పరస్త్రీ వ్యామోహం మనిషిని ఎలా పతనం చేస్తుందో తెలుసా? | Chaganti Koteswara Rao
Author Name:Bhakti Vanam
Youtube Channel Url:https://www.youtube.com/@BhaktiVanamTV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=c4lBwGyGBQk
Title: పరస్త్రీ వ్యామోహం మనిషిని ఎలా పతనం చేస్తుందో తెలుసా? | Chaganti Koteswara Rao
Author Name: Bhakti Vanam
Description: పరస్త్రీని కోరుకున్నవాడి మనసు ఎంతగా దిగజారుతుందో తెలుసా?
మనిషి జీవితంలో కోరికలు, ఆకర్షణలు ఎలా ప్రభావం చూపుతాయి? పరస్త్రీపై వ్యామోహం ఎందుకు ప్రమాదకరమైన మార్గానికి దారితీయవచ్చు? ఈ విషయాలను *చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల* ద్వారా తెలుసుకుందాం.
ఈ వీడియోలో *కామం, ఆకర్షణ, మనసు, ధర్మం, నియమం మరియు మనిషి ప్రవర్తన* గురించి ఆలోచింపజేసే విషయాలను వినవచ్చు. మన పురాణాలు, ధర్మబోధలు మనకు అందించే సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రవచనం ఉపయోగపడుతుంది.
🙏 ఈ వీడియో మీకు నచ్చితే *Like 👍 | Share 🔄 | Subscribe 🔔* చేయండి.
*#chagantikoteswararao #Chaganti Gari Pravachanalu #TeluguPravachanalu #TeluguSpiritual #Dharmam #TeluguDevotional #BhaktiVanam*
Transcript:
(00:00) పరస్త్రీ సంఘము వ్యసనమైపోయిన మనసు ఎంత బరితిగించేస్తుంది అంటే ధర్మమునకు కామము ముడిపడాలి ఆకర్షణ నిలబడాలి అందుకొరకు ఆకర్షణ అన్నది లోకంలో భగవంతుడు సృజించాడు ఈ ఆకర్షణ ధర్మబద్ధమై పరిమితం అవ్వాలి అంతేకాని ఇది విశృంఖలత్వాన్ని పొందింది అనుకోండి ఎవరి మనసుని వాళ్ళు పరిశీలించుకోవాలి నా ఆకర్షణ ఎక్కడికి పరిమితము కావాలి నా ధర్మపత్ని వరకు అది దాటి ఆకర్షణ పొందకూడదు అసలు స్త్రీ పురుషుడు అనబడేటటువంటివి రెండు కూడా సప్తధాతువులతో నిర్మాణమైనటువంటి శరీరములే ఒక శరీరమునందు కొత్తగా ఒక ధాతువు ఉండదు ఒక శరీరమునందు ఈ ధాతువు లేదని
(00:48) చెప్పడానికి లేదు ఎందుచేత అంటే రెండు శరీరములు కూడా రక్తము మాంసము కొవ్వు అస్తి శుక్ల మేధ అనబడేటటువంటి ధాతువుల చేతే నిర్మాణం అవుతాయి కానీ భగవంతుడు సృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఒక గొప్ప సమస్య ఎదురైింది. మొట్టమొదట మానస పుత్రులను సృజించాడు బ్రహ్మగారు వాళ్ళందరూ ఏం చేశారు అంటే మేము ఈ సంసారము నందు పరిభ్రమించడానికి ఇష్టపడము మేము అందరం తపస్సు చేసి పరమేశ్వరుని చేరుకుంటాం అని వైరాగ్యాన్ని పొందారు అలా కాదు ప్రజోత్పత్తి జరగాలి జీవుల యొక్క సంఖ్య పెరగాలి అంటే ఏం జరగాలి అని బ్రహ్మగారు పరమేశ్వరుని ఉద్దేశించి ప్రార్థన చేశాడు
(01:36) చేసినప్పుడు భగవంతుడు ఏం చేసాడంటే అంటే తన శరీరంలో రెండిటిని ఉత్పన్నం చేశాడు సగం స్త్రీ శరీరం సగం పురుష శరీరం అప్పుడే అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. ఈ స్త్రీ పురుష శరీరములు రెండిటిని సృజించి ఒండుల యందు ఆకర్షణ కల్పించాడు. స్త్రీ యందు పురుషునకు పురుషునకు స్త్రీ యందు ఆకర్షణ ఈ ఆకర్షణ కల్పించడానికి ఒక ప్రధానమైన కారణం ఉన్నది.
(02:08) ఏమిటి ఆ కారణం అంటే ఈ ఆకర్షణ ఉన్న కారణం చేత తేజోవంతమైనటువంటి సంతానము లభిస్తుంది అందుకే మీరు శ్రీరామాయణంలో బాలకాండలో షణ్ముఖోత్పత్తిలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. శివుని యొక్క తేజస్సుని గంగ భరించవలసి వచ్చింది. భరించవలసి వస్తే ప్రహృష్టమైనటువంటి మనస్సుతో సంతోషంగా దాన్ని స్వీకరించాలి. అందుకే అగ్నిహోత్రుడి దగ్గర ఉన్నటువంటి శివతేజస్సుని గంగ యందు ప్రవేశపెట్టవలసి వస్తే మిగిలిన దేవతలు వెళ్ళలేదు ఒక్క అగ్నిహోత్రుని మాత్రమే పంపించి నువ్వు ప్రహృష్టమైన మనసుతో పరమ సంతోషంతో దీన్ని స్వీకరించు ఎందుచేత అంటే ఉండర్ల యందు
(02:55) ప్రీతి లేకపోయినా ఆ ఆకర్షణ లేకపోయినా ఆ సంతోషము లేకపోయినా దాని వలన తేజోవంతమైన సంతానము కలగదు అందుకే మీరు చూసి ఉంటారు వివాహం చేసేటప్పుడు మంగళ సూత్రం కట్టిస్తారు ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు కాడి తీసుకొచ్చి ఆ కాడి వధువు యొక్క మెడ మీద ఉంచుతారు ఉంచి మంత్రపూరితమైనటువంటి నీటిని కాడి కన్నంలోనుంచి విడిచిపెడతారు హరదత్తాచార్యుల వారిని ఆయన దానికి వ్యాఖ్యానం చేశారు అత్రి మహర్షి యొక్క కుమార్తెే వివాహం కాలేదు కాబట్టి అపాల పాలించువాడు లేడు కాబట్టి అపాల అని పిలువబడింది కారణం ఏమిటంటే ఆవిడకి ఒళ్ళంతా బొల్లి వ్యాధి వచ్చింది. అందువల్ల ఎవ్వరు
(03:39) ఆమెని వివాహం చేసుకోలేదు. ఆమెకి ఒకనాడు తీవ్రమైనటువంటి వ్యగ్రత కలిగి బాధ కలిగి నేను ఇంకా ఇలా జీవించను శరీరం విడిచిపెట్టేస్తానని నీటిలో పడి కొట్టుకుపోతుంది మళ్ళీ అదొక ధర్మ సూక్ష్మం అలా నీళ్ళలో పడడం అలా కొట్టుకుపోవడం అలా శరీరాన్ని విడిచిపెట్టడం దాని గురించి ఇప్పుడు నేను స్పృషించను ఆమె నీళ్ళలో పడి కొట్టుకుపోతుంది.
(04:02) ఇక ఎటూ మరణిస్తాను అనుకోండి ఇంతలో అనుకోకుండా ఆమెకి సోమలత లభించింది ఏదో కొట్టుకుపోతుంటే నీళ్ళల్లో సోమలత దొరికింది సోమలత దొరికితే యజ్ఞం చేస్తారు ఆమె ఆ సోమలత దొరికింది నీళ్లలో కొట్టుకుపోతుంది కాబట్టి ఇంద్రుని ఉద్దేశించి కొన్ని మంత్రాలు చెప్పి నోటితో నవిలి ఆ సోమలతని పిండింది. ఇది నేను ఇంద్రుని యొక్క రథ చక్రపు కాడి మీద పిండుతున్నాను అని భావన వచ్చేటటువంటి మంత్రములు చెప్పి దీని చేత ఇంద్రుడు తృప్తి పొందుగాక నీళ్ళల్లో కొట్టుకుపోతూ సోమలత దొరికితే నన్ను ఉద్దేశించి యజ్ఞ మంత్రములు చెప్పింది నాకు సోమలత రసాన్ని అర్పణ చేసింది కాబట్టి ఈమెకి నేను మంచి భర్తని
(04:45) ఇస్తానని ఆమె బొల్లి వ్యాధి పోగొట్టి ఆమెకు మంచి భర్తని ఇచ్చి ఆమె సంతోషంగా జీవితం గడపడానికి కి కావలసిన వ్యవస్థని ఇంద్రుడు చేశాడు. అప్పటినుంచి ఆడపిల్ల మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఈ మంత్రములతో కాడిలోంచి నీళ్లుు పోస్తారు మెడమీద ఎందుకు పోస్తారు అంటే భర్త యొక్క ఆకర్షణ భార్య యందు చెక్కు చెదరకూడదు భార్య యొక్క ఆకర్షణ భర్త యందు చెక్కు చెదరకూడదు.
(05:17) కామ సంబంధమైన ఆకర్షణ భర్తది భార్యకి మాత్రమే పరిమితము కావాలి భార్యది భర్త వరకు మాత్రమే పరిమితము కావాలి అప్పుడు కామము ధర్మము చేత ముడిపడిపోతుంది కామము ధర్మము చేత ముడిపడితే ధర్మ సంబంధమైన అర్థము ప్రభవిస్తుంది అర్థం అంటే డబ్బు అని కాదు అర్థం అర్థము అంటే భోగోపకరణం మనిషి సంతోషంగా జీవితం గడపడ డానికి కావలసినటువంటి భోగ సంపత్తికి అర్థము అని పేరు ఇప్పుడు గాలియడానికి అక్కడ ఒక పరికర ఉందనుకోండి దాన్ని అర్థము అంటారు.
(05:56) నేను ఇంతమందికి వినపడేటట్టు బిగ్గరగా మాట్లాడవలసిన అవసరం లేకుండా మెల్లిగా మాట్లాడిన అది అందరికీ వినపడేటట్టుగా శబ్దం యొక్క స్థాయిని పెంచి వినిపించేటట్టుగా చేయగలిగినటువంటి ఈ పరికరం నా వరకు నాకు సుఖపెడుతుంది కాబట్టి భోగోపకరణం కాబట్టి ఇది నాకు అర్థం అవుతుంది. మనిషికి కామము ధర్మము చేత ముడి పడితే అర్థము ప్రభవిస్తుంది.
(06:24) ఏమిటి ఆ అర్థం కూతురు కొడుకు ఇద్దరు పుడతారు పుడితే కూతురు పుట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే దశపూర్వేషాం దశాపరేషాం ఆమెని కన్యాదానం చేసినప్పుడు 21 తరములు తరిస్తాయి తాను తనతో కలిపి తన ముందు పది తరాలు తన వెనక పది తరాలు తాను 21 తరాలు ధరిస్తున్నాయి. ఇప్పుడు ఇంతమంది తరించడానికి సాధనమైన ఆడపిల్ల పుడుతోంది. ఇక తన తర్వాత తన వంశం పేరు చెప్పి గోత్రం పేరు చెప్పి ఇంటి పేరుతో పూజా మందిరంలో పూజ చేయడానికి శరీర పతనానంతరమ జరగవలసిన కార్యం చూడడానికి కుమారుడు ప్రభవిస్తున్నాడు.
(07:06) ఈ అర్థము దేని వలన ప్రభవిస్తోంది అంటే సంతానము కలగడం వల్ల ఈ సంతానము ఏ క్షేత్రమునందు పడితే ఆ క్షేత్రమునందు ఉత్పాదనము చేసేది కాదు అది ధర్మబద్ధమై ఉండాలి కామము ధర్మము చేత ముడిపడితే లభించేటటువంటి అర్థం ఏది ఉన్నదో అది ఉద్ధరణకు హేతువు అవుతుంది. ఉదాహరణకు కొడుకు లేడునుకోండి వచ్చిన నష్టం లేదు కూతురు కడుపున కొడుకు పుడితే కొడుకు పుట్టినట్టే కాబట్టి ఏమవుతుంది అంటే ధర్మమునకు కామము ముడిపడాలి ఆకర్షణ నిలబడాలి అందుకొరకు ఆకర్షణ అన్నది లోకంలో భగవంతుడు సృజించాడు ఈ ఆకర్షణ ధర్మబద్ధమై పరిమితం అవ్వాలి అంతేకానీ ఇది
(07:49) విశృంఖలత్వాన్ని పొందింది అనుకోండి ఎవరి మనసుని వాళ్ళు పరిశీలించుకోవాలి నా ఆకర్షణ ఎక్కడికి పరిమితము కావాలి నా ధర్మపత్ని వరకు అది దాటి ఆకర్షణ పొందకూడదు అలా పొందితే ప్రమాదము వైపుకి వెళ్ళిపోతున్నానని గుర్తు అది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం అందుకే ధర్మము గాడి తప్పిపోతే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందిఅంటే అది భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.
(08:22) అలా ఫలితాన్ని ఇవ్వాలనుకోండి శరీరం ఉండాలి కదా దాన్ని అనుభవించడానికి ఒక గొప్ప దుఃఖాన్ని అనుభవించాలనుకోండి శరీరం ఉండాలి కదా శరీరం ఉంటే కదా దుఃఖాన్ని అనుభవిస్తారు కానీ స్త్రీ విషయంలో ధర్మపత్నిని కామమునందు అతిక్రమించాడు అనుకోండి దాని వలన ఏమవుతుందంటే మూలఘాతి ఏ శరీరము దానికి ఉపయోగించాడో ఆ శరీరము పతనమైపోతుంది ఆయుర్దాయము నిలబడదు నిలబడకుండా అర్ధాంతరంగా శరీరాన్ని వదిలి పెట్టేస్తాడు.
(08:56) ప్రమాదం ఏర్పడి శరీరము పతనం అవుతుంది అందుకే పరస్త్రీ సంఘ దోషేన భవో మరణంగతాః పరస్త్రీ సంఘము చేత ఎందరో తమ శరీరములను పతనం చేసుకున్నారు ఆయుర్దాయాన్ని కోల్పోయారు అందుకే అటువంటి ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళవద్దు అది చెప్పడం కోసమే వెలది మొట్టమొదటి వ్యసనంగా చెప్పారు అయితే ఇక్కడ ఇక్కడ స్త్రీ అని అన్వయం చేసి అన్ని వేళల దోషం ఆపాదించకూడదు ఎందుకు ఆపాదించకూడదు అంటే ఆమె ధర్మబద్ధమైన పత్నీ స్థానంలో ఉందనుకోండి ఆమె గొప్ప ఉద్ధరణ హేతువు మీకు నేను ఎన్నో మాటలు చెప్పా గృహిణి గృహముచ్యతే అసలు ఆమె లేనినాడు ఇల్లన్న
(09:41) మాటకు అర్థమే లేదు ఆమె లేనినాడు పురుషుడు పుణ్యం చేసుకోలేడు ఆమె లేనినాడు ఇహమునందు ఏమి సంతోషం లేదు అందుకే మాతా సమన్నాస్తి శరీర పోషణం భార్యా సమన్నాస్తి శరీర తోషణం భార్యల అసలు శరీరమునకు సంతోషమును ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు అందుకే అది ధర్మబద్ధమైననాడు దోషం లేదు అది ధర్మమన్న గీత దాటిపోతే ఆకర్షణ అన్యుల యందు పొందితే అది ప్రమాద హేతు అప్పుడు అది అక్కడతో ఆగదు శరీరాన్ని పడగొట్టేస్తుంది అందుకే శ్రీరామాయణం సుందరకాండ లో హనుమ రావణాసురుడి దగ్గరికి వెళ్లి రాయభారం
(10:26) చెప్తున్నప్పుడు ఒక మాట అంటారు తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశనః ప్రాప్తం ధర్మఫలం తావద్భవత మాత్రసంశయః అంటారు నువ్వు చేసిన ధర్మం ఏదిఉందో నువ్వు చేసిన పుణ్యం ఏదిఉందో అది ఫలితాన్ని ఇచ్చింది నువ్వు చేసిన అధర్మం ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేసింది నువ్వు చేసిన అధర్మం ఏమిటి పరస్త్రీని అపహరించి తీసుకొచ్చావు ఆమె వంక చూడకూడని చూపు చూస్తున్నావు ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు ఆమె యందు పొందకూడని భావన పొందుతున్నావు చిట్టచివరికి దీని వలన ఫలితం ఏమి మూలఘాతి ఇది నీ శరీరాన్ని పతనం చేసేస్తుంది నీ శరీరము నిలబడదు అందుకే వ్యసనం గురించి చెప్పడం వేరు కానీ ఆ
(11:14) వ్యసనాం యొక్క వ్యగ్రతని తెలుసుకోకపోతే అది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోకపోవెళ్పో పోతుందో తెలుసుకోకపోతే ఎంత గొప్ప వ్యక్తి జీవితం కానివ్వండి దాని వలన ఫలితం ఉండదు మీరు భాగవతంలో అజామీలోపాఖ్యానం చూసి ఉంటారు ఆయన పేరు అజామీలుడు అని పెట్టారు అజామీలుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అజ్ఞానము చేత మేలనమును పొందినవాడు దానితో అంటకాగినవాడు అని అర్థం అజామీయులుడు అంటే అజామీయులుడు మొట్టమొదటి నుంచి కూడా పుట్టుక నుంచో బ్రహ్మచారిగా గా ఉండగానో యవ్వనంలో ఉండగానో పరస్త్రీ వ్యసనము కలిగినటువంటి వాడు కాడు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే భాగవతంలో
(12:00) అజామీలుడు గురించి ఒక కొన్ని విశేషాలు చెప్పారు ఆయన చాలా మంచి శీల వైభవం ఉన్నవాడు కావున ఇతడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు అనయంబు గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు సర్వభూతములకు సమబుద్ధియై చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు సత్య భాషణ నియమంబు జరిపినాడు నిత్య నైమిత్తికాదుల నెరపినాడు దండి లోభాది గుణముల దరసినాడు మంచి గుణములు తనయందు అరసినాడు అజామీరుడు ప్రారంభంలో అంత గొప్ప శీల వైభవం ఉన్నవాడు ఆయన ఎంతో పుణ్యం
(12:49) చేసినవాడు కాబట్టి వేదాధ్యయనమునకు యోగ్యమైనటువంటి వర్ణమునందు జన్మించాడు దాంతి శాంతి రెండిటిని పొందినవాడు అపారమైన ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలిగినటువంటివాడు ధర్మమునందు అనురక్తి కలిగినటువంటివాడు అన్ని వేదములు చదువుకున్నవాడు ప్రయత్న పూర్వకంగా గురువుగారి దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్లి శుశ్రూష చేసేటటువంటి లక్షణము కలిగినటువంటివాడు అంతేకాదు అన్ని భూతముల యందు సమానమైనటువంటి బుద్ధిని పొందినవాడు ప్రహ్లాదుడి గురించి చెప్తూ భాగవతంలో తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున మరగువాడు అంటారు అన్ని భూతముల యందు సమానమైనటువంటి భావన
(13:33) అన్నిటి యందు దైవమ ఉన్నది అన్న భావన పొందినటువంటివాడు పైగా అనేకమైనటువంటి మంత్రములను ఉపదేశం పొంది నియతి కాలమునందు వాటిని జపం చేస్తూ ఆయా మంత్రముల యొక్క అధిష్టాన దేవతల దర్శనాన్ని పొంది వాళ్ళ యొక్క అనుగ్రహమునకుపా పాత్రుడైనటువంటివాడు సత్యభాషణ నియమంబు జరిపినాడు ఎన్నడూ అబద్ధం ఆడకుండా సత్యమును మాత్రమే మాట్లాడేవాడు నిత్య నైమిత్తికాదుల నెరపినాడు ప్రతిరోజు చేయవలసినటువంటి సంధ్యావందనాది కార్యక్రమములను ఏమరపాటు లేకుండా చేసేవాడు అప్పుడప్పుడు వచ్చేటటువంటి ప్రధానమైన తిథులు కృష్ణాష్టమి భీష్మాష్టమి ఇటువంటి తిధులలో ఏవేవి చేయాలని ఋషుల చేత
(14:16) చెప్పబడినదో ఆయా కార్యక్రమములను ఏవై వైక్లభ్యం లేకుండా నిర్వహించినటువంటి వాడు లోభము మొదలైనటువంటి భయంకరమైన గుణములను దాటినటువంటివాడు మంచి గుణములన్నిటికీ కూడా నిధిగా జీవించినటువంటివాడు అంటే ప్రారంభంలో అజామీలుడు తప్పు జీవనం ఉన్నవాడు కాడు ఆయనకి వివాహం చేసిన తర్వాత భార్యతో ఎంతో చక్కటి జీవితం చేసినటువంటివాడు తల్లిదండ్రుల యొక్క మన్ననని సంతోషాన్ని పొంది జీవించేటట్టుగా బ్రతికినటువంటి వాడు తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చినవాడు ఇటువంటివాడు ఒకనాడు చూడకూడని ఒక విషయాన్ని చూశాడు ఎవరో మధ్యపానానికి కూడా అలవాటు పడిపోయినటువంటి
(15:05) ఒక స్త్రీ పరపురుషుడితో రమిస్తున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు ఇంత చదువు చదువుకున్నవాడి చదువు పెద్ద దూది పర్వతంలో నిప్పు నెరుసుపడి కాలిపోయినట్టుగా గా దగ్ధం అయిపోయింది అంతే జారిపోయాడు ఒకటో మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి పర్వాలేదుపోవ మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి పర్వాలేదు వెయ్యో మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి బ్రతుకుతాడని నమ్మకం ఉండదు వెయ్యో మెట్టు మీదకి ఎక్కడం అంటే ఎన్నో గుణములను పొందిన తరువాత ఇటువంటి వ్యసనము కానీ కలిగింది అనుకోండి వాడి జీవితము చాలా భయంకరంగా పరిసమాప్తమైపోతుంది
(15:48) ఇక ఆయన పొందిన సుగుణములను గురించి కానీ ఆయన కీర్తిని గురించి కానీ ఆయన జీవితంలో కష్టపడి సాధించినటువంటి విశేషాలని కానీ ఇక ఎవ్వరు స్పృశించరు ఆయన నశించిపోయిన తర్వాత అపకీర్తి ఒక్కటే మిగిలిపోతుంది. మీరు ఒక్కటి గమనించండి రావణాసురుడు మరణిస్తే కేవలం రావణుడు మరణించాడు అనుకుంటారు చాలామంది కాదు రావణుని చంపినప్పుడు మూడు రకములైనటువంటి హత్యలు జరిగాయి ఒకటి వీరహత్య అంటారు రెండవ దాన్ని ఛాయాహత్య అంటారు మూడవ దాన్ని సుగుణ హత్య అంటారు ఆయన మహావీరుడు లోకోత్తర వీరుడు అన్ని అస్త్రములు తెలిసి ఉన్నవాడు
(16:36) అన్ని అస్త్రములు తెలిసిఉన్నవాడు అంటే అన్ని మంత్రాలని నియమంగా జపం చేసి తన యందే ఆవాహన చేసుకున్నవాడు ఆయనతో పాటే అన్ని మంత్రముల యొక్క దేవతలు కూడా వినిర్ముక్తమైపోతారు కాబట్టి అది వీరహత్య ఛాయాహత్య ఛాయాహత్య అంటే ఏమిటో తెలుసా కేవలం పరాక్రమం కాదు అనేకమైనటువంటి లలిత కళలలో గొప్ప సాధన చేసి ఉత్తీర్ణుడైనవాడు ఆయన చాలా బాగా గా వీణవాయిస్తాడు ఆయనకి సామవేదం తెలుసు గొప్ప గానం చేస్తాడు ఆయనకి పూజ తెలుసు అలంకారం తెలుసు ఏ ఏ తిధులలో ఏవి చేయాలో తెలుసు అన్నిటిని మించి చతుష్యశుపచారములు
(17:19) చేయగలడం 64 ఉపచారములు మీరు చదివితే భగవతికి కోట నిర్మాణం కూడా ఉంది. అవేం సామాన్యమైన ఉపచారాలు కావు అటువంటి ఉపచారములు చేయగలడు ఇన్ని చేయగలిగిన వాడి కీర్తి ఏదైనా మిగిలిందా లోకంలో రావణాసురుడిలా వీణవాయిస్తాడండి అభినవ రామణ అన్న బిరుదుతో సత్కరిస్తున్నాం అని ఎవరికైనా బిరుది ఇస్తారా ఇస్తే పుచ్చుకుంటారా పుచ్చుకోరు ఆయనకి తెలియదా ఆయనకి ఆ కళ లేదని మీరు అనుకుంటున్నారా ఉన్నది కానీ ఆయనకి ఎన్ని కళలు ఉన్నా ఆయన ఒక మహా పతివ్రత యందు పొందకూడని భావన పొందడంలో ఆయన మరణించినప్పుడు ఆయనతో పాటే ఈ ఉత్తమమైనటువంటి సంస్కృతి కూడా మరుగున
(18:04) పడిపోయింది. అది ఛాయాహత్య అంటారు ఎంతటి వాడికి కొన్ని సుగుణములు ఉంటాయి మహర్షి అందుకే రామాయణ కావ్యం చేసేటప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడతారు. మీరు రావణాసురుడు నిద్ర లేచిన సమయాన్ని గమనించండి ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచాడు. అంటే ఏ కాలమునందు సరస్వతీ కటాక్షము కాలాంతర్గతముగా ప్రవాహ రూపంలో ఉంటుందో ఆ కాలమునందు నిద్ర లేచేటటువంటి అలవాటు ఉన్నవాడు అసలు అందరూ అలా నిద్ర లేవరు ఎప్పుడో సూర్యోదయం అయిపోయిన తర్వాత లేస్తారు కృతజ్ఞయదేవాయజ్యోతిషంపతయే నమః సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర లేచినవాడు కృతజ్ఞనుడు
(18:49) కాబట్టి ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచే అలవాటు ఉన్నవాడు కానీ అవి ఏవైనా నిలబడ్డాయా ఒక్క రావణ హత్య చేస్తే రావణ హత్య వెనక ఈ హత్యలు కూడా జరిగాయి అందుకే ఇవి దోషములయ్యాయి ఎందుకని అంటే లోకమునందు ప్రకాశించకుండా పోయాయి ఇవి పోగొట్టుకోవడానికే రామచంద్రమూర్తి అన్ని శివలింగ ప్రతిష్టలు చేశాడు అది కారణం అంటే పరస్త్రీ సంఘ దోషేన భవో మరణంగతాః పరస్త్రీ సంఘ దోషము వలన మనిషి యందు ఎన్ని సుగుణములు ఉన్నప్పటికీ కూడా అవి రాణించవు సర్వభ్రష్టం అయపోతాడు అసలు ఇవ్వాళ మనందరం తిరుపతి తిరుపతి అని చెప్పి వెంపర్లాడి ఆ కొండ ఎక్కుతాం ఆ కొండ
(19:35) యొక్క వైభవాన్ని కలియుగంలో ప్రకాశింపచేసినటువంటివాడు మాధవుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు ఆయన కూడా అజామీలుడు లాగే బాగా చదువుకున్నవాడు ఆయన కూడా అజామీలుడు లాగే మంచి గుణములు కలిగినవాడు అటువంటివాడు ఒకప్పుడు అప్పుడు కాలు జారిపోయింది అన్యకాంత యందు ఆకర్షితుడుఅయ్యాడు ఆకర్ష ఆకర్షితుడు అయినప్పుడు అదో విచిత్రం ఆవిడ ధర్మం చెప్పింది ఆమె నిజానికి చదువుకున్నది కాదు ఆమె కూడా ఇలాగే కళ్ళు తాగుతున్నది ఆమె కూడా గోమాంసమును తింటున్నది ఆమె దగ్గరికి వెళ్లి ఆమె పొందు అపేక్షించాడు ఆమె అంది నువ్వు ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించావు ఇది విదుర్బుద్ధి
(20:22) తప్పు నువ్వు ఇటువంటి పనులు చేయకూడదు అని చెప్పింది ఆయన పాండిత్యం ఎందుకు పనికివచ్చింది అంటే భ్రష్టత్వానికి వచ్చేటప్పటికి ఏ స్థాయికి వెడతాడో చూడండి ఉప్పు నీటిలో ముత్యం ఉంటుంది అయినంత మాత్రం చేత ఉప్పుటిలో ఉప్పు నీటిలో పుట్టిందని ముత్యాన్ని విసిరేస్తారా రత్నములు దొరుకుతాయి సముద్రమునందు నీటిలో దొరికింది ఉప్పు నీటిలోని అవతల పారేస్తారా నువ్వు ఎటువంటి దానివైతేనే గొప్ప అందగత్తవి అని ఆమె పొందుని అపేక్షిస్తే ఆమె తజే యజ్ఞోపవీతంతే ముండయత్వా శిరస్తధా నువ్వు బ్రాహ్మణుడివి కదా నీ యజ్ఞోపవీతం
(21:10) తీసి అవతల పారేయ్ నీ శిఖని తీసేసేయ్ తీసేసి భక్ష గోమాంసం ఉత్తమం ఆవుని చంపేసి గోమాంసం తినం కనీసం అప్పుడు అప్పుడు భయపడతారుని పరస్త్రీ సంఘము వ్యసనమైపోయిన మనసు ఎంతకి బరితిగించేస్తుంది అంటే ఆయన యజ్ఞోపవీతాన్ని తీసి విసిరేసాడు. శిఖ ఆ పిలక ముడి వేసుకున్నటువంటి పిలకని తీసేసాడు గోమాంసాన్ని తినేసాడు. ఆమె యందు అనురక్తిని పొంది సుఖించాడు కొంతకాలమునకు ఆమె మరణించింది.
(21:46) ఆయన కొంతమంది రాజులు తిరుపతి యాత్రకు వెళుతుంటే వాళ్ళతో పాటుగా వెంకటాచలం యాత్రకు వెళ్ళాడు కపిలతీర్థం దగ్గరికి వచ్చి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ తండ్రులను గుర్తు తెచ్చుకొని తద్దినం పెడుతున్నారు వెళ్ళిపోయినటువంటి వాళ్ళయితే శరీరం వదిలిపెట్టేసిన వాళ్ళయితే తనకి తన తండ్రి గుర్తొచ్చాడు తల్లి గుర్తొచ్చింది బాధపడి తనకవచ్చిన మంత్రములతో తన దగ్గర ఉన్నది ఆ రోజున మట్టి కాబట్టి మట్టి ముద్దలతో తద్దినం పెట్టాడు వాళ్ళతో కలిసి కొండఎక్కుతున్నాడు ఎక్కలేకపోయాడు ఎక్కలేక నీరసపడి ఖేదపడితే ఆయనలో ఉన్నటువంటి పాపం అంతా కూడా వాంతి రూపంలో కక్కాడు. అక్కడ ఉన్న శీలలన్నీ కూడా
(22:29) ధ్యాననిష్టలో ఉన్న యోగులు అబ్బా ఎంత పాపం రా అని వాళ్ళు ముక్కులు మూసుకొని యధారూపాలు ధరించి పైకి లేచిపోయారు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఒరేయ్ నీ అదృష్టం రా ఇన్ని పాపములు చేసినా ఈ కొండ మీదకు వచ్చావు ఈ కొండ మీదకి వచ్చిన కారణం చేత నీ పాపములు కాలిపోయి వాంతి రూపంలో బయటపడిపోయాయి వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచల తేవనామదేవస్తధాజగుహు ఈ కొండకు వెంకటాచలం అని పేరు ఎందుకు వచ్చిందిఅంటే పాపములను కాల్చేస్తుంది.
(23:03) పరస్త్రీ సంఘ దోషము చేత ఇంత భయంకర పాపమును పొందావు ఆ పాపాన్ని కొండ కాల్చేసింది వెళ్లి పుష్కరిని స్నానం చేయి వచ్చే జన్మలో ఆకాశరాజువై పుట్టి నీ కుమార్తె అయినటువంటి పద్మావతి దేవిని వెంకటేశ్వరుడికి ఇచ్చి వివాహం చేసి వెంకటేశ్వరుడికి మామగారివై తరిస్తా ఉన్నాడు. అది వెంకటాచలం యొక్క మహాత్యము అని మనకి భవిష్యోత్తర పురాణం చెప్తోంది.
(23:30) కాబట్టి పరస్త్రీ సంఘ దోషము చేత ఏ స్థాయికి జారిపోయాడు మాధవుడు అందుకే వ్యసనములలో మొట్టమొదటి వ్యసనముగా ఏం చెప్తారు అంటే ధర్మమ అనేటటువంటి గీతను దాటవద్దు స్త్రీ విషయంలో సరే ఏవండీ ఈ నీతి చెప్పడం మంచిదే తప్పకుండా చెప్పవలసిందే నీతి చెప్పి ఆగదు సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం దానికి మార్గం ఏమి చెప్తుంది ఏ మార్గము చేత నువ్వు మనసుని అలా నియంత్రించగలవు అంటే మాతృవత్ పరదారేషు పరస్త్రీ వంక చూసినప్పుడు మాతృభావన మనసులో పొందు నా తల్లి నన్ను కన్నా అమ్మ నన్ను కన్నా అమ్మ వయసు ఇలా ఉండదు అని మనసులో
(24:17) బుకాయింపు వచ్చిందా నువ్వు ప్రతిరోజు పూజ చేస్తావు కదు ఎవరో ఒక అమ్మవారిని పూజిస్తావు కదు కంచి కామాక్షినో మధుర మీనాక్షినో కాశి విశాలాక్షినో గాయత్రినో పార్వతినో లక్ష్మినో సరస్వతినో శారదనో ఎవరో ఒకరిని పూజ చేస్తావు కదు నేను పూజ చేసేటటువంటి అమ్మవారు కరచరణాదులతో కదిలి వస్తే ఇదిగో ఇలా ఉంటుంది సహస్ర శీర్షవదన ఇన్ని ముఖాలతో మా అమ్మవారు వచ్చి కూర్చుంటే ఇలా కూర్చుంటుంటుంది ఎంత అదృష్టం ఆవిడకి నా మీద ఎంత ప్రేమ అంటే రోజు నన్ను పీఠం మీద కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చుని పూచేస్తావ్ ప్రతిరోజు సాయంకాలం నిన్ను నిన్ను పీఠం మీద కూర్చోబెట్టి ఎత్తైన
(24:59) వేదిక మీద కూర్చోబెట్టి నేను అనేక ముఖాలతో కింద కూర్చుని వింటున్నట్టుగా కనపడుతూ నీకు దర్శనం ఇస్తాను [ప్రశంస] ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ నేను ఏ కామాక్షికి నమస్కారం చేస్తానో ఆ పరదేవతే ఇన్ని ముఖాలతో నాకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఎంత అదృష్టవంతుడిని నేను అన్న భావన పొందాను అనుకోండి అప్రయత్నంగా నేను మాట్లాడేటప్పుడు అమ్మ నిన్న రాలేదే అని అడుగుతాను అమ్మ అన్న అన్న పలకరింపు వచ్చేస్తుంది ఆ మాతృవత్ పరదారేషు ఆ మాతృభావన చేయగానే పాదముల వంక చూడడంలో ఉన్న అనురక్తి నీకు ఏ తేజస్సు కనపడి ఆకర్షణకి కారణమైందో అది పరదేవత యొక్క తేజస్సుగా
(25:43) మారుతుంది మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు అది పరదేవత యొక్క తేజస్సుగా నీకు కనపడగానే పాల మీద నీళ్లే తప్ప పాలు పొంగించగలిగిన అగ్ని మాత్రం అది కాదు అప్పుడు నువ్వు ధర్మాతిక్రమణం చేయవు నీ మనసులో వ్యసనం ఏర్పడదు నువ్వు ధర్మమునకు కట్టుబడిపోయి జీవితాన్ని ఉద్ధరణ పదంలో సాగించగలుగుతావు అందుకే ఈ వ్యసనమునకు దూరంగా ఉండు చాలా జాగ్రత్త సుమా ఆకర్షణ అన్నది పరమేశ్వరుడు ఎందుకు పెట్టాడో ఆలోచించి అక్కడ వరకు మాత్రమే పరిమితం అవ్వడం జీవితంలో నేర్చుకో అని మనకి బోధ చేయడం కోసం విదు ఇదురుడు మహానుభావుడు కనుక అయ్యో జాతి భ్రష్టము కాకూడదని
(26:31) ధృతరాష్ట్రుని అడ్డుపెట్టి ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా దేశకాలములతో సంబంధం లేకుండా సమస్త లోకమునకు కూడా వ్యసనములను గురించి మాట్లాడేటప్పుడు ముందు వెలదిని తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఏ వ్యసనము మూలఘాతి అవుతుందో శరీరాన్నే పడగొట్టేస్తుందో అది ప్రమాదకరము కనుక ఆ వ్యసనంతో మొదలుపెట్టి మాట్లాడడం ప్రారంభం చేశాడు కాబట్టి వెలది

No comments:
Post a Comment