Saturday, May 30, 2026

 రామలక్ష్మణభరతశత్రుఘ్నులు నలుగురూ నాలుగు వేదాలకు ప్రతీకలు. రాముడు- ధర్మానికి ప్రతీక అయిన యజుర్వేదానికి, లక్ష్మణుడు రుగ్వేదానికి, భరతుడు సామ వేదానికి, శత్రుఘ్నుడు అధర్వణ వేదానికి ప్రతీకలు. లక్ష్మణుడు ‘అ’కారమునకు, భరతుడు ‘ఉ’కారమునకు, శత్రుఘ్నుడు ‘మ’కారమునకు, శ్రీరాముడు ప్రణవ నాదమైన ‘ఓం’కారమునకు స్వరూపులు. దశరథునికి పుత్ర కామేష్ఠి వలన నలుగురు సంతానం కలుగగా, కుల గురువైన వశిష్ఠ మహర్షి వారికి నామకరణం చేస్తాడు.

రామ శబ్దానికి అర్థం- ‘రమయతి గుణై: ప్రజాయితి రామ:’
ర-మించు అనగా ఆనందించు, అందరినీ ఆనందింప చేయువాడు, ఆహ్లాదపరచువాడు అని అర్థం. అందరినీ ఆనందింప చేసేవాడు రాముడు..

లక్ష్మణుడు శౌర్య వీర్యము లను ప్రదర్శించు లక్ష్మీ సంపన్నుడు. లక్ష్మీనారాయణుల సేవయే తన శ్వాసగా భావించి ఆచరించేవాడు.

భరతుడు అందరినీ ప్రేమానందములతో ఆశ్చర్యకరమైన ధర్మ ప్రవృత్తి కలిగి ప్రజల పోషణ గావించే వాడు. 

ఇక, శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసి అన్నల అడుగుజాడలలో నడిచి, శాంతచిత్తుడై ప్రవర్తించే వాడు.    *ఆధ్యాత్మిక కుటుంబం*

No comments:

Post a Comment