*శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఒకే ఒక్కసారి మనసారా స్మరిస్తే చాలు! ఒకే ఒక్క మాటలో కీర్తిస్తే చాలు! ఒకే ఒక్క క్షణం కన్నులారా, ఆ స్వామిని దర్శిస్తే చాలు చాలు! మోక్షం సిద్దిస్తుంది. ముక్తి కలుగుతుంది. ఇంతకంటె మరో సాధనే అక్కర్లేదు. ఎలాంటి కఠిన నియమాలు అసల్లేవు.*
*కృతయుగంలో పదేండ్లపాటు, శ్రేతాయుగంలో ఒక ఏడాదిపాటు, ద్వాపరయుగంలో ఐదునెల్లపాటు కఠిన నియమాలతో సాధనలు చేసిన వారి కంటె ఈ కలియుగంలో ఒకేఒక్క క్షణం పాటు శ్రీవేంకటేశుణ్ణి దర్శించిన వారికి కోటిరేట్లు అధికంగా పుణ్యం కలుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం కాని, సంశయం కాని అవసరం లేదు. అంతేకాదు, ఎలాంటి దానధర్మాలు చేయని వాళ్లైనా, ఎలాంటి వ్రతాలు ఆచరించని వాక్లెనా, ఎలాంటి తపస్సులు, యాగాలు చేయనివాళ్లైనా సరే వేంకటేశుణ్ణి ఒకే ఒక్కక్షణం స్మరిస్తే చాలు. వాళ్ల జన్మలు ధన్యం అవుతాయి.*
ఆ స్వామి అద్భుతమైన దేవుడు! తనను శరణువేడితే చాలు. అగాథమైన సంసార సముద్రాలను నడుములోతు మాత్రమే చేస్తూ సులభంగా దాటిస్తాను - అంటూ నడుము మీది చేతో చూపిస్తుంటాడు.
శ్రీమహావిష్ణువు సాక్షాత్తుగా వైకుంఠం నుండి దిగి వచ్చి, ఈ భూలోకంలో ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు, అందువల్లే తిరుమల “భూలోక వైకుంఠం'గా ప్రసిద్ధిని పొందింది.
No comments:
Post a Comment