Wednesday, July 1, 2026

ఈ ఒక్క విషయం తెలిసుంటే... ఎన్నో కూతుళ్ల జీవితాలు మారేవి A Mother's Missed Fact

ఈ ఒక్క విషయం తెలిసుంటే... ఎన్నో కూతుళ్ల జీవితాలు మారేవి A Mother's Missed Fact

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=utIf5LdRhX0



Transcript:
(00:00) కొంతమంది ఆడపిల్లల తల్లుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం అనేది ఒక విధంగా ఇబ్బందికరమైన విషయం అనండి అలాగే దురదృష్టం కూడా ఎందుకంటే మాతృమూర్తిని ఉద్దేశించి వీడియో చేయడం అంటే వాళ్ళ మనోభావాలని దెబ్బతీస్తున్నట్టుగా ఉంటుంది కానీ సమాజం మరి వాళ్ళని కూడా తప్పు పడుతున్నది కదా మరి అటువంటప్పుడు ఏం చేయాలి సో వీడియో చేయక తప్పట్లేదండి కాబట్టి కాబట్టి కొంతమంది ఆడపిల్లలు ఉన్న తల్లుల గురించే చేస్తున్నాను కాబట్టి అందరూ దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండి.
(00:40) సో నేరుగా విషయానికి వస్తే మన హిందూ సమాజంలో తల్లులకు ఆడపిల్లల మీద అపారమైన ప్రేమ ఉండటం కారణంగా ఆడపిల్లల పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. అన్న అపవాదు వాదన కూడాను ఎక్కువగా కనిపిస్తున్నదండి చాలామంది తల్లులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు కూడా సమర్థిస్తున్నారు కూడాను సామాజిక మాధ్యమాల్లో ఇలా ఎందుకు జరుగుతుంది అని కూడాను నేను సీరియస్ గా ఆలోచించాను.
(01:14) అసలు ఈ తల్లి ప్రేమను తప్పుపట్టాలా అసలు ఈ తల్లి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నది ఆ ప్రేమ వెనుక ఉన్న భావోద్వేగం ఏమిటి అన్న విషయాల మీద పెళ్లిల విషయంలో తల్లి విలనా అని ఒక టైటిల్ని పెట్టి విశ్లేషణాత్మకంగా ఆ తల్లిని గౌరవిస్తూ ఒక వీడియో చేశనండి చాలామంది చూశారు ఇంకా చూస్తూనే ఉన్నారు అంతా బాగానే ఉంది అయితే ఇలా అటువంటి తల్లుల మీద అపవాదు వస్తున్న నేపథ్యంలో చెప్పాను కదా ఒక వీడియో ఎందుకు చేయకూడదు అని నిర్ణయించుకొని కొంచెం కష్టపడి నోట్స్ ఇది రాసుకొని మీ ముందు
(02:02) ఒక విధంగా చెప్పాలి అంటే కొంత భయంగా కూర్చున్నానండి [నవ్వు] అంటే ఇది ప్రతి తల్లి తనను తాను ప్రశ్నించుకోవాల్సిన సమయం అసలు తల్లి ఇలా ఎందుకు చేస్తుంది అని ప్రశ్న గనుక వేసుకుంటే చాలా మంది అనుకునేది ఏంటంటే తల్లి స్వార్థంతో చేస్తున్నది అనింటే కాదండి ఎట్టి పరిస్థితిలో కాదు చాలాసార్లు కారణం స్వార్థం కాదు కారణం ఏదనా ఉంది అంటే అది భయంఅండి రేపు పొద్దున పెళ్లిఅయితే నా కూతురిని అత్తింట్లో ఎలా చూస్తారు ఒకవేళ విడాకులు వస్తే భర్త మంచివాడు కాకపోతే
(02:47) అసలు నేను లేకపోతే ముందుముందు అమ్మాయి పరిస్థితి ఏంటి అమ్మాయి కూడాను సొంత సంపాదన అంటూ ఒకటి ఉండాలి కదా రేపు పొద్దున అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతే దగ్గరలో ఉండదు కదా గడిగడికి వెళ్లి చూడలేము కదా ఇన్ని ప్రశ్నలన్నీ కూడాను తల్లి ప్రేమలో నుంచి పుట్టినవేనండి కానీ మనం ఒక్క విషయాన్ని మర్చిపోకూడదు ఎక్కడ భయం ఎక్కువైతే ప్రేమ కూడాను బంధనంగా మారుతుందండి మళ్ళీ చెప్తాను భయం ఎక్కువైపోతే ప్రేమ కూడా బంధనంగా మారుతుంది.
(03:26) ఉదాహరణ ఇవ్వటం నాకు అలవాటు కాబట్టి ఒక ఉదాహరణ ఇస్తానండి పక్షి పిల్లకు ఎగరటం రాదు తల్లి పక్షి అమ్మో పడిపోతుంది నా బిడ్డ అని అనుకుంటే ఊట్లోనే ఉంచొచ్చు కదా కానీ అలా గనుక చేస్తే ఆ పిల్ల పక్షి జీవితాంతం ఎగరలేదు కదా రెక్కలను [గొంతు సవరించుకోవడం] చూసి మర్చిపోవడం ప్రేమ తప్పకుండా ఎగరనివ్వాలి అని అనుకోవడం జ్ఞానం అండి జాగ్రత్తగా పట్టుకోండి విషయాన్ని ప్రేమ మైనస్ జ్ఞానం ఇస్ ఈక్వల్ టు భయం ప్రేమ ప్లస్ ధైర్యం ఈక్వల్ టు అద్భుతమైన భవిష్యత్తు
(04:10) ఇది నేను తయారు చేసుకున్న ఈక్వేషన్ అండి సో మార్పు ఎక్కువ రావాలి తల్లి ఆలోచనలో రావాలండి నేను కూతురికి రక్షణ ఇవ్వాలి నిజమే కానీ ఆయన జీవితాన్ని [గొంతు సవరించుకోవడం] నా చేతుల్లోనే ఉంచుకోవాలి అని అనుకోవడం మటకు తప్పండి దీన్ని తల్లి మటుకు చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గురువు తన విద్యార్థిని జీవితాంతం క్లాసులోనే కూర్చోబెడితే ఎలా చెప్పండి నాలెడ్జ్ ఉండవచ్చు ఏది అడిగినా కూడాను చెప్పవచ్చు అది ప్రేమ కాదండి గురువు అన్నవాడు చదువు
(04:56) చెప్పాలి పరీక్ష పెట్టాలి మార్కులు తక్కువ వస్తే శిక్షించాలి తర్ఫీదుని ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి బయట ప్రపంచంలో నిలబడేలాగా చేయాలి. అది గురు ధర్మం మరి ప్రథమ గురువుగా తల్లిని మనం చెప్పుకుంటున్నాం కదా ఉపనిషత్తులు చెప్పాయి కదా మరి ప్రథమ గురువుగా తల్లి ధర్మం కూడాను అదే కదండే తల్లి కూడా కూతురి జీవితాన్ని సిద్ధం చేయాలి. ఎక్కువ కాలం తన నీడలో ఉంచకూడదు.
(05:31) అప్పుడు ఏం జరుగుతుందంటే కూతురు అనే మొక్క ఎదగదండి వాడిపోతుంది. ఎండ తగలాల్సిందే మళ్ళీ సాయంత్రం నీడ ఎటు వస్తుంది కదా ఎటు వస్తుంది కదా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని కుటుంబాల్లో తండ్రి పాత్ర కూడాను తగ్గిపోతున్నది అన్న దాఖలాలు కూడాను ఉన్నాయండి. అది కూడా ఒక విధంగా నాకు నిజమే అని అనిపిస్తున్నది. ఇప్పుడు తల్లి కూతురి భావోద్వేగ బంధం ఎంత బలంగా ఉంటే తండ్రి యొక్క ప్రాముఖ్యత ఆ ఇంట్లో అంత తగ్గిపోతుందండి బలం బంధం బలంగా ఉండాల్సింది నిజమే కానీ ఫ్లక్సిబుల్ గా కూడా ఉండాలి కదా
(06:16) ఆ ఫ్లక్సిబిలిటీ ఏదనా ఉంది అంటే అది తండ్రి భరోసానంటే భరోసా లేని ప్రేమకు అర్థం ఉండదు. ఒక కార్మిక విషయంలోనే తండ్రి భరోసనా ఆలోచించండి ఆయన అభిప్రాయాలకు విలువ ఉండదా ఆయన ఏదనా మాట్లాడితే అట తల్లి గాని కూతురు గాని లేకపోతే ఇద్దరు గాని పట్టించుకోకుండా ఉండటం స్వభాబా ఇప్పుడు తల్లి ప్రేమ గనుక బంగారం అయితే తండ్రి భరోసా అనేది ఆ బంగారంలో కలిసే రాయి లాంటిదండి అప్పుడే అది ఆభరణంగా తయారవుతుంది ఆ ఆభరణమే కూతురండి నేను నోట్స్ రాసుకుంటూ ఉంటే నాకు ఎందుకో ఇటువంటి ఆలోచనలు కూడా వచ్చాయి అన్నమాట
(07:02) తల్లి కూతురు భావోద్వేగ బంధం స్థాయికి మించి గనుక ఉంటే చాలా కుటుంబాల్లో తండ్రి ఎదుర్కొనే మాట ఏంటంటే మీకేం తెలియదు కొంచెం మీరు ఆగండి తగ్గండి కొంచెం మాట్లాడద్దండి నేను విచారిస్తున్నాను కదా అని ఇది జరుగుతున్నదండి జరుగుతున్నది అప్పుడు తండ్రి నిర్ణయం చెప్పే వ్యక్తిగా కాదండి కేవలం ప్రేక్షకుడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది ఎలా మిగిలిపోతున్నాడు కూడాను ఇది ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థ కాదండి.
(07:39) ఈ విషయం మీద [గొంతు సవరించుకోవడం] నేను వేరే వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఆడపిల్లకు గనుక పెంకితలం ఉంటే సార్ దానికి కారణం తల్లి అదే ఆడపిల్ల గనుక బాలెన్స్డ్ గా పెరిగింది అంటే ఆ గ్రేట్ అంతా తల్లిదండ్రులకే చెందుతుంది అన్నారండి మొదట్లో కొంత కన్విన్సింగ్ గా అనిపించిన తర్వాత నేను సీరియస్ గా ఆలోచిస్తే అదంత పెద్ద [గొంతు సవరించుకోవడం] కరెక్ట్ కాదు అనిపించిందండి ఎందుకంటే తల్లి లేని ఆడపిల్లలని చూశాను అట్లాగే తండ్రి లేని ఆడపిల్లలని కూడా నేను చాలా మందిని చూశను వైవాహిక జీవితంలో వాళ్ళు చాలా ఒబ్బిడిగా కూడా ఉన్నారున్నమాట
(08:20) కాబట్టి ఈ విషయానికి మనం అంత ప్రాముఖ్యత ఇవ్వకూడదండి సరే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం ఒక ప్రశ్న వేసుకుందాంఅండి [నవ్వు] అసలు నిజమైన తల్లి ఎవరు కూతుర్ని తనకు దూరం కాకుండా చూసుకునే వ్యక్తి కాదండి తనకు దూరమైన తను దూరమైన జీవితంలో కూతురిని నిలబడేలాగా చేసే వ్యక్తి తల్లి అండి. అదే తల్లి యొక్క ఔన్నత్యం అవుతుంది. మీరు ఒకటి గమనించారా అంటే కొంచెం ఆధ్యాత్మిక టచ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నానుఅంటే భగవంతుడు కూడా మనల్ని ఎప్పుడు చిన్న పిల్లల్లాగా ఉంచలేదుగా బుద్ధిని ఇచ్చాడు వయసుని ఇచ్చాడు స్వేచ్ఛని ఇచ్చాడు కర్మను కూడా
(09:06) ఇచ్చాడు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు కదా ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మికత కూడాను విడిచిపెట్టడాన్ని ఎంకరేజ్ చేస్తుందండి భవబంధాన్ని విడిచిపెట్ట రాగద్వేషాలకు దూరంగా ఉండు అని చెప్తుంది. అంటే అసలు శిశులైన ప్రేమలో ఆధ్యాత్మికత ఉంటుందండి ఉంటుంది ఉండాలి కూడాను స్థాయికి నుంచి ప్రేమను చూపించే తల్లులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి.
(09:41) ఇంకో ఉదాహరణ ఇస్తాను పక్షిని పిడికిల్లో గనుక బేగించి ఉంచితే ఆ పిడికి బిగుసుకుంటున్న కొద్ది పక్షి చనిపోయే అవకాశం ఉంది కదండీ అదే [నవ్వు] ఉరుకుగా పట్టుకొని అలా మెల్లగా తెరిచారు అనుకోండి అది హాయిగా ఎగిరిపోతుంది దాని బతుకు అది బతుకుతుంది ఎన్ని కష్టాలు పడ్డా కూడా కానీ అరచేతిని ప్రేమతో తెరిచి గనుక ఉంచితే ఇష్టమైనప్పుడు మళ్ళీ ఆ పక్షి వచ్చి తిరిగి మీ భుజం మీదన మీ చేతి మీదన వాలుతుందండి కదా భరోసా మీరు ఇచ్చిన భరోసా అనే అది మీరు చూపించిన ప్రేమే అది అదే నిజమైన బంధం అండి అయితే నేను నోట్స్ రాసుకుంటూ ఉంటే
(10:28) బుల్లెట్ పాయింట్స్ లాగా ఇటువంటి తల్లులకి అంటే అపారమైన ప్రేమ చూపెడుతున్న తల్లులకి స్థాయికి మించి ప్రేమ చూపెడుతున్న తల్లులక అన్నమాట ఒక ఐదు పాయింట్లు ఎందుకు చెప్పకూడదు అని నెంబర్ వన్ ప్రేమను భయంగా మార్చకండి. నెంబర్ టూ కూతురును బలహీనురాలిగా కాదు సమర్ధరాలుగా మీరు తయారు చేయండి. నెంబర్ త్రీ తండ్రి మాటను లేదా భర్త మాటను సమానంగా గౌరవించండి.
(11:04) నాలుగు కూతురు యొక్క అభిప్రాయాలు వినండి. ఆమె భవిష్యత్తును మీరు నిర్ణయించలేరు నిర్ణయించుకునే అవకాశాన్ని కూడాను ఆమెక ఇవ్వండి ఎందుకంటే తల మారిపోయింది. అలాగే చివరిది ఐదవదండి సరైన సమయం వచ్చినప్పుడు నమ్మకంతో ఆమెను తన జీవిత ప్రయాణంలో ముందుకు పంపండి. ఆశీర్వదించే మరి పంపండి. చూనవ్వుతో పంపండి ఏమనా ఇబ్బంది వస్తే మేము ఉన్నాంగా అన్న భరోసాతో పంపండి.
(11:41) ఒక్కటండి తల్లి ప్రేమ [గొంతు సవరించుకోవడం] ప్రపంచంలోనే గొప్పది కదా శక్తికి అసలు స్త్రీనే కదా వేద చెప్పింది శక్తికి ప్రమాణం వచ్చేసి స్త్రీనే కదా ఆదిపరా శక్తి అన్నారు కదా సో తల్లి ప్రేమ ప్రపంచంలోనే గొప్పదండి కానీ తన దగ్గరే అమ్మాయిని ఉంచేది ప్రేమ కాదండి ఇంకో ఉదాహరణ ఇస్తా గంగా నది హిమాలయాలను వదిలి సముద్రంలోకి చేరే ముందు అది చేసే ప్రయాణాన్ని గనుక చూసినట్లయితే ఒక్కొక్కసారి మనకి బాధేస్తుంది కూడా ఎన్ని రాళ్ళను దాటుకుంటుందో ఎన్ని ముళ్ళకంపనులు దాటుకుంటుందో ఎన్ని అడ్డంకులను అధికమిస్తుందో చివరికి అది తెలుసు కదా సముద్రంలో
(12:27) వెలిసిపోతుంది. హిమాలయాలు నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు నా దగ్గరే ఉండు అని గనుక అని ఉంటే ఆ గంగాది నిజంగా మహానది అయ్యేదా చెప్పండి పుణ్యనేది అయ్యేదా చెప్పండి దీన్ని హారతులు అందుకునేదా చెప్పండి కాబట్టి నేను తల్లులకి ఒకటే చెప్తున్నానండి మీరు మీ కూతురికి నీడగా ఉండండి కానీ ఆమె ఆకాశంఅంత ఎత్తుకు ఎదిగే అవకాశాన్ని మటుకు దయచేసి తీసేయకండి.
(12:58) ఎందుకంటే మీ ప్రేమ ఆమెకి బలం కావాలి బంధనం కాకూడదు ఈరోజుక అమ్మాయి 24 ఏళ్ళ అండి రేపు 30 ఆ తర్వాత 35 వచ్చేస్తాయి కదా కాలం ఊరుకుంటుందా చెప్పండి నిశశబ్దంగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా మళ్ళీ తిరిగి రాదు కదా అసలు మీ భయం తగ్గే వరకు కాలం ఎదురు చూస్తూ ఉంటుందా చెప్పండి ఎదురు చూడదు కదా అయినా ఇంకొకటండి తల్లులుగా మీరెంత ఎంతకాలం ఉంటారు ఈ భూమి మీద ఆలోచించండి అప్పుడు అమ్మాయి ఒంటరిగా అయిపోతే ఆ ఓని తట్టుకోలేము కదండి అసలు అది చెప్తుంటే నేనే ఉద్వేగానికి గురైపోతున్నాను.
(13:42) మీ కూతురికి నిజంగా జీవిత భాగస్వామి కావాలా లేక జీవితాంతం మీకు ఆమె తోడుగా ఉండాలా ఆలోచించండి సీరియస్ గా ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ కూడా అమ్మాయి బయటికి వెళ్ళిపోతే ఎట్లా ఆర్థికంగా అని కూడా ఆలోచిస్తున్నారండి ఆలోచిస్తున్నారు. సో ఒక్క నిమిషం నాన్న గురించి కూడాను చెప్పాలండి. కాబట్టి నాన్నలకి కూడాను నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు కూడాను మౌనంగా ఉండకండి అమ్మాయి విషయం కదా ఆవిడే చూసుకుంటుంది.
(14:16) లేకపోతే ఆమె చూసుకుంటుంది అని గనక పక్కకు తప్పుకుంటే మీరు మీ బాధ్యతని వదిలేసినట్టే మీరు కేవలం సంపాదించే వ్యక్తి కాదండి సమయానికి సరిైన నిర్ణయం తీసుకునే గొప్ప వ్యక్తి కూడా మీరు నేను ఇన్ని మాటలు చెప్తున్నాను కదా వింటున్న తల్లులకి లేకపోతే తండ్రులకి లేకపోతే అమ్మాయిలకి ఒక అనుమానం రావచ్చండి ఏంటి మారుతి కిరణ గారు తల్లులని తప్పుపట్టి ప్రయత్నం చేస్తున్నారు అని చేతులు జోడించి నమస్కారం పెడుతున్నానమ్మా ఈ వీడియో ఉద్దేశం తల్లులని తప్పు పట్టడం కాదు మరేంటి ప్రేమలో ఈ భయం కలిసినప్పుడు కుటుంబ నిర్ణయాలపై అది ఎలాంటి ప్రభావం
(15:05) చూపుతుందో జస్ట్ అలా ఆలోచించండి అని ఆహ్వానం మాత్రమేనండి ఈ వీడియో ఎందుకంటే లేదండి సూటిగా నేను అమ్మకు ఒక ప్రశ్న అడుగుతున్నానండి సమాధానం మటుకు ఆ అమ్మ మనసాక్షిగా వదిలేస్తున్నాను. మీరు మీ కూతురిని ప్రేమిస్తున్నారా లేక మీ భయాన్ని ప్రేమిస్తున్నారా అలాగే మీరు మీ కూతురి జీవితాన్ని నిర్మిస్తున్నారా లేకపోతే ఆందోళనలతో ఆమె జీవితాన్ని మెలమెల్లగా అంటే భయంతో వాయిద వేస్తున్నారు.
(15:43) ఒక్కటండి పాతిక ఏళ్ళు తట్టిన మీరు అమ్మాయి ఇచ్చినది అని అనుకోవచ్చు నిజమే కానీ సమాజం ఊరుకోదుగా రేపు పొద్దన ఆ సమాజం ఎందుకు ఆలస్యం అయింది అమ్మాయి పెళ్లి అని ప్రశ్నిస్తుందిగా [నవ్వు] మరి దగ్గర వాళ్ళయతే నెలదిస్తారుగా అటువంటప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా మీకు వెళ్ళాలని అనిపించదుగా అపరాధ భావన మిమ్మల్ని తుడిచివేస్తూ ఉంటుందిగా అప్పుడు చెప్పండి నిజంగా మీ కూతురి మనసులో కలిగే బాధని మీరు పంచుకోగలరా ఒక్కటమ్మ నేను మళ్ళీ కొంచెం ఆధ్యాత్మికంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వినండి.
(16:24) మీ కూతురు ఎప్పటికీ మీ కూతురు కాదు అంటే మీ సొంతం కాదు ఒక వయసు వరకు మీరు ఆమెక సంరక్షకురాలు అంతే ఖలీల్ జిబ్రన్ కాన్సెప్ట్ చదవండి ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మొగ్గని కొమ్మకి ఎలా దారం పెట్టి కట్టేస్తే అది వికసిస్తుందో చెప్పండి వికసించదు కదా సమయం వచ్చినప్పుడు వికసించడానికి దానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే సువాసన వెదలుతూ మానవాళకి ఆనందాన్ని ఇస్తుంది అది ఇంకో సున్నితమైన విషయం చెప్తానండి చాలా సున్నితమైన విషయం ప్రేమ పేరుతో మీరు ఆమె గనుక నిజంగా జీవితాన్ని ఇవ్వకపోతే అలా ఏజ్ 35 ఏళ్ళు
(17:10) గనక దాటిపోతే అప్పుడు మీ వయసు ఎలా ఉంటుంది చెప్పండి మీరు 60 దాటిపోతారు కదా పెరిగే వయసు తరిగే ఓపిక రేపు పొద్దున ఏదైనా వ్యాధి వచ్చి మంచంలో పెడితే అమాయకంగా ఈ అమ్మాయి మీ ప్రేమలో మునిగిపోయి తడిసిపోయి ముద్ద అయిపోయి హాస్పిటల్లో మీ పక్కన కూర్చొని సేవ చేస్తుందా లేదా అటువంటప్పుడు ఉన్నట్టుండి ఆమె మనసులో ఒక చిన్న భయం మొదలైతే ఆమె మీ వైపు నిశబ్ధంగా చూసి అమ్మ నువ్వు నన్ను కాపాడావు నిజమే కానీ మరి నా జీవితాన్ని ఎందుకు మొదలు పెట్టనివ్వలేదు అని ప్రశ్నించింది అనుకోండి ఆ ప్రశ్న నిజంగా చెప్పండి మీ దగ్గర సమాధానం
(17:55) సిద్ధంగా ఉందా చెప్పండి ఒక్కటమ్మ [గొంతు సవరించుకోవడం] ఒక్కటి మీ కూతురు మీ వడిలో పుట్టింది కానీ జీవితాంతం మీ వడిలో ఉండడానికి పుట్టలేదు కదా ఆమె అంటే ఆ అమ్మాయి తన కుటుంబాన్ని నిర్మించడానికి తన ధర్మాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి మరో తరాన్ని అందివ్వడానికి పుట్టింది కదా మీరు ఇప్పుడు ఆమెకి జన్మని ఇచ్చారు కదా మీరు జీవితాన్ని కూడాను ఇవ్వండి ఇవ్వండి జీవితాన్ని కూడా ఇవ్వండి.
(18:30) నేను ఏమంటానంటే [గొంతు సవరించుకోవడం] మీ ప్రేమ మీ కూతురికి శత్రువుగా మారకూడదమ్మ ఇప్పుడు తల్లి ప్రేమతో జరుగుతున్న పెద్ద విధ్వంసం ఇదే అన్నమాట అమాయకమైన పిల్లలు అలా ఎదిగిపోతున్నారు అంతే మీ భయం గనుక గెలిస్తే మీ కోత మీ కూతురు ఊరిపోతుంది ఊడిపోతుందండి ఎందుకో కంగారులో నాకు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు నేను ఇందాక చెప్పినట్లుగా ప్రేమ పేరుతో బంధించ చద్దండి అమ్మాయిని అవసరం వచ్చినప్పుడు మేళతాడాలతో ఆశీర్వదించి పంపించండి.
(19:03) ఆశీర్వదించి పంపించండి. అసలు నిజంగా మీరందరూ ధైర్యవంతులఅమ్మా చాలా ధైర్యవంతులు ఎందుకో నేను చెప్తాను వినండి ఒక్కసారి తల్లులుగా మీరు మీ గతంలోకి వెళ్ళండి ఎన్నిసార్లు మీరు మీ భర్తలకి నేను ఉన్నాను అంటూ ధైర్యం ఇచ్చారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. పిల్లలు పరీక్షలకు చదువుతూ ఉంటే మీరు కూడాను వాళ్ళతో అర్ధరాత్రి దాటేంత వరకు కూడాను మేలుకొన్నారుగా అవసరమైతే అన్ని అందించారుగా అది చాలా ప్రేమతో చేశారుగా అమ్మాయి బాగుపడాలని చేశారు కదా క్యాంపస్ సెలెక్షన్ లో అమ్మాయికి సీట్ రావాలని చేశారుగా నేషనల్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో మెయిన్ ఎటు పాస్ అయిపోయింది
(19:48) ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి కదా అని అమ్మాయి పక్కనే అలా తారాడుతూ ఉండిపోయారుగా ఒక ఆఫీస్ ఇస్తున్నా పాల క్లాస్ ఇస్తున్నా మీకు బీపి షుగర్ లో ఉన్నా కూడా ఎంత ధైర్యవంతులమ్మా మీరు ఎంత త్యాగధానులు మీరు గుర్తులు తెచ్చుకోండి ఇప్పుడు ట్రాప్ లో రన్నింగ్ రేస్ కి అమ్మాయి గాని అబ్బాయి గాని అలా రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా చూసింది మిమ్మల్నిగా ఆ సన్నివేశంలోకి ఒకసారి వెళ్ళిపోండి మీరు [నవ్వు] [ఆశ్చర్యం] థమ్స్ అప్ చెప్పింది మీరే కదా దెబ్బ తగిలితే మందు రాసింది కూడా మీరే కదా ఫస్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా
(20:35) అమ్మాయి గాని అబ్బాయి గాని వచ్చి కావలిచ్చుకుంది మిమ్మల్నేగా అసలు మార్కులు రాకపోతే స్కూల్లో టీచర్తో యుద్ధం చేసినంత పని చేశారు కదమ్మా మీరే కదా [నవ్వు] [ఆశ్చర్యం] మరి అమ్మాయిని జీవితం అనే యుద్ధానికి ఎందుకు తయారు చేయట్లేకపోతున్నారు స్కూటర్ మీద అమ్మాయిని మరి మ్యూజిక్ క్లాస్ కి తీసుకెళ్ళారు టైకాండంకి తీసుకెళ్ళారు సంగీతానికి తీసుకెళ్ళారు ఎందుకు తీసుకెళ్ళారు ఇవన్నీ ఈ విద్యలన్నీ ఆమెలో అలాగే ఆమెతో పాటు మరణించాలనా అంతమైపోవాలనా కాదు అవన్నీ ప్రపంచానికి అమ్మాయి తెలియచెప్పాలి ఆ ఆనందంతో అమ్మాయి గర్వంగా నవ్వాలి ఆ గర్వాన్ని చూసి మీరు
(21:21) మురిసిపోవాలని కదా ఎన్ని తిప్పలు పడ్డారు పిల్లల విషయంలో కాబట్టి ఆలోచించండి మీరు తక్కువఏమి కాదు కొంచెం భయం పవలు తగ్గించండి భయం పాలు తగ్గించండి నేను ఉన్నాను అన్న భరోసాని ఇవ్వండి అయినా కూడా ఇంకొక్క మాట చెప్తానమ్మ మీ వారి సలహ తీసుకోండి తండ్రి అవసరం ఎప్పుడు కూడాను పిల్లకు ఉంటుందమ్మ ప్రతిదానికి గడి గడికి బయటికి తిరిగేది మగవాడే కదా సమాజాన్ని కుటుంబానికి కనెక్ట్ చేసేది మగవాడే కదా కాబట్టి భర్తను కూడా కొంచెం పట్టించ ంచుకోండిమ్మ చెప్పాను కదా అందరి తల్లులకి చేస్తున్న వీడియో కాదు ఇది కొంతమంది తల్లులని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వీడియో ఇది
(22:06) [నవ్వు] మనసు నొప్పించానమ్మ చేతులెత్తి మరొక్కసారి నమస్కరిస్తున్నాను క్షమించండి. ఆలోచించమని వేడుకుంటున్నాను. ఇంతేనమ్మా ఈ వీడియోలో సంగతి సో మీనందు కృతజ్ఞతలండి. నచ్చితే నా వీడియోకి మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని కొంచెం వైరల్ చేయండి. నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పూరూరి పిఆర్ యు ఆర్ YouTube లోకి వెళ్లి ఎంఆర్ టిచ్ ఐ స్పేస్ ఇచ్చి కే ఐఆర్ఏఎన్ అని గనక టైప్ చేస్తే నా YouTube ఛానల్ ఓపెన్ అవుతుంది పిఓఆర్ యుఆర్ అని ఇంటి పేరుతో చెప్పాను కదా నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా
(22:46) ఫోన్ నెంబర్ 9491063089 బెల్ ఐకాన్ లైక్ బటన్ మీరు ఎటు నొక్కుతున్నారు నొక్కుతారు కూడా కాకపోతే చిన్న అభ్యర్థన ఏంటంటే కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ని పెట్టండి. నన్ను కొంచెం ఆక్షేపించినా పర్వాలేదు నిందించినా పర్వాలేదు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఉంటానండి నమస్కారం.

No comments:

Post a Comment