ఆధునిక శాస్త్రవేత్తల కంటే ప్రాచీన యోగులకు ఎక్కువ తెలుసా? | Sadhguru 360 | Sadhguru Telugu
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=j-uL47bmSCU
Transcript:
(00:02) సౌరమండలపు పనితీరు మానవ వ్యవస్థ పనితీరుపై సహజంగానే ప్రభావం చూపుతుంది. అది మిమ్మల్ని అస్థిరపరచగలదు పక్కదారి పట్టించగలదు మీ ప్రాణాలను కూడా తీయగలదు. లేదు గ్రహాలను సాకుగా వాడుకోవడం మొదలు పెట్టకండి. కాలమే ఈ మొత్తం విశ్వాన్ని పట్టి ఉంచేది. గురుత్వాకర్షణ శక్తి కూడా కాలం నుంచి పుట్టిందే. సరే ఇది మీకు కాస్త అతిగా అనిపిస్తే మిగతా ప్రపంచంంతా భూమి బల్లపరుపుగా ఉందని అనుకుంటున్నప్పుడే వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నారు.
(00:37) టెలిస్కోప్ కూడా లేకుండానే మనం ఒక క్యాలెండర్ ను రూపొందించాము. అది కేవలం రోజులను లెక్కించడమే కాదు విశ్వ జామితిని సైతం పట్టి చూపుతుంది. మీరు గనుక అవసరమైన సాధన చేసి మీ గ్రహణ శక్తిని పెంచుకుంటే మీకే తెలుస్తుంది. నేను విషువత్తుకు నమస్కరిస్తాను. ఎందుకంటే నా జీవితం దాన్ని నా జీవితం అనగలిగితే గనుక ఆ రోజు ఆవిరైపోయింది. నేను విషువత్తు సంతానాన్ని నమస్కారం 360 కి స్వాగతం సరే మనం కాలం అని పిలిచే దాని గురించి చూద్దాం.
(01:23) మరింత ఖచ్చితంగా చెప్పాలంటే కాలం గురించి మానవ సమాజం అనుభూతి చెందే ఒక నిర్దిష్టమైన అంశం అదే క్యాలెండర్ మీరు కాలం అనగానే చాలామంది గడియారాన్నే చూస్తారు లేదా చేతికున్న వాచీని లేదా ఈ రోజుల్లో అయితే ఫోన్ ను అవును కాలానికి ఉన్న ఒక అంశం కొలవడం ఇది ఇది వివిధ చక్రాలకు ప్రకృతి చక్రాలకు ఇంకా మనిషి సృష్టించుకున్న చక్రాలకు ఒక సూచికగా ఉపయోగపడుతుంది.
(02:02) అంటే ఆఫీస్ కి ఎప్పుడు వెళ్ళాలి బిల్లులు ఎప్పుడు కట్టాలి లేదా మీ ఈఎంఐ గడువు ఎప్పుడు లాంటివి దురదృష్ట వసాత్తు ఆధునిక సమాజం అనబడేది ఆర్థిక వ్యవస్థ అనే యంత్రంలో ఎంతగానో లీనం అవడంతో కాలంపై మనకున్న భావన అంతా మనం ఏ ఆర్థిక కార్యకలాపాన్ని ఎప్పుడు ఎలా చేయాలి అనే దాని మీదే ఆధారపడి ఉంది. సరే చాలా మందికి అసలు పట్టదు పువ్వులు ఎప్పుడు పూస్తాయో లేదా వర్షాకాలం ఎప్పుడు మొదలవుతుందో అని ఒకవేళ మనం పువ్వుల గురించి మాట్లాడితే పువ్వుల మార్కెటింగ్ కు ఏది ఉత్తమ సమయం వర్షాకాలం గురించి మాట్లాడితే విత్తనాలు నాటటానికి లేదా పంట కోయటానికి ఏది ఉత్తమ సమయం అంతా ఆర్థిక
(02:49) శాస్త్రం మన మనుగడ గురించే నాకు ఆర్థిక వ్యవస్థతో గాని ఆర్థిక ప్రక్రియతో గాని ఏమీ వ్యతిరేకత లేదు కానీ కాలాన్ని పరిమితం చేయటం ఇది అస్తిత్వంలోనే అనే ఒక ప్రగాఢమైన అంశం దీన్ని కేవలం లావాదేవీల లెక్కకు కుదించటం ఇది మనం అనుమతించిన ఒక ఘోరమైన తప్పు గత కొన్ని దశాబ్దాలుగా దీన్ని మన జీవితాల్లోకి జొరబడనిచ్చాం. ఆర్థిక శాస్త్రం ప్రాథమికంగా మనుగడకు సంబంధించింది.
(03:16) ఒకప్పుడు మనుగడ అంటే ఆహారం, నివాసం ఈ రోజుల్లో ఆహారం, నివాసం రోజు రోజుకి మరింతగా వ్యవస్థీకృతం అవుతున్నాయి. దురదృష్ట వశాత్తు సంక్లిష్టంగా ఇంకా ఖరీదైనవిగా మారుతున్నాయి. ఇవన్నీ ఉండటంలో తప్పులేదు కానీ అవి మీ జీవితాన్ని నిర్దేశించేవిగా మారకూడదు. the shouldనా become the determining facక్torస్ of your life మీరు ఏ రకమైన ఆహారం తింటారు ఎలాంటి బట్టలు వేసుకుంటారు ఎలాంటి ఇంట్లో ఉంటారు ప్రతి ఒక్కరు తమ తమ స్తోమతకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేసుకుంటారు కానీ అవి మిమ్మల్ని పరిమితం చేసేవిగా మారకూడదు.
(03:54) అవి కేవలం మీ జీవితానికి తోడ్పడడానికే మీరు ఆఫీస్ కి నడిచి వెళ్ళారా సైకిల్ పై వెళ్ళారా లేక కార్లో వెళ్ళారా ఇదంతా కేవలం వేరు వేరు వ్యక్తుల ఆర్థిక స్తోమతకు సంబంధించిన విషయం ఇంకా ప్రజలు చేసుకునే ఎంపికలు వాళ్ళకు ఉండే అవకాశాలను బట్టి ఉంటుంది. కానీ ముఖ్యమైనది మీరు అక్కడికి చేరడం ప్రయాణ సాధనం కేవలం అప్రధానం జీవితంలో ప్రతి విషయంలోనూ ఇంతే కానీ ఈ అప్రధానమైన విషయాలే మన మనసులలో ఎంతగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయ అంటే జీవితపు ప్రాథమిక సూత్రాలనే పూర్తిగా మర్చిపోయాం.
(04:37) మీరు శ్రద్ధ పెడితే మీకే అర్థమవుతుంది. కాలం అనేది ఆర్థిక శాస్త్రానికి సంబంధించినది కాదని యోగులు ఎప్పుడూ కాలాన్ని సృష్టికి ఆధారంగా చూశారు. కాలం ఎప్పుడూ గడిచిపోతూనే ఉంటుంది కానీ దాన్ని పట్టుకోలేం దానికి పాస్ బటన్ లేదు రివైండ్ సౌకర్యం లేదు కాలమే ఈ మొత్తం విశ్వాన్ని పట్టి ఉంచేది. గురుత్వాకర్షణ శక్తి కూడా కాలం నుంచి పుట్టిందే అది కాలానికి అంతరాళానికి ఉన్న సంబంధాన్ని నిర్వహించే ఒక శక్తి ఇంకా కాలాన్ని వ్యక్తం అవ్వడానికి అనుమతిస్తుంది.
(05:11) తెలుసా మీకు చాలాసార్లు చెప్పాను కాలం అనుభవం మీరు టాయిలెట్ డోర్ కు ఏ వైపున ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. లోపల ఉన్నవాళ్ళు ఒక్క క్షణం అంటారు కానీ మీ అనుభవంలో ఆ ఒక్క క్షణమే ఒక యుగంలా ఉంటుంది. కాబట్టి కాలం లేదా కాలం అనుభవం చాలా సాపేక్షమైనది మనం ఎలాంటి అనుభూతిని పొందుతున్నామ అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు గనక ఏదైనా చాలా అప్రియమైన లేదా మీ ప్రమేయం లేని అనుభూతిని పొందుతుంటే అప్పుడు నిమిషాలే సంవత్సరాలుగా మారతాయి కానీ మీరు చాలా ఆహ్లాదకరమైన అద్భుతమైన అనుభూతిని పొందుతుంటే అప్పుడు సంవత్సరాలే క్షణాల్లో గడిచిపోతాయి. ఇది మానవ అనుభవం సరే ఇంకా
(05:57) ప్రాథమిక స్థాయిలో చూస్తే మనం చూస్తాం ఆ చీకటి శూన్యమైన కాళం ప్రతిధ్వనించి రూపాన్ని తీసుకున్నప్పుడు భౌతిక అస్తిత్వం మొదలవుతుంది. సరే ఇది మీకు కాస్త దూరం లేదా అతిగా అనిపిస్తే మీ రోజువారి అనుభవంలో మీరు కాలాన్ని అనుభూతి చెందేది మీ లోపల మీ చుట్టూ జరిగే మార్పుల రూపంలో భూమి ఒక్కసారి తిరిగితే దాన్ని ఒక రోజు అంటారు.
(06:27) చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే దాన్ని నెల అంటాం. భూమి సూర్యుని చుట్టూ తిరిగితే దాన్ని సంవత్సరం అంటాం. ఇలా భౌతిక ప్రపంచంలోని అతి చిన్న అంశం నుండి అతి పెద్ద అంశం వరకు భౌతికత్వంలో ప్రతిదీ ఒక చక్రంలా ఉంటుంది. ఇంకా ఈ మానవ శరీరం ఈ గ్రహంలోని ఒక ముకే కాబట్టి ఇంకా ఈ గ్రహం సౌరమండలంలో ఒక చిన్న కణం కాబట్టి సౌరమండలపు పనితీరు సహజంగానే ఒక పాత్ర పోషిస్తుంది.
(07:00) మానవ వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే దానిలో మీరు క్యాలెండర్ చూస్తే ప్రపంచంలో చాలా భాగం ఈ రోజు అనుసరిస్తున్నది గ్రెగోరియన్ క్యాలెండర్ నే ఇది ప్రాథమికంగా ఒక కలగా పులగం అది ఎక్కడి నుండి వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి అది రోమన్ సామ్రాజ్యం నుండి వచ్చింది. సరే ప్రపంచంలో చాలా విషయాలు దాదాపు ప్రతిదీ రోమన్ సామ్రాజ్యం నుండే వచ్చిందని చెప్పుకుంటారు.
(07:24) ఎందుకంటే అంతకుముందు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతిదీ రోమన్ సామ్రాజ్యం ద్వారా తుడిచి పెట్టుకుపోయింది. నాకు తెలుసు ఈ రోజుల్లో ప్రపంచంలో తుడిచిపెట్టడం అనేది ఒక ఇష్టమైన పదంగా మారింది. ఇంకా దాని ముఖ్య ఉద్దేశం పన్నుల సేకరణను సులభతరం చేయడం. క్యాలెండర్ అనే పదమే క్యాలెండర్ నుండి వచ్చింది. దాన్ని ఇలా ఉచ్చరిస్తారు. కాల్ అండ్ డే అది అప్పులు తీర్చవలసిన రోజు పౌరులు రోమన్ రాజ్యానికి పన్నులు కట్టాల్సిన రోజు అది అంగడి వాళ్ళ చేత అంగడి కోసమే తయారు చేయబడిన క్యాలెండర్ ఫర్ ద మార్కెట్ ప్లేస్ అదొక అంకెల సౌలభ్యం అది విశ్వపు విశాల జామితిని పూర్తిగా విస్మరిస్తుంది. అది
(08:04) కేవలం మానవ మనసుల్లో అనుకునే ఒక మార్పు మాత్రమే మీరు గనుక ఒక బ్యాంకర్ అయితే లేదా 2000 సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యంలో ఒక అకౌంటెంట్ అయితే అప్పుడు అది ఉపయోగకరమే కానీ అది మానవ అనుభవం పరంగా పూర్తిగా సరిపోదు ఈ మానవ వ్యవస్థ ఎలా విశాల విశ్వానికి ప్రతిబింబము అది పూర్తిగా విస్మరిస్తుంది. ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు ఇంకా భూమిని మీరు తూర్పు దేశాల్లో ఉపయోగించిన క్యాలెండర్ లను చూస్తే ముఖ్యంగా హిందూ లూని సోలార్ క్యాలెండర్ అది పూర్తిగా భిన్నమైన విధానం.
(08:47) గతంలోని యోగ ద్రష్టలు ఈ క్యాలెండర్లను రూపొందించిన వారు పనులు వసూలు చేయడంలో ఆసక్తి చూపలేదు. వాళ్ళు ఆసక్తి చూపింది మానవుడి వికాసం మీద వాళ్ళు గుర్తించారు ఈ మానవ యంత్రాంగం ఒక ఏకాంత బొడగ కాదని సుమారుగా ఎనిమిది నుండి 12వేల సంవత్సరాల క్రితం మొదటి హిందూ క్యాలెండర్ తయారు చేయబడిందని అంచనా అద్భుతమైన విషయం ఏమిటంటే దానికి మళ్ళీ ఎప్పుడూ సవరణ అవసరం రాలేదు ఎందుకంటే ఇది ఒక లెక్కింపు కాదు ఇది మనం నివసిస్తున్న విశ్వం సౌర మండలం యొక్క ఒక పరిశీలన ఇది మనం ఏదో ఊహించి లెక్కిస్తున్నట్లు కాదు మనం విషయాలను గమనిస్తున్నాం ఆ గమనిక నుండి మీరు రోజంతా పక్షిగూడు లాంటి మీ
(09:34) అపార్ట్మెంట్ లేదా మీ ఆఫీసులో బందీగా ఉన్న స్థిరంగా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎయిర్ కండిషనింగ్ లో అయినప్పటికీ విశ్వంలో ఏది జరిగినా లేదా కనీసం సౌర వ్యవస్థ స్థలో లేదా ఈ గ్రహం మీద ఏది జరిగినా అది మీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు గనక అవసరమైన సాధన చేసి మీ గ్రహణ శక్తిని పెంచుకుంటే మీకే తెలుస్తుంది మానవ వ్యవస్థ విశాల విశ్వానికి ఒక సూక్ష్మ రూపం అని యోగ విజ్ఞానంలో మేమంటాం అండ పిండా అండ ఇంకా బ్రహ్మాండ ఈ జీవాన్ని తయారు చేసే మూల పదార్థం అంటే వ్యక్తిగత మనిషిని ఇంకా విశ్వాన్ని ఈ మూడు
(10:20) ఒకే దాని యొక్క మూడు అభివ్యక్తులు అవన్నీ ఒకే కాల సమన్వయంలో ఉన్నాయి సరే దీనికి అందరికీ తెలిసిన ఉదాహరణ ఆ సంఖ్య 108 08 శరీరంలో ఉండే 114 చక్రాలలో రెండు శరీరానికి లేదా శారీరక నిర్మాణానికి బయట ఉంటాయి. ఇక ఈ శారీరక నిర్మాణంలో ఉండే 112 చక్రాలలో మనం అసలు పని చేయాల్సింది కేవలం 108 చక్రాల మీదే మీరు గనుక ఈ 108 ఇంటింటిని ఉత్తేజపరచగలిగితే మిగిలిన నాలుగు వాటంతటా అవే తెరుచుకొని ప్రజ్వలిస్తాయి.
(11:04) అందుకే సంప్రదాయపరంగా మీరు రుద్రాక్ష వేసుకున్నా లేదా ఏ మాల వేసుకున్నా ఒక హారం లేదా పాశ్చాత్యులు అన్నట్టు నెక్లెస్ వేసుకున్నా దానికి 108 పూసలు ఉంటాయి. దీన్ని జపమాలగా వాడుతారు. మీరు ఏదైనా మంత్రాన్ని జపించినా లేదా ఒక శక్తి క్షేత్రం చుటూ ప్రదక్షణ చేసినా అది 108 సాధన చేస్తారు. ఎందుకంటే మానవ యంత్రాంగం పై పూర్తి పట్టు సాధించాలనుకుంటే అలా 108 విషయాలు చేయాల్సి ఉంటుంది.
(11:40) ఇది సౌర వ్యవస్థలో ఎంతో అందంగా వ్యక్తమవుతుంది. లేదా ఇంకా చెప్పాలంటే ఇది సౌరవ వ్యవస్థ నుండి మానవ వ్యవస్థపై అద్భుతంగా ముద్రితమైంది. సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది. సూర్యునికి భూమికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది. చంద్రునికి భూమికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది.
(12:11) చాలా అద్భుతంగా ఉంది కదూ మన చుట్టూ ఉన్న సృష్టిలోని ఈ గణితం మనం అన్వేషించి చూస్తున్న ఈ అంతరిక్షంలోనే కాదు మానవ వ్యవస్థలో కూడా వ్యక్తమైంది. అంటే ఈ వ్యవస్థ పై మీరు తగినంత శ్రద్ధ పెడితే సౌర వ్యవస్థ యొక్క మొత్తం జామితి ఇంకా గణితం మనకోసం ఇక్కడే ఉంది. ఇదంతా భారతీయ యోగులు మార్మికులు. గెలీలియో పుట్టక ముందే కనుగొన్నారు.
(12:44) మిగతా ప్రపంచం అంతా ఇంకా భూమి బల్లపరుపుగా ఉందని అనుకుంటున్నప్పుడే వీళ్ళు భూమికి చంద్రునికి భూమికి సూర్యునికి మధ్య దూరాలు ఎంతో చంద్రుని భ్రమణాలకి ఈ గ్రహ భ్రమణాలకి మధ్య సంబంధం ఏమిటో అదంతా ఎలా పనిచేస్తుందో కచ్చితంగా లెక్కించారు. ఇంకా అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఇది 20వ శతాబ్దంలోనే జరిగిందని నేను అనుకుంటున్నాను గ్రహం యొక్క భ్రమణంలో ఒక ప్రిసిషన్ ఉందని మనం గ్రహించాం.
(13:18) ఈ ప్రిసిషన్ గురించి మనం కాసేపట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. బికాuse్ వు రికగ్నైజ్డ్ మనం ఇలాంటి వివిధ అంశాలను గుర్తించాం కాబట్టి ఈ నాగరికతలో మనం కేవలం రోజులను లెక్కించే క్యాలెండర్ నే కాదు విశ్వ జామితిని ఇంకా మన శ్రేయస్సు కోసం ఈ జామితితో మనల్ని మనం ఎలా సమన్వయం చేసుకోవాలో తెలిపే దాన్ని రూపొందించాం సరే తొమ్మిది సంప్రదాయ గ్రహాలు అంటే మనపై లేదా ఈ గ్రహంపై ఉండే ప్రభావాలలో హిందూ క్యాలెండర్ లో రాహు కేతువులను కూడా గుర్తించారు.
(13:51) రాహు కేతువులను కూడా గుర్తించారు అవి భౌతిక గ్రహాలు లేదా ఉపగ్రహాలు కావు అవి చంద్రుడు సూర్యుని కక్షలు ఖండించుకునే బిందువులు అవి చంద్రునిలో కొంత భాగాన్ని లేదా సూర్యునిలో కొంత భాగాన్ని కప్పి వేస్తాయి లేదా మరో మాటలో చెప్పాలంటే అవి పాక్షిక లేదా సంపూర్ణ గ్రహణానికి కారణం అవుతాయి. భూమి చుట్టూ తిరిగే క్రమంలో చంద్రుని ఉత్తర దక్షిణ కక్ష బిందువులు ఒక నిర్దిష్ట స్థితిలో ఉండటం వల్ల కాబట్టి రాహువు ఉన్నాడు.
(14:23) అందుకే ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. కాబట్టి చాలామంది దీని గురించి చాలా విధిరాతగా భావిస్తారు. ఇప్పుడు రాహుకాలం నడుస్తోంది కాబట్టి నేను ఏ పని చేయను అని ఇది దాని గురించి కాదు. మీరు చేసే ప్రతిదానికి లేదా మీరు చేయను ప్రతిదానికి గ్రహాలనో లేదా నక్షత్రాలను మిందించడం గురించి కాదు. మీ జీవితంలో తప్పుగా జరుగుతున్నది గ్రహస్థానాల వల్ల కాదు.
(14:48) ఈ విశ్వంలో జరుగుతున్న ప్రతిదానికి ప్రతిస్పందించే మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం గురించే ఇది మీకు దాని గురించి తెలిస్తేనే దానికి మీరు ప్రతిస్పందించగలరు మీరు ప్రతిస్పందిస్తేనే ప్రతిక్రియించడం కాదు ప్రతిస్పందిస్తే అప్పుడు మీరు చూడగలరు ఒకరి జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా వాటిని ఉత్తమంగా ఎలా ఎదుర్కోవాలో మీరు అకస్మాత్తుగా సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమిని మరోవైపు వెళ్లేలా చేయలేరు కానీ ఈ విశ్వ పరిస్థితిని ఎలా ఎలా అధిగమించాలో మీరు చూడవచ్చు.
(15:18) ఈ విశ్వం ఒక ఊహకందని సంక్లిష్టమైన యంత్రాంగం మిమ్మల్ని మీరు ఈ యంత్రాంగంతో సమన్వయం అయ్యేలా చేసుకోగలిగితే అది మీకోసం పనిచేస్తుంది. మీ జీవితం ఒక నృత్యం అవుతుంది. మీరు మిమ్మల్ని సమలేఖనం చేసుకోకపోతే అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది లేదా కాలచక్రాలే మిమ్మల్ని నలిపేస్తాయి. విశ్వం మీకు అనుకూలంగా పని చేయాలని కోరుకుంటున్నారా మీకు వ్యతిరేకంగానా సరే విశ్వం మీకు అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని పని చేయదు అది పని చేసే విధంగా పని చేస్తూనే ఉంటుంది.
(15:51) సృష్టితో లయలోకి రావాల్సింది మీరే మీరు సృష్టితో లయలోకి వస్తే మీరు యోగాలో ఉన్నారని అంటాం. మిమ్మల్ని మీరు జోడించుకున్నారు. యోగ అనే పదం యోక్ అనే పదం నుండి వచ్చింది. మీరు మిమ్మల్ని సృష్టికి ఇంకా వీలైతే సృష్టి మూలానికి జోడించుకున్నారు. హిందూ క్యాలెండర్ లో చాలా చాలా పొరలు ఉన్నాయి ఈ మహా విశ్వం ఇంకా సౌర వ్యవస్థ పరంగా కానీ మనం సంక్లిష్టమైన రూపాన్ని చూద్దాం.
(16:22) అదేంటంటే లూని సోలార్ క్యాలెండర్ ఇది ప్రాథమికంగా సూర్యుడు చంద్రుడు ఇంకా భూమి కదలికలకు సంబంధించినది ఉపఖండల్లోని వివిధ ప్రాంతాలు ఈ క్యాలెండర్ యొక్క కొద్దిగా భిన్నమైన రూపాలను అనుసరిస్తాయి తమిళ ప్రజలు పూర్తిగా సౌరమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు. దేశంలోని ఇతర ప్రాంతాలు ఎక్కువగా సంక్లిష్టమైన లూనిసోలార్ క్యాలెండర్ ను అనుసరిస్తాయి. చాంద్రమాన క్యాలెండర్ చంద్రుని దశల ప్రకారం నడుస్తుంది.
(16:50) సౌరమాన క్యాలెండర్ ఈ గ్రహంతో సూర్యుని సంబంధాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. లూనిసోలార్ క్యాలెండర్ చాంద్రమాన సౌరమాన చక్రాల సంక్లిష్టమైన మిశ్రమం ఎందుకంటే అవన్నీ కదులుతున్న వస్తువులు కాబట్టి ఇది లెక్కించడానికి అర్థం చేసుకోవడానికి ఒక సంక్లిష్టమైన జామితిగా మారుతుంది. సంవత్సరం నెల రోజులోని వేరువేరు సమయాల్లో దాని ప్రభావం సంక్లిష్టమైనది.
(17:14) ఎందుకంటే చాంద్రమాన చక్రాలు సౌరమాన చక్రాలు రెండూ పరిగణనలోకి తీసుకోబడతాయి నేను చెప్తాను అది చాలా ఖచ్చితమైనదని ఇంకా అది మన జీవితంలోని మరిన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని దీన్ని సంస్కృతంలో పంచాంగం అంటారు దక్షిణ భారత భాషల్లో పంచాంగం పంచాంగ్ అని హిందీ మాట్లాడే ప్రజలు పిలుస్తారు. దీనిని పంచాంగ్ అంటారు అంటే ఐదు అంగాల క్యాలెండర్ క్యాలెండర్ కు ఐదు అంగాలు మొదటి అంగాన్ని తిధి అంటారు అది చాంద్రమాన రోజు రెండవ అంగం వార లేదా వారం రోజు సూర్యుడు చంద్రుడు వంటి ఏడు ఖగోళ గ్రహాలకు ముడిపడి ఉంటుంది.
(17:59) ఇంకా మూడవ అంగం నక్షత్రం అది 27 నక్షత్రాల సమూహంలో చంద్రుని స్థానం ఇంకా నాలుగవ అంగం యోగ లేదా సూర్యుని కదలికను ఇంకా ఇది ఈ క్యాలెండర్ లోని సంక్లిష్టమైన అంశం ఈ గ్రహంతో సంబంధితంగా సూర్యచంద్రుల కదలిక ఇంకా కరణ ఐదవ అంగం కరణ ప్రత్యేక శుభ సమయాలు అప్పుడు ఒకరు తమ జీవితంలో తమ విభిన్న కర్మలను ఒక నిర్దిష్ట సమయంలో ఉత్తమ ఫలితాల కోసం చేయవచ్చు లేదా మనల్ని మనం సాధ్యమైనంత ఉత్తమమైన చర్యకు శక్తివంతం చేసుకోవడానికి తీరప్రాంత రాష్ట్రాలలో నెల సాధారణంగా అమావాస్య లేదా కొత్త చంద్రుని రోజుతో మొదలవుతుంది
(18:44) ఉపఖండంలోని ఇతర ప్రాంతాలలో వారు పౌర్ణమితో నెలను ప్రారంభిస్తారు లేదా పున్నమి రోజుతో దురదృష్టవ వసాత్తు బ్రిటిషర్లు వచ్చినప్పుడు వారు ఇవన్నీ పక్కన పెట్టి గ్రెగోరియన్ క్యాలెండర్ ను తీసుకొచ్చారు. ఆధునిక క్యాలెండర్ అని పిలవబడేది. అది ప్రాథమికంగా ఒక సంఖ్యా వ్యవస్థ. నేను దీనిని సంఖ్యా వ్యవస్థ అని పిలుస్తున్నాను.
(19:08) ఎందుకంటే ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి గణిత సామర్ధ్యాలు బొత్తిగా లేని వారికి లెక్కించడం సులభం. కానీ ఒక క్యాలెండర్ ఈ గ్రహానికి సంబంధించిన ఖగోళ కదలికలతో సంబంధం కలిగి ఉండాలి. గ్రెగోరియన్ క్యాలెండర్ లో అవేమీ లేవని కాదు. కానీ అది కేవలం చిన్నపాటి పద్ధతిలో మాత్రమే ఉంది. ఇంకా అది మిమ్మల్ని జాగురూకులను చేయదు మనం ఉన్న వ్యవస్థలో ఈరోజు ఏమి జరుగుతుందో దానిలో పౌర్ణమి లేదా అమావాస్య గురించి ప్రస్తావనే లేదు ఇది మానవ శరీర ధర్మశాస్త్రం ఇంకా మనస్తత్వ శాస్త్రం రెండింటిపైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
(19:48) ఇంకా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న అనేక ఇతర విషయాలపై కూడా ఆటుపోట్లతో సహా వాళ్లేమో ఆదివారాన్ని సెలవుగా పెట్టారు. ఆ రోజు జీవపరంగా మీకు ఏ ఔచిత్యం లేనిది ఈ నాగరికతలో నెలవారి సెలవులు ఇలా ఉండేవి ప్రతి పౌర్ణమికి మూడు రోజులు సెలవు ఒక రోజు ముందు ఆ రోజు మరుసటి రోజు అమావాస్యకి రెండు రోజులు సెలవు ఎందుకంటే పౌర్ణమికి అమావాస్యకి మన వ్యవస్థతో సంబంధం ఉంది.
(20:18) ఈ గ్రహంతో సంబంధం ఉంది. మనం పుట్టిన విధానంతోనే సంబంధం ఉంది. ఈరోజు మనం భౌతికంగా ఇక్కడ ఉన్నామంటే అది కేవలం మన తల్లుల శరీరాలు చంద్రుడి గమనంతో లయబద్ధంగా ఉండటం వల్లే లేదంటే మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు కాబట్టి ఈ క్యాలెండర్ లో మనం వసంత విషువత్తుని ఒక ముఖ్యమైన ఘట్టంగా తీసుకున్నాం ఎందుకంటే అది వసంతం నుండి వేసవికి మారే సమయం ఈ సమయంలో ఈ గ్రహం అది స్వీకరించే సౌరశక్తి పరిమాణంలో ముఖ్యమైన మార్పులకు లోనవుతుంది ఈ గ్రహం మీద ఉన్న జీవమంతా సౌరశక్తితో నడిచేదే ఉత్తరార్ధగోళంలో ఉన్న జీవమంతా వేసవి కాలంలో దీనికి ప్రతిస్పందిస్తుంది.
(21:03) ఎందుకంటే మనం ఉత్తరార్థ గోళంలో ఉన్నాం కాబట్టి ఆ తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి లేదా అమావాస్యే సాధారణంగా కొత్త సంవత్సరం మొదలయ్యే సమయం. అందుకే మనకి దక్షిణాన ఉగాది గుడిపడ్వైశాఖి ఇంకా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ రోజుకు గుర్తుగా మరెన్నో పండుగలు ఉన్నాయి. అదే వసంత విషువత్తు తర్వాత వచ్చే మొదటి అమావాస్య లేదా పౌర్ణమి రోజు ఇప్పుడు ప్రిసిషన్ విషయానికి వస్తే మీకు ప్రిసిషన్ అంటే ఏంటో తెలుసా? సరే ఉదాహరణకి ఈ గ్రహం ఇలా కొద్దిగా వంగి తిరుగుతూ ఉంటే అది ఈ విధంగా తిరుగుతోంది ఇంకా ఈ వైపు కూడా వెళ్తోంది అలా వెళ్లేకొద్దీ
(21:49) దాని అక్షం ఒక ప్రిసిషన్ కి లోనవుతుంది. ఈ గ్రహం అక్షం ఒక కోణంలో వంగి ఉంటుంది. కాబట్టి ప్రిసిషన్ ఏర్పడుతుంది. లేదా ప్రాథమికంగా అది ఈ విధంగా కదులుతోంది. దీన్ని పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈ ప్రెసిషన్ క్యాలెండర్ తయారు చేసే మొత్తం లెక్కింపుని చాలా చాలా సంక్లిష్టమైన వ్యవహారంగా మార్చేస్తుంది. హిందూ క్యాలెండర్ లో లేదా లూని సోలార్ క్యాలెండర్ లో దీన్ని పరిగణలోకి తీసుకున్నారు.
(22:20) కాబట్టి ఇలా ఒక అక్షం బయటకు ఉంటే అది ఈ విధంగా వెళుతూ ఉండేది. చారిత్రాత్మకంగా చూస్తే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇస్కాల్డ్ స్మీష ఇన్సన్స్ లాంగ్వేజ్ ఆర్ సంస్కృతం అదే విషువత్తుగా ఉండాలి. ఎన్నో ఏళ్ల క్రితం అదే విషువత్తు అది సుమారుగా ఐదవ శతాబ్దంలో అని అంటారు. కానీ ఈరోజుక అది సుమారు 24 రోజులు తేడా వచ్చింది. ఇది జరిగింది ఆ ప్రెసిషన్ వల్ల.
(22:54) సూర్యుడు చంద్రుడు ఇంకా భూమి మధ్య ఉన్న జామితి కాలక్రమేణ మారుతూ ఉండటం వల్ల అది మారుతూనే ఉంటుంది. ప్రాథమికంగా ఈరోజు మీరు వసంత విషువత్తు నాడు సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలోకి చూస్తే నిజానికి ఓ వెయ్యేళ్ల క్రితం కనిపించిన ఆకాశ భాగానికి బదులు ఇప్పుడు వేరే భాగాన్ని చూస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి టెలిస్కోప్ కూడా లేకుండానే తెలుసు విషువత్తు సమయంలో ఈ గ్రహం యొక్క అయస్కాంత కవచం అంటే మనందరిని సూర్యుడి నుండి వెలువడే అధిక శక్తి ప్లాస్మా నుండి రక్షించేది సోలార్ ఫ్లేయర్స్ సౌర తుఫానుల వంటి వాటి నుండి ఈ సమయంలో ఆ కవచం రక్షణ బలహీనపడుతుంది ఎందుకంటే భూమి అయస్కాంత
(23:34) క్షేత్రం సూర్యుడి అయస్కాంత క్షేత్రంతో ఒకే రేఖలోకి వస్తుంది. ముఖ్యంగా 23 నుండి 33 డిగ్రీల అక్షాంశం మధ్య ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. భారతదేశం పాక్షికంగా ఈ అక్షాంశంలో ఉంది. యూరప్, చైనా ఇంకా యునైటెడ్ స్టేట్స్ లోని కొన్ని భాగాలు ఆ అక్షాంశంలో ఉన్నాయి అంటే భూమి అయస్కాంత క్షేత్రం ఆటంకాలకు గురవుతుంది. మరోలా చెప్పాలంటే సూర్యుని ప్లాస్మా లేదా సూర్య శక్తిచే తీవ్రంగా ప్రభావితమవుతుంది.
(24:03) కాబట్టి ఇది గమనించాల్సిన విషయం 23 నుండి 33°ల మధ్య ఉన్న ఈ ప్రాంతంలోనే ఈ గ్రహం మీద అత్యధిక అభివృద్ధి జరిగింది. ఎందుకంటే సూర్యశక్తి ఇక్కడ అత్యధిక స్థాయిలో ఉంటుంది. సౌరశక్తి మనందరికీ ఈ గ్రహం మీద ఉన్న జీవరాసులన్నిటికీ ప్రాథమిక శక్తి వనడు కాబట్టి సహజంగానే ఈ ప్రాంతంలో నివసించే జనాభా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే విపరీతమైన ఉష్ణోగ్రతలు లేకుండా గరిష్ట స్థాయిలో సౌర శక్తి ఈ అక్షాంశాల బ్యాండ్ లోనే లభిస్తుంది.
(24:39) దక్షిణ భారతదేశం అయస్కాంత భూమధ్య రేఖకు సరిగ్గా దగ్గరగా ఉంటుంది. అక్కడ వాతావరణంలో చాలా ఎత్తులో తీక్షణమైన విద్యుత్ ప్రవాహపు పట్టి ఉంటుంది. విషవత్తు సమయంలో అయస్కాంత క్షేత్రం గనుక చెదిరిపోతే ఈ కరెంట్ బ్యాండ్ చాలా విద్యుత్ ఛార్జ్ ను సృష్టించగలదు. అయితే మీరు ఈ ఛార్జ్ ని ఒక ఆటంకంగానైనా లేదా ఒక సాధికారతగానైనా చూడవచ్చు.
(25:07) నేను విషుత్తుకి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నన్ను రూపుదిద్దింది ఈ విషువత్తే. నా జీవితం దాన్ని నా జీవితం అని పిలవగలిగితే ఎందుకంటే నేను అంతకుముందు ఉన్నదంతా 1982 శరత్కాల విషువత్తుకు ముందు దానికి ముందు నేను ఎవరైతే ఉన్నానో ఆ నేను ఆ రోజు ఆవిరైపోయాను. ఇంకా నేను విషువత్తు యొక్క సంతానం కాబట్టి నేను దీని ప్రాముఖ్యతను ఇంతకంటే చెప్పలేను నా విషయంలో అంతా విషువత్తు చుట్టూనే తిరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి.
(25:38) మీ శరీరంలోని ప్రతి ముఖ్యమైన పని ప్రాథమికంగా విద్యుత్ ప్రవాహం లేదా విద్యుత్ చార్జ్ తో నడుస్తుంది. మీ గుండె కొట్టుకోవడం నుండి మీ మెదడులో ఒక ఆలోచన పుట్టడం వరకు అదంతా చార్జ్ చేయబడిన అయాన్ ల కదలిక వల్లే నియంత్రించబడుతుంది. కాల్షియం, సోడియం, పొటాషియం ఇంకా మెగ్నీషియం మీ కణాల గుండా కదులుతాయి. అయాన్లు కొంత విద్యుత్ చార్జ్ ఉన్న అణువులు కాబట్టి అవి మన చుట్టూ ఉన్న అయస్కాంత విద్యుత్ క్షేత్రాల ద్వారా ప్రభావితం కాగలవు.
(26:11) కాబట్టి మీరు అయస్కాంత భూమధ్యరేఖ కింద ఉన్నా లేదా మీరు ఈ పరిధిలో ఉన్న అక్కడ కొన్ని ఋతువులలో మీపై అపారమైన ప్రభావం ఉంటుంది. మీ మెదళ్లుు మెరుగ్గా పని చేయగలవు మీ గుండె మెరుగ్గా కొట్టుకోగలదు. మీలోని ప్రతిదీ మెరుగ్గా పని చేయగలదు. అన్నిటికన్నా మించి అది మనిషికి సాధికారతనిస్తుంది. ఒకవేళ ఒకరు గ్రహణ శక్తితో ఉంటే సరైన పద్ధతిలో భూమి వాతావరణంలోని విద్యుత్ క్షేత్రాలు ఇంత విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పుడు మీ శరీరం ఒక సూక్ష్మ యాంటెనాలా పనిచేస్తుంది.
(26:44) ఈ మార్పులను ఛార్జ్‌లను అందుకుంటుంది. ఇవి మన అస్తిత్వ క్షేత్రంలో జరుగుతున్నవి. మీ వ్యవస్థ దీనికి సన్నద్ధంగా లేకపోతే ఈ పర్యావరణ హెచ్చుతగ్గులు ఛార్జ్ చేయబడిన అయాన్లను మీ న్యూరాన్లలోకి అకాలంగా లీక్ అయ్యేలా బలవంతం చేస్తాయి. మెదడు అతిగా ఉత్తేజితమవుతుంది. ప్రజలు దీనిని మైగ్రేన్లు బ్రెయిన్ ఫ్యాగ్ చిరాకుగా ఇంకా వింతగా అనిపించడంగా అనుభవిస్తారు.
(27:14) లేదా మీరు దాన్ని సరైన పద్ధతిలో స్వీకరిస్తే అపారమైన సాధికారతను పొందవచ్చు. యోగ వ్యవస్థ ఒక జామితి వ్యవస్థ. మీ జామితిని సృష్టి యొక్క పెద్ద జామితితో సమలేఖనంలోకి తేవడం. అలా చేస్తే ప్లాస్మా సౌర ప్లాస్మా ఇంకా మన చుట్టూ ఉన్న విద్యుత్ చార్జ్‌ల ఈ సహజ పరిణామాలన్నీ జీవశక్తిని పెంచేవిగా మారతాయి. తెలుసా ప్రజలు ఎప్పుడూ వాళ్ళు ఈరోజు సరైన మూడ్‌లో లేరని చెబుతుంటారు.
(27:45) కాదు మీ వెర్రితనానికి ఈ గ్రహాన్ని ఒక సాకుగా ఉపయోగించడం మొదలు పెట్టకండి నాకు తెలుసు లూనసీ అనే పదం లూనార్ నుండి వచ్చింది. ప్రజలు చంద్రుని మిందిస్తున్నారు. ఆ అందమైన చంద్రుడు మీ పిచ్చికి ఆధారమా? అలా ఉండనవసరం లేదు. అది ఒక సాధికారత. సాధికారతనతని ఇచ్చే శక్తిని ఎలా ఉపయోగించాలో మీకు తెలియకపోతే అది మిమ్మల్ని అస్థిరపరచగలదు.
(28:08) అది మిమ్మల్ని పక్కకు నెట్టేయగలదు. అది అనేక విధాలుగా మీ ప్రాణాన్ని కూడా తీయగలదు. అవును బహుశా మీ మెదడు చుట్టూ లీక్ అవుతున్న అయాన్ల వల్ల అతిగా ఉత్తేజితమవుతూ ఉండవచ్చు. కానీ దాన్ని సరైన రీతిలో స్వీకరించడం ఇంకా మిమ్మల్ని మీరు ఈ సృష్టిలో జీవించడానికి తగినట్లుగా తీర్చిదిద్దుకోవడం మీ బాధ్యతే. సృష్టిని మీ కోసం మీరు అనుకున్న విధంగా మార్చుకోవడం కాదు.
(28:34) ఈ సృష్టిలో జీవించడానికి తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి అందరూ ఒకే స్థాయిలో ప్రభావితం కారు. నేను ఈ విషయాల గురించి ఎప్పుడూ పట్టించుకోను. సూర్యుడు లేదా చంద్రుడు ఎక్కడ ఉన్నా నేను పట్టించుకోను. నాలో ఏమి జరగాలో నేనే నిర్ణయించుకునేలా నన్ను నేను ఉంచుకుంటాను. అది ప్రతి మానవుడికి ఉన్న ఒక అవకాశం. మీరు ఆ సౌర వ్యవస్థ అనే కుమ్మరి చక్రాన్ని అధిగమించవచ్చు.
(29:02) లేదా కనీసం దానిపై సవారీ చేయవచ్చు. అందుకే ఈ గ్రహం మీద మిమ్మల్ని మాత్రమే ఒక బీయింగ్ అని పిలుస్తారు. అంటే ఎలా ఉండాలో మీకు ఎంపిక ఉంది. మీరు మానవ జంతువు కాదు. మీరు హ్యూమన్ బీయింగ్ అంటే శక్తులు ఏమైనప్పటికీ ఎలా ఉండాలో మీకు తెలుసు. అప్పుడే మిమ్మల్ని హ్యూమన్ బీయింగ్ అని పిలవగలం. లేకపోతే మీరు ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఇతర జీవి లాంటివారే అవన్నీ ఈ కారకాలచే ప్రభావితమవుతాయి.
(29:32) కానీ ఒక మానవుడు తన అంతర్గత అనుభూతిని తన ఆధీనంలోకి తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటాడు. మీరు గనుక మీ వ్యవస్థను సాధన ద్వారా సిద్ధం చేసుకుంటే అవే ఆటంకాలు టేక్ ఆఫ్ చేయడానికి ఒక రన్‌వే కాగలవు. ఇది ఒక హ్యాంగ్ గ్లైడర్ లేదా గ్లైడర్ లాంటిది. అది గాలికి ఎదురుగా ఉత్తమంగా ఎగురుతుంది. కానీ మీకు దీన్ని ఈ గ్లైడర్ ని ఎలా నడపాలో తెలియకపోతే అది కేవలం ఒక నిర్దిష్ట జామితీయ రూపం మీరు తుడిచిపెట్టుకుపోతారు.
(30:07) కానీ మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలిస్తే మీరు పైకి ఎగరగలరు. అవును ఎగరాలనే అభిరుచి నాకు 12 ఏళ్ల వయసులోనే పట్టుకుంది. నాకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు ముడి నమూనాలతో నిరంతరం ప్రయత్నించిన తర్వాత నేను నా సొంతంగా ఒక హ్యాంగ్ గ్లైడర్ ను నిర్మించగలిగాను. ఆ సమయంలో పాపులర్ మెకానిక్స్ మ్యాగజైన్ లో ఉన్న ఒక మోడల్ ఆధారంగా ఇంకా మాకు ఆధునిక సామాగ్రి ఈరోజు అందుబాటులో ఉన్నట్టుగా అప్పుడు లేదు కాబట్టి మేము కొన్ని పాత పారాచూట్ సిల్క్ వెదురు ఇంకా అన్ని రకాల పరికరాలు కొని ఒక పెద్ద యంత్రాంగాన్ని నిర్మించాం.
(30:49) అది ఎగురుతుందని మేము నమ్మాము. ఇక అసలు ఎగిరే విషయానికి వస్తే ఒక కొండవాలు నుండి పరిగెత్తడం నా స్నేహితుల్లో ఎవరూ దానికి సిద్ధపడలేదు వాళ్ళంతా తెలివైన అబ్బాయిలు నేన ఒక్కడినే తగినంత ప్రేరణతో ఉన్నాను. దాన్ని తీసుకుని ఎగరడానికి ప్రయత్నించేంత మూర్ఖుడిని అది నిజానికి ఎగరడానికి తయారు చేయబడలేదు నేను ఆ పరికరంతో టేకాఫ్ అయ్యాను.
(31:19) నేను గాలిలో సుమారు 22 సెకండ్ల పాటు ఉన్నానని అనుకుంటున్నాను. వాళ్ళు నాకు చెప్పింది అదే ఆ తర్వాత అదంతా ముడుచుకుపోయి నేను కింద పడిపోయాను. ఇవి టెన్నస్సీలోని నునుపైన గుండ్రని కొండలు కావు. ఇది దక్షిణ భారతదేశం ఇక్కడ కొండలు కఠినంగా రాళ్లతో ముళ్ళతో అన్నిటితో నిండి ఉంటాయి. మరి అది దానివల్ల నా రెండు చీలమండలు విరిగిపోయాయి. నాకు చాలా సరైన హ్యాంగ్ గ్లైడర్ కొనుక్కొని ఎగరడానికి నాకు మరో ఐదేళ్ళు పట్టింది.
(31:57) అయితే నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర మన శరీరం మనసు అనే అద్భుతమైన పరికరాలు ఉన్నాయి. కానీ అవి పైకి ఎగరాలంటే వాటిని మీరు సరిగ్గా పట్టుకోవాలి. లేదంటే మనల్ని నిలబెట్టే ప్రతి సహజ శక్తి మనకు వ్యతిరేకంగా ఉందని మనం అనుకుంటాం. వాటిని ఆటంకాలుగా భావిస్తారు. ప్రతికూల శక్తులుగా చూస్తారు. కాదు కాదు మీరు సరైన మార్గంలో ఉంటే ఇవి మీకు బలాన్ని ఇచ్చే శక్తులు.
(32:26) ఈ రోజుకు కూడా అన్ని విమానాలు గాలికి ఎదురుగా టేక్ ఆఫ్ అవుతాయి. గాలి వాటంలో కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. తర్వాతసారి మీరు విమానం ఎక్కినప్పుడు ఒక్కసారి ఆ విండ్ సాక్ ని చూడండి. గాలి మీకు వ్యతిరేకంగా ఉంటుంది. అప్పుడే మీరు బాగా పైకి ఎగరగలరు. కాబట్టి ఒక ఆటంకం ఆటంకం అనిపించేది కేవలం దానికి మీరు సిద్ధంగా లేనప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు తగినంతగా సిద్ధం చేసుకుని ఉంటే అది తర్వాతి స్థాయికి వెళ్ళడానికి ఒక అవకాశం.
(32:55) ఒక వ్యక్తిలో పిచ్చికి కారణమయ్యే అదే విశ్వ జామితి. మరొకరిలో వికాసాన్ని ప్రేరేపించగలవు. అది పూర్తిగా మీ వ్యవస్థను మీరు ఎలా తీర్చిదిద్దుకున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. విషవత్తుల సమయంలో గమనించాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే మీ జుట్టును తడిగా ఉంచుకోవడం ముఖ్యంగా సంధ్య వేళల్లో లేదా రోజులో నాలుగు సార్లు వచ్చే సంధి కాలంలో అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇంకా అర్ధరాత్రి అయితే అర్ధరాత్రి సంధ్య చాలామందికి వర్తించకపోవచ్చు.
(33:30) ఒకవేళ జుట్టును తడిగా ఉంచుకోలేకపోయినా లేదా కాలం ఇంకా ఇక్కడ జీవించడం అనేది మీ జుట్టుపై ప్రభావం చూపి ఉంటే కనీసం నడి నెత్తిని తడిగా ఉంచుకోవాలి. దీన్ని మీరు అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా చేయవచ్చు. కానీ విషవత్తు నుండి ఆయనం వరకు ఉండే ఈ కాలం ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సమయంలోనే సూర్యుని ప్రభావం గరిష్ట స్థాయిలో ఉంటుంది.
(34:02) కాబట్టి ఈ శక్తుల వల్ల మీ జీవితం మెరుగుపడాలంటే మీరు పాటించాల్సిన కొన్ని సులభమైన విషయాలు ఉన్నాయి. చాలా సులభంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఓ రెండు దశాబ్దాల క్రితం 20 30 ఏళ్ల క్రితం బయట పనిచేసే వాళ్ళను చూస్తే ముఖ్యంగా రైతులు కూలీలు ఎండలో పనిచేసేవాళ్ళు ఈ సమయంలో పౌర్ణమి అంటే చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు తమిళంలో దీన్ని చిత్ర పౌర్ణమి అంటారు ఈ రోజు నుండి వేసవి ఆయన వచ్చే వరకు ఏ రైతు పొలంలోకి వెళ్ళేవాడు కాదు లేదా ఆ సమయంలో ఏ తమిళ వ్యక్తి బయటికి వెళ్లేవాడు కాదు ఆముదం నూనె చాలా చిక్కగా
(34:48) ఉండే నూనె నెత్తి మీద రాసుకోకుండా ఎందుకంటే నూనె మీ తలని రోజంతా తడిగా ఉంచే ఒక మార్గం నీళ్లు పోస్తే 10 నిమిషాల్లో ఆవిరైపోతాయి అందుకే వాళ్ళు బయటికి వెళ్లే ముందు నూనె రాసుకునేవారు ఇది ఒక సాధారణ దృశ్యం రైతులు ఎప్పుడు వాళ్ళ నెత్తి మీద ఆముదో నూనె రాసుకునే కునేవారు ఇది కర్ణాటక దక్షిణ ప్రాంతాలలో కూడా చాలా ప్రబలంగా ఉంది. దీన్ని నేను నా పొలాల్లో చూశాను.
(35:13) కూలీలు ఎప్పుడూ పొలానికి రాలేదు వాళ్ళ నెత్తి మీద నూనె లేకుండా అందుకే ఈ సంస్కృతిలో పండుగలను ఆ విధంగా ఏర్పాటు చేశారు. అన్ని భారతీయ పండుగలు క్యాలెండర్ ఆధారితమైనవే కానీ నమ్మకాల ఆధారితమైనవి కాదు. సూర్యుడు చంద్రుడు భూమి ఎలా అమరి ఉన్నాయనే దాని ఆధారంగా ఉంటాయి. ఆ రోజున ఏమి జరుగుతుందో గమనించి ప్రక్రియలను సృష్టించారు.
(35:39) తద్వారా ప్రజలు అందులో పాలుపంచుకొని కొన్ని శక్తుల వల్ల ప్రభావితం కాకుండా అవే శక్తుల వల్ల ప్రయోజనం పొందేలా. ఎందుకంటే ప్రతి మనిషికి ఒకే విధమైన దృఢత్వం ఉండదు. వాళ్ళు సరైన పనులు చేయకపోతే ప్రభావితం కావచ్చు. ఒకరు తేలికగా దాటగలిగేది మరొకరిని కుంగదీయవచ్చు. కాబట్టి ఎన్నో సులభమైన విషయాలు సూచించారు. ఉదాహరణకు సీజనల్ పండ్లు కూరగాయలు తినడం అనేది ఒక ప్రాథమిక అంశం ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం మీరు పీల్చే శ్వాస అంతా ముఖ్యమైనది.
(36:16) అయితే మీరు దక్షిణ భారతీయులు అయితే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీ చారు అని పిలిచేది తీసుకుంటారు. తమిళనాడులో పళళైసాదం కర్ణాటకలో కూడు ఈ పదార్థాలు ఏమిటంటే ఇవి శరీరాన్ని చల్లబరిచేవి ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిలో B12 పుష్కలంగా ఉంటుంది. ఈ ఆహారాల్లోని చలువు చేసే గుణం, ఇంకా B12 అధికంగా ఉండటం, సూర్య కిరణాలు ఒక నిర్దిష్ట స్థాయి తీవ్రతతో ఉన్నప్పుడు చాలా ముఖ్యం.
(36:46) ఈ విషయాలు వాళ్ళు ఎప్పుడో గ్రహించి ఈ మధ్య వరకు శ్రద్ధగా పాటించేవారు కానీ ఈరోజు మీరు న్యూజిలాండ్ నుండి పండ్లు ఇంకా మూడు నెలల క్రితం వండిన ఇటలీ పాస్తా తినాలనుకుంటున్నారు. నాకు ఈ ఆహారాల పట్ల లేదా ఆ ప్రదేశాల పట్ల ఏమీ వ్యతిరేకత లేదు. ఎంచుకునే స్వేచ్ఛ ఉండటం గొప్ప విషయమే. కానీ ఏది శ్రేయస్సును తెస్తుందో దాన్ని ఎంచుకోవడం మీరు నేర్చుకోవాలి.
(37:12) దాని చుట్టూ అప్పుడప్పుడు ఇతర ప్రాంతాల నుండి వచ్చే ఆహారాలతో ఒక చిన్న సాహసం చేయాలనుకోవటం పర్వాలేదు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి మీరు తీసుకునే ఆహారం మీ శ్రేయస్సుకు ఒక ప్రాథమిక సాధనమని హిందూ క్యాలెండర్ లో సంవత్సరం రెండు భాగాలుగా విభజించబడింది. డిసెంబర్ లో శీతాకాల ఆయన నుండి జూన్‌లో వేసవి ఆయనం వరకు ఉన్న కాలాన్ని ఉత్తరాయనం అంటారు.
(37:41) ఇది సూర్యుని ఉత్తర ప్రయాణం గడిచే ప్రతి రోజుతో సూర్యుడు ఉత్తరం వైపు కదులుతాడు. ప్రతిరోజు సూర్యోదయం మరికొంచెం ఉత్తరం వైపు జరగడం మీరు గమనిస్తారు. వేసవి ఆయనం శీతాకాల ఆయనం మధ్య కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఇది దక్షిణ ప్రయాణం. అప్పుడే సూర్యుడు దక్షిణం వైపు కదలడం మొదలుపెడతాడు. యోగ సంప్రదాయంలో ఉత్తరాయణాన్ని పంటకోతల కాలంగా చూస్తారు.
(38:08) వ్యవసాయపరంగాను ఆధ్యాత్మిక ఎదుగుదల పరంగా కూడా దీన్ని కైవల్య పాదం అంటారు. దక్షిణాయనాన్ని మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే కాలంగా పరిగణిస్తారు. దీన్ని సాధన పాదం అంటారు. ఈ ఆధ్యాత్మిక కోణాలే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత అంశాలు ఉన్నాయి. మీ జీవక్రియ మీ గ్రంధుల పనితీరు మీ రోగ నిరోధక శక్తి సంవత్సరంలోని వేరువేరు సమయాల్లో ఇవన్నీ విభిన్నంగా పనిచేస్తాయి.
(38:38) ఇది గమనించారు కూడా అనేక అధ్యయనాలు ధృవీకరించాయి. ఉత్తరాయనంలో మెదడులో న్యూరాన్ల పెరుగుదల, వాటి మధ్య కనెక్షన్లు చాలా ఎక్కువగా ఉంటాయని ధృవీకరించాయి. దక్షిణాయనంలో ఆ వ్యవస్థ ఒక మెదడులో ప్రక్షాళన లేదా శుద్ధి వైపు మారుతుంది. ఒక రకమైన క్లీనప్ దశలోకి ఇదంతా ఉత్తరార్థ గోళం పరంగా చెబుతున్నాం. ఎందుకంటే అత్యధిక జనాభా చాలా కాలం పాటు ఎక్కువగా ఉత్తరార్థ గోళంలోనే ఉన్నారు.
(39:11) ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఈ సహజ ప్రక్రియల నుండి మీరు ప్రయోజనం పొందేలా పండుగల ద్వారా మనం వివిధ పద్ధతులను ఏర్పాటు చేసుకున్నాం. ఉదాహరణకి మార్గళిని తీసుకుందాం. తమిళ నెల అయిన మార్గళి డిసెంబర్ 16న ప్రారంభం అవుతుంది. దక్షిణాయనం చివర్లో మార్గళి అనేది స్థిరత్వం. సమతుల్యం తీసుకురావడానికి సరైన సమయం దీనికోసం మీరు చేయగల సాధనలు చాలా ఉన్నాయి చన్నీటి స్నానం చేయమని చెప్పాం కదా? సూర్యోదయానికి ముందు వీలైతే బ్రహ్మ ముహూర్తంలో మీరు చల్లటి నీటిలో మునిగినప్పుడు రక్తనాళాలు ముఖ్యంగా చర్మం కింద ఉన్నవి మీ శరీరమంతటా సంకోచిస్తాయి లేదా చాలా
(39:59) ఇరుకుగా మారతాయి. ఇది వేడిని శరీరం నుండి బయటకు పోనివ్వకుండా శక్తిని ఆదా చేస్తుంది. ఈ సంకోచం ఇంకా రోజువారి పనుల వల్ల సహజంగా జరిగే వ్యాకోచం వల్ల రక్తనాళాలు మరింత ఫ్లెక్సిబుల్ గా మారతాయి. ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి ఇంకా హృదయనా వ్యవస్థకు ఇది చాలా ముఖ్యం. ఈ ప్రక్రియను ఒక్కరోజు మాత్రమే చేయటం వల్ల శరీరానికి షాక్ మాత్రమే తగులుతుంది.
(40:25) అది శాశ్వత శారీరక మార్పులు ఏవి తీసుకురాదు. అందుకే దీన్ని ఒక మండలం అంటే 40 నుండి 48 రోజుల పాటు చేయమని చెబుతాం. మీరు ఒక మండలం పాటు ఈ ప్రక్రియను పాటిస్తే అది మీ హృదయనాల వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి. నేను అన్ని ఆరోగ్య అంశాల్లోకి వెళ్ళను ఎందుకంటే మనం మాట్లాడుతున్నది అసలు జీవం గురించి కేవలం ఆరోగ్యం గురించి కాదు బహుశా చాలామందికి ఆరోగ్య ప్రయోజనాలే స్పష్టంగా కనిపించవచ్చు కానీ అసలు విషయం కేవలం ఆరోగ్యం గురించి కాదు మనం చూసుకోవాల్సింది ఏంటంటే శరీరం మనసు మన జీవితంలో అడ్డంకులుగా మారకుండా ఉండాలి.
(41:11) అవి సోపానాలుగా మారాలి మీ తక్షణ ఇంకా అంతిమ శ్రేయస్సు కోసం సరే అందులో భాగంగా మనకు ఆరోగ్యం కావాలి భావోల్లాసం కావాలి మనసు చురుకుదనం కావాలి కానీ ఇవేవి తమకు తామే లక్ష్యాలు కావు మనిషిగా జీవించడంలోని మరింత లోతైన అంశాలను అన్వేషించడానికి వీటిని ఒక ఆధారంగా ఉపయోగించుకోవాలి. మానవ జీవితం కేవలం బతకడంతోనే ముగిసిపోదు. బతకడానికి కావాల్సినవి సమకూరిన తర్వాతే మానవ జీవితం అసలు మొదలవుతుంది.
(41:44) అన్నింటికన్నా ముఖ్యంగా మీరు మనిషి అయితే నక్షత్రాలు, గ్రహాలు మీ జీవిత అనుభవాన్ని నిర్ణయించాల్సిన పని లేదు మీరు కేవలం మీరు ఒక్కరే మీ అంతర్గత అనుభవాన్ని నిర్ణయించుకోవాలి. కాబట్టి చంద్రుడు సూర్యుడు, క్యాలెండర్ ఇవన్నీ ముఖ్యమైనవే కానీ వాటి ధ్యాసలోనే ఉండిపోకండి. ఒక కన్నడ యోగి దేవరదాసిమయ్య రాసిన ఒక అద్భుతమైన పద్యం ఉంది.
(42:12) ఆయన గురించి మీరు వినే ఉంటారు అనుకుంటున్నాను వినకపోతే ఆయన కవిత్వం వెతకండి అది అద్భుతంగా ఉంటుంది. ఆ పద్యంలోని ఒక చరణం మీకు చదివి వినిపిస్తాను. అచ్చ శివ భక్తంగే హొత్తారే అమావాసే మట్ట మధ్యాహ్న సంక్రాంతి మత్తే అస్తమాన పావర్ణమి ఉన్నిమే భక్తన మనయ అంగళవే వారణాసి కాణ రామనాథ దాని అర్థం ఏంటంటే శివునితో పూర్తిగా మమేకమైన వారికి తెల్లవారుజాము లేదు అమావాస్య లేదు మధ్యాహ్నం లేదు విసువత్తులు లేవు సూర్యాస్తమయాలు పౌర్ణములు లేవు అతని ఇంటి ముంగిటే నిజమైన
(42:59) వారణాసి ఓ రామనాథ. కాబట్టి ఒక యోగి అంటే కాలంతో ఐక్య స్థితిలో ఉన్నవాడు అంటే మనం శివ అని పిలిచే ఈ సృష్టికి మూల పదార్థమైన దేశకాలాలతో ఐక్య స్థితిలో ఉన్నవాడు. అలాంటివాడు ఈ విశ్వ కదలికల ప్రభావానికి అతీతంగా ఉంటాడు. చంద్రుడు నిండుగా ఉన్నాడా లేడా సూర్యుడు ఉత్తరానికి కదులుతున్నాడా దక్షిణానికి కదులుతున్నాడా అనే దాన్ని బట్టి అతని అంతర్గత అనుభవం నిర్ణయించబడదు ఎందుకంటే మానవ చైతన్యం సృష్టిలోని ఈ భౌతిక రూపాలన్నింటికీ అతీతమైనది అవి ఎలా కదులుతున్న సరే యోగ లక్ష్యం అదే మీ జీవిత అనుభవాన్ని మీ
(43:46) ఆధీనంలోకి తీసుకురావడం అప్పుడు అది ఇకపై భౌతిక సృష్టి చక్రాల చేత నిర్ణయించబడదు. కానీ మీరు ఆ విముక్తి స్థితికి చేరుకునే వరకు మీరు దేశకాల చక్రాలను అధిగమించే వరకు ఆ చక్రాలపై స్వారీ చేయడం నేర్చుకోవాలి. ఈ చక్రాలపై స్వారీ చేయడానికి సరైన క్యాలెండర్ అవసరం. కాబట్టి దయచేసి మీకై మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని సృష్టించుకోవడానికి నిర్మించుకోవడానికి పంచాంగాన్ని ఉపయోగించడం నేర్చుకోండి.
(44:18) మన చుట్టూ ఉన్న సృష్టి యొక్క అద్భుతమైన గహనమైన సంక్లిష్టమైన స్వభావాన్ని అభినందించడం నేర్చుకోండి కానీ అన్నింటికంటే ముఖ్యంగా అన్వేషించండి మానవ చైతన్యం యొక్క ఆ మహాద్భుతమైన స్వభావాన్ని మళ్ళీ 360 లో కలుద్దాం
No comments:
Post a Comment