Wednesday, September 23, 2026

ఒక కొండ చుట్టూ తిరిగితే పుణ్యం వొచ్చేస్తదా? || RAMANA MAHARSHI

ఒక కొండ చుట్టూ తిరిగితే పుణ్యం వొచ్చేస్తదా? || RAMANA MAHARSHI

Author Name:PRATIKULA VEDAM

Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-iD-ruTv3fY





Title: ఒక కొండ చుట్టూ తిరిగితే పుణ్యం వొచ్చేస్తదా? || RAMANA MAHARSHI

Author Name: PRATIKULA VEDAM

Description: అరుణాచల గిరి ప్రదక్షిణ వెనుక ఉన్న అసలైన అంతరార్థం ఏమిటి? 14 కిలోమీటర్లు భౌతికంగా నడవడమే ఆధ్యాత్మికతా లేక మన లోపల ఉన్న అహంకారాన్ని కరిగించడమా? రమణ మహర్షి బోధించిన నిజమైన 'అరుణాచలం' తత్వం, అంతర్గత నిశ్చలత (Stillness), మరియు అసలైన ప్రదక్షిణ అంటే ఏమిటో విశ్లేషించే లోతైన ఆలోచన.

#Arunachalam #RamanaMaharshi #GiriPradakshina #Spirituality #PratikulaVedam #SelfInquiry #Advaita #InnerStillness #TeluguSpirituality #Philosophy

Transcript:
(00:00) అరుణాచలంలో గిరి ప్రదక్షణ 14 కిలోమీటర్లు నడవాలి కాలికి చొప్పులు లేకుండా ఎండలో గుంపుల్లో కాళ్ళు నొప్పులు పుడుతున్న సరే ఒక పట్టుదలతో నడుస్తారు. అలా నడిచాక మనం ఏమనుకుంటాం ఎంత కష్టపడి నడిచాం కదా సో మన పాపాలన్నీ పోతాయి దేవుడు ఏదో పెద్ద పుణ్యాన్ని మన అకౌంట్ లోకి వేసేస్తాడు అని కానీ ఒక్క క్షణం కాస్త కామన్ సెన్స్ తో లాజికల్ గా ఆలోచించండి.
(00:25) ఇక్కడ అసలు ఏం జరుగుతుంది భౌతికంగా ఉన్న ఒక రాయి లేదా ఒక కొండ చుట్టూ భౌతికంగా ఉన్న నీ శరీరం 14 కిలోమీటర్లు తిరిగితే నీ లోపల ఉన్న నువ్వు అనే కాన్షస్నెస్ లో మార్పు వచ్చేస్తదా లాజికల్ గా ఆలోచించు నడకవల్లే జ్ఞానదేయం వచ్చేస్తే రోజుకి 20 కిలోమీటర్లు నడిచే పోస్ట్ మన్ కి లేదా మారథాన్ లో పరిగెట్టే రన్నర్ కి ఎప్పుడో మోక్షం వచ్చేసి ఉండాలి కదా ఎందుకు రావట్లేదు మరి ఎందుకంటే మనం స్పిరిచువాలిటీని కూడా ఒక టాస్క్ లాగా మార్చేసాం.
(00:56) మన ఈగో కి టాస్క్స్ అంటే చాలా ఇష్టం నేను 14 కిలోమీటర్లు నడిచాను నేను వారం రోజులు ఉపవాసం ఉన్నాను నేను లక్ష సార్లు జపం చేశాను ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఉన్న అహంకారాన్ని ఇంకా పెంచే పనులు తగ్గించేవైతే కాదు నువ్వు కొండ చుట్టూ నడిచినప్పుడు నీ అహంకారం చావట్లేదు దానికి స్పిరిచువల్ ఈగో అనే కొత్త బట్టలు వేస్తున్నావ్ అంతే అసలు అరుణాచలం అంటే ఏంటో మీకు తెలుసా అరుణ అంటే వెలుగు అచలం అంటే కదలనిది ద ఇమ్మూవబుల్ లైట్ ఆఫ్ ట్రూత్ నీ లోపల కదలకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏ కోరిక లేకుండా ఉండే ఆ అబ్సల్యూట్ స్టిల్నెస్ే అరుణాచలం మరి ప్రదక్షణ అంటే నీ జీవితంలో పేరుకుపోయిఉన్న
(01:36) చెత్తనంతటిని కాస్త పక్కన పెట్టి నీ జీవితానికి సెంటర్లో ఇంకేవి కాకుండా కేవలం ఆ కదలని సత్యాన్ని పెట్టి నీ ఆలోచనలు నీ పనులు నీ బతుకు మొత్తం ఆ సత్యం చుట్టూనే తిరగడాన్నే అసలైన ప్రదక్షిణ అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం మన జీవితానికి సెంటర్ లో సత్యం ఉండదు భయాలు, కోరికలు, అత్యాస, అభద్రతా భావం, లోన్లు, పగ ప్రతీకారం వీటన్నిటిని గట్టిగా పట్టేసుకొని వాటిని సెంటర్లో పెట్టుకొని ఒక భౌతికమైన కొండ చుట్టూ ప్రదక్షణ పేరుతో తిరుగుతున్నావ్.
(02:07) నువ్వు బస్సులోనో ట్రైన్ లోనో అరుణాచలం వెళ్లి ఒక హోటల్ రూమ్ తీసుకొని నీ బుర్రలో ఉన్న చెత్తని నీ ఈగోని జాగ్రత్తగా మోసుకుంటూ 14 కిలోమీటర్లు కొండ చుట్టూ నడుస్తావు. ఆ నడిచేటప్పుడు కూడా పక్కవాడిని నెట్టుకుంటూనో సెల్ఫీలు తీసుకుంటూనో అబ్బా కాళ్ళు నొప్పులు అని ఏడుస్తూనో నడుస్తావ్ 14 కిలోమీటర్లు అయ్యాక అమ్మయ్యా ప్రదక్షణ పూర్తయింది ఓ పని అయపోయింది అని ఒక స్పిరిచువల్ వాలిడేషన్ ఫీల్ అవుతావ్ అంటే దేవుడితో ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన ఫీలింగ్ అది.
(02:39) నేను 14 కిలోమీటర్లు నడిచాను కాబట్టి నా కోరిక నువ్వు తీర్చాలి అనే ఒక బేరం. ఇక్కడ కొండ చుట్టూ తిరిగి వచ్చింది కేవలం మాంసం ఎముకలు కలిసి ఉన్న నీ బాడీ మాత్రమే మరి లోపల ఈగో మాత్రం అలానే ఉంది. పైగా నేను ప్రదక్షణ చేశాను అని ఆ ఈగో ఇంకొంచెం లావయింది. దేవుడికి నీ చెమట అక్కర్లేదు నీ కాళ్ళ నొప్పులు అస్సలే అక్కర్లేదు. నీ ఫిజికల్ ఎఫర్ట్ చూసే కరిగిపోయింది ఎదవ అనుకుంటున్నావా నువ్వు నమ్మే దేవుడు ఆ కొండ దేనికి సంకేతం నిశ్చలంగా కదలకుండా ఉండడానికి వర్షం వచ్చినా ఎండ కాసిన అది కదలదు.
(03:13) సో నువ్వు ఆ కొండ చుట్టూ ఒక పిచ్చవాడిలా పరిగెత్తడం కాదు నువ్వు ఆ కొండలాగా స్థిరంగా అచలంగా మారడమే ఆ అరుణాచలం వెనకున్న అసలైన స్పిరిచువాలిటీ. నీ లోపలఉన్న చంచలత్వాన్ని ఆపి ఆ కొండలాగా స్టిల్నెస్ లోకి రావడమే అసలైన లక్ష్యం. రవణ మహర్షి ఆ కొండను చూసి ఎందుకు అక్కడే ఉండిపోయారో తెలుసా ఆయన రోజుక పది సార్లు కొండ చుట్టూ పరిగెత్తడానికి కాదు ఆ కొండ యొక్క తత్వాన్ని తన లోపల నింపుకోవడానికి ద మౌంటన్ ఇస్ ఏ రిమైండర్ ఆఫ్ యువర్ ఓన్ ఇమ్మూవబుల్ నేచర్ నిన్ను నువ్వు అడగాల్సిన ప్రశ్న ఒకటే 14 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆ గిరి అక్కడే ఉంటుంది.
(03:48) కానీ నువ్వు మళ్ళీ నీ పాత జీవితంలోకే తిరిగివస్తున్నావ్. నీ కోరికలు నీ భయాలు నీ అహంకారం అన్ని నీతోనే ఇంటికి వస్తాయి. మరి ఈ 14 కిలోమీటర్ల ప్రదక్షణలో నువ్వు ఆ కొండ దగ్గర వదిలేసింది ఏంటి కేవలం నీ చెప్పులు మాత్రమే సో పక్కవాడికి చూపించుకోవడానికో నీ మనసుకు నువ్వే అబద్ధం చెప్పుకోవడానికో చేసే ఈ భౌతిక ప్రయాణాన్ని ఆపి నీ లోపల ఉన్న అచలం అంటే స్టిల్నెస్ వైపు ప్రయాణించు అసలైన ప్రదక్షణ బయట కాదు నీ లోపల జరగాలి.
(04:21) అప్పుడు మాత్రమే అరుణ అచలంగా ఉన్న అరుణాచలం అంటే ఏంటో నీకు నిజంగా అర్థమవుతుంది. ఆలోచించు.

No comments:

Post a Comment