*హిందూ ధర్మచక్రం సూక్తి*
!!శ్లో!!
*దరిద్రాయ కృతం దానం*
*శూన్యలింగస్య పూజనం!*
*అనాథప్రేత సంస్కారం*
*అశ్వమేధసమం విదుః!!*
అర్థం,,,ఈ శ్లోకం సమాజంలో అత్యంత పుణ్యప్రదమైన మూడు పనుల గురించి వివరిస్తుంది.
*దరిద్రాయ కృతం దానం*
పేదవారికి లేదా అత్యంత
నిరుపేదలకు చేసే దానం.
*శూన్యలింగస్య పూజనం*
ఎవరూ పూజించని, నిర్జన ప్రదేశంలో లేదా అడవులలో ఉన్న శివలింగానికి (లేదా పూజకు నోచుకోని దైవానికి) పూజ చేయడం.
*అనాథప్రేత సంస్కారం*
దిక్కులేని, అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు (క్రియలు) నిర్వహించడం..
ఈ మూడు పనులను ఎవరైతే భక్తితో, నిస్వార్థంగా చేస్తారో, వారికి అశ్వమేధ యాగం చేసినంత గొప్ప ఫలితం పుణ్యం లభిస్తుంది.
No comments:
Post a Comment