు మన మైండ్ కి హుక్ అవుతాయి. నేను సంతోష్ నగర్లో ఉన్న రోజుల్లో నాకు ఒక పెద్దాయనతో పరిచయం ఉండేది. అప్పటికే ఆయన ఉద్యోగం రిటైర్ అయి ఉన్నట్టున్నారు. ఆయన చిన్న తన వరండాలో కూర్చొని ఉండేవాడు. అటు ఇటు చెట్లు అవి ఉండేవి ముఖం మీద ఒక నిర్లిప్తుత ఉండేది. అప్పుడప్పుడు అలా చేయలేకపోతే ఆయన చేయలేపేవాడు చిన్న చిరునవ్వు నవ్వేవాడు.
(01:15) మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. కానీ అతనితో మాట్లాడినప్పుడు అతను కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పేవాడు బాగా ఆడుకో అనేవాడు నీకు ఎంత సాధ్యం అంత చెయ్ అనేవాడు ఎక్కువగా లేవు మాటలు అయితే ఒకరోజు ఆయన తో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఆయన ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అదేమిటంటే బాబు ఈ చెయ్యితో వచ్చింది సమస్య అంతా అన్నాడు.
(01:52) తన కుడి చెయ్యిని చూపిస్తూ నేను అనుకున్న ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చిందేమో సరే ఏమైంది ఆ చెయ్యికి ఇస్ ద ఎనీ ప్రాబ్లం అని అడిగితే ఈ చెయ్యి పడిపోయినా బాగుండేదయ్యా అన్నాడు. నేను కొంత ఆశ్చర్యపోయాను ఎవరైనా పడిపోయిన చెయ్యి బాగుపడాలని ప్రయత్నిస్తారు కానీ ఆ చెయ్యి పడిపోవాలని ఎవరు కనుకుంటారు ఎవరు కోరుకోరు సో సరే ఎందుకు అట్లా అన్నాడా అని కాస్త ఎంక్వైరీ చేస్తే ఆయన ఒక ఆసక్తికరమైన కథ చెప్పాడు.
(02:28) ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయి చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో ప్రతిరోజు నడుస్తూ ఒక కిలోమీటర్ అవతల ఎంఆర్ఓ ఆఫీస్ లాంటి దాంట్లో పని చేసేవారు ఆయన. ఆఫీస్ కి వెళ్లే సమయంలో కొందరు ఆయనకు హలో చెప్పేవాళ్ళు ఆయన వెంటనే కుడి చేతితో ప్రతి నమస్కారం చేసేవాడు హాయ్ చెప్పేవాడు ఆఫీస్ కి వెళ్ళగానే తన తోటి ఉద్యోగులు హాయ్ చెప్పేవారు.
(02:55) అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తిరిగి సాయంత్రం వస్తున్నప్పుడు పాన్ డబ్బు దగ్గర ఆగిన హాయ్ అంటే హాయ్ సో తన వల్ల చాలామందికి పని ఉంటుంది. అదేంటంటే ఆ సైట్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కానీ అట్లా చాలా మందికి పని ఉంటుంది కాబట్టి ఎవరైనా వచ్చి నమస్తే సార్ అంటే నమస్తే అని ఆయన నమస్తే పెట్టి వాళ్ళ పని ఏంటో చూసేవాడు వెరీ సిన్సియర్ ఎంప్లాయి తదంతర కాలంలో ఆయన రిటైర్ అయిపోయారు.
(03:30) అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరూ అతనికి నమస్తే పెట్టడం లేదు. అతనికి మాత్రం ఈ నమస్తే పెట్టడం చేయలేపడం అలవాటు అయిపోయింది. కొన్ని సందర్భాల్లో ఆయన రోడ్డు మీదకి వెళ్లి ఎవరైనా తన కోసం చేయలేపుతారేమో అని అనుకుంటే చాలా తక్కువ మంది చేయలేపడం ఎందుకంటే ఆయన రిటైర్ అయిపోయారు. వాళ్ళతో ఆయనతో ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరూ ఆ అవసరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఆయన మర్చిపోవడం జరిగింది.
(04:02) కొత్త ఎంప్లాయిస్ వచ్చారు. ఆ కారణం చేత అతనికి ఎవరు నమస్తే పెట్టేవాళ్ళు కాదు ఎవరు హాయ్ అని చెప్పేవాళ్ళు కాదు సో ఎవరైనా హాయ్ చెప్తారేమో అని ఎదురుచూసి ఆయనే ఎవరు హాయ్ చెప్పినా చెప్పకపోయినా చేయలేపడం మొదలు పెట్టాడంట ఆయన వింతగా చేయలేపితే ఆయనకున్న కొద్దరు పరిచయస్తులు అట్లా చేయలేపేవాళ్ళు కొంచెం ఆశ్చర్యపోయి ఈయనఏంటి మాకు చేయలేపుతున్నాడని తిన చిరునవ్వున వెళ్ళిపోయాడు రాను రాను తనకు పరిచయం ఉందా లేకపోయినా ఎవరు కనిపిస్తే వాళ్ళకి హాయ్ చెప్పేవాడు.
(04:39) ఆ విధంగా కొంత కాలం గడిచింది. అలా హాయ్ చెప్పే ప్రయత్నం చేసి చేసి ఒకరోజు ఆయనకి విసుగ వచ్చింది. ఇక ఎవరికీ హాయ్ చెప్పాలి అన్న ఆలోచన అతనికి రావడం లేదు. ఆక్వడ్ గా అనిపించినట్టు ఉంటుంది అతనికి అప్పుడు ఆయనతో నాతో ఏమన్నాడంటే జస్ట్ నేను ఏ ఉద్యోగం చేశానో అది మర్చిపోయాను ఆ ఉద్యోగం ద్వారా రిటైర్ అయిన అమౌంట్ వచ్చింది దాంతో ఇల్లు కట్టుకున్నాను అది మర్చిపోయాను నా కుటుంబ సభ్యులని మర్చిపోయాను నా పిల్లల్ని మర్చిపోయాను నేను చదువుకున్న చదువు మర్చిపోయాను కానీ నా మనసులో ఈ ఒక్క ఆలోచన అట్లా ఉండిపోయింది.
(05:22) అదేంటంటే ఎవరు నాకు హాయ్ చెప్పడం లేదు. నాకు ఎప్పుడు బయట కూర్చుంటున్నా ఇదే ఆలోచన వస్తుంది నా వైపు ఎవరనా చూసి హాయ్ చెప్తారేమో అని నేను సాయంత్రం బయట కుర్చి వేసుకొని కూర్చుంటున్నాను. ఇప్పుడు బయటికి వెళ్ళే ఓపిక గాని ఆ శక్తి గాని అసత్వ గాని నాలో లేకుండా పోయింది. కానీ ఎవరు హాయ్ నాకు చెప్పరు. నువ్వు ఒక్కడివే నాకు హాయ్ చెప్తున్నావ్.
(05:49) నేను ఎవరో తెలియకపోయినా అంటే నేను అతనితో చెప్పాను నేను బేసికల్ గా ఎవరికీ హాయ్ చెప్పను ఎందుకో మీరు నిర్లిప్తంగా కూర్చున్నట్లా ఆ గేటు బయట నుంచి బయటికి చూస్తా ఉంటే నాకు చెప్పాలనిపించి చెప్పేవాడిని బట్టి ఈ హాయ్ వెనకి ఇంత కథ ఉందని నేను ఆశ్చర్యపోయాను. అని అప్పుడు ఆయనతో చెప్పాను ఆ తర్వాత కాలంలో నేను సంతోష్ నగర్ నుంచి కనమగా మూవ్ అయిపోయాను. ఇదంతా జరిగింది.
(06:17) చాలా కాలం తర్వాత అప్పుడు నాకు అర్థమయింది అన్నమాట ఒక డీప్ రూటెడ్ కండిషనింగ్ మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుంది అని చుట్టుపక్కల కొన్ని కోట్ల మంది ఉన్నా నా అనుకునే వాళ్ళు ఎవరూ లేరు అన్న భావన ఒక్కొక్కసారి మనిషిని వెంటాడుతుందేమో అసలు ఎవరైనా ఒక వ్యక్తికి హాయ్ ఎందుకు చెప్పాలి పోనీ హాయ్ చెప్పాలని అనుకోవడం ఏమిటి ఎవరైనా హాయ్ చెప్తారేమో అని బయట కూర్చోడం ఏమిటి? అప్పుడే నాకు స్ఫూరించిన అంశం దేనికోసమైనా ఎదురుచూసే మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు.
(07:01) ఆ మనసు ఆధీనంలో ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నా వస్తువులు ఉన్నా ప్రాపర్టీస్ ఉన్నా ఆ ఒక్క అంశం బాధిస్తుంది. సో దేనికోసం ఎదురు చూడొద్దు అని తర్వాత రోజుల్లో నాకు తెలిసింది. ఆ తర్వాత నేనే మీతో షేర్ చేసుకుని ఉన్నాను జ్ఞానోదయపు మూడు లక్షణాలు అని పరచింతన పోవడం దేనికోసము ఎదురు చూడకపోవడం అంతర్గతంగా స్వపర భేదాలు లేకుండా ఉండడం ఈ మూడు ఒకవేళ మనిషికి సిద్ధిస్తే ఆ మనిషి ఎక్కడున్నా ఒక సహజ ప్రశాంతతలో ఉంటాడు అన్నది ఒక అనుభవంగా ప్రస్తుతం తెలుస్తున్నది. అన్నది
(07:48) సో మనలో ఉన్న ఏ విధమైన కండిషనింగ్ అయినా లేదా మనం ఒకరికి పెట్టే ఏ విధమైన కండిషన్స్ అయినా మనల్ని ఎదురు చూసేలా చేస్తాయి. దాంతో పాటు మనసుని ఎప్పుడు రెస్ట్ లెస్ గా ఉంచుతాయి. నాకెందుకో ఈ తెల్లవారి చావున ఆ పెద్దాయన గుర్తొచ్చాడు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు అసలు ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఒకవేళ అతను కనిపించినా నేను హాయ్ చెప్తానందో లేదో కూడా నాకు తెలియదు.
(08:33) బట్ అతను చెప్పిన ఆ మాట నా చెయ్యి పడిపోయినా బాగుండేది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు పడిపోయేది చెయ్యి కాదు ఆలోచన పడిపోవాలి. ఒకవేళ చెయి పడిపోయినా మనసులో ఆలోచన ఉంటే ఏం చేస్తాం కాస్త ఆలోచించాల్సిన విషయం సాయిస్
No comments:
Post a Comment