Saturday, September 26, 2026

మేనరిక వివాహం వెనుక.. అసలు రహస్యం ఇదే! | Human Evolution | Out of COVERAGE

మేనరిక వివాహం వెనుక.. అసలు రహస్యం ఇదే! | Human Evolution | Out of COVERAGE

Author Name:Out of COVERAGE

Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=guq3jfRbzEo





Title: మేనరిక వివాహం వెనుక.. అసలు రహస్యం ఇదే! | Human Evolution | Out of COVERAGE

Author Name: Out of COVERAGE

Description: In this video, we explore the history, reasons and science behind cousin marriages across the world.

Watch the full video to understand the Ancient System. and biological science too!

If you like this video, please Like, Comment, and Subscribe for more amazing history and science content!


Disclaimer : Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com

#history
#science
#ancienthistory
#documentary
#outofcoverage

Transcript:
(00:00) స్ట్రెయిట్ గా విషయానికి వచ్చేస్తే అన్న కూతురు తమ్ముడికి కూడా కూతురే అవుతుంది కానీ అక్క బిడ్డ మాత్రం పెల్లం అవుతుంది చేసుకుంటే అన్న మన రక్తం అయినప్పుడు అక్క కూడా మన రక్తం కదా ఆమెది కూడా మన రక్త సంబంధమే కదా మరి అన్న కూతురు విషయంలో వర్తించిన ఒక కట్టుబాటు అక్క బిడ్డ దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా రివర్స్ ఎందుకైంది దీని వెనక పనిచేసిన అతి ముఖ్యమైన సూత్రం ఏంటి కొందరు తెలుగు వాళ్ళు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సాంప్రదాయం అంటారు.
(00:27) తెలంగాణలో కూడా ఉంది బ్రో అంటే అయితే మీకు ఏపీ పద్ధతి అంటుకుంది అంటారు. నార్త్ వాళ్ళు ఇది దక్షిణాది సాంప్రదాయం అంటారు. మరి ఇంతకీ ఇది ఎక్కడ సాంప్రదాయం? ఇది కేవలం భారత్లోనే ఉందా యావత్ ప్రపంచం మొత్తం ఉందా? మతాల విషయానికి వస్తే హిందూ మతంలోనే ఉందా ఇతర మతాల్లో కూడా ఉందా? ఉంటే ఎందుకు ఉంది అనే విషయాలను క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం.
(00:50) లక్షలాది సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో మనుషులు అడవుల్లో చిన్న చిన్న గుంపులుగా తెగలుగా బతికేవారు. ఆ రోజుల్లో పెళ్లిళ్లు కుటుంబాలు లేవు. ఒకే గుంపులోని మనుషులు ఒకరితో ఒకరు శారీరక సంబంధాలు పెట్టుకునేవారు. అయితే వేల ఏళ్లు గడిచే క్రమంలో వాళ్ళలో వాళ్లే పిల్లలని కంటూ ఉండడం వల్ల జెన్యూలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిపోయి వీక్ అయిపోయాయి. పిల్లలు శారీరక మానసిక వికలాంగులుగా పుట్టడం లేదా పుట్టగానే చనిపోవడం వంటివి జరిగేవి.
(01:14) ఎలాంటి సైన్స్ ల్యాబులు లేని ఆ కాలంలోనే మనుషులు తమ అనుభవపూర్వకంగా గ్రహించిన సత్యం ఏంటంటే సొంత గూటి రక్తం కలవకూడదు అని ఆ విధంగా మానవ చరిత్రలో ఇన్సెస్ట్ ట్యాబ్ అంటే సొంత కుటుంబంలో శారీరక సంబంధాలు పెట్టుకోకూడదనే కఠినమైన సామాజిక చట్టం పుట్టుకొచ్చింది. దీన్ని ఎక్కడ కట్టు తప్పకుండా చేయడానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ తెగల్లో ఒక్కో రకమైన కట్టుబాట్లు పెట్టుకున్నారు.
(01:41) హిందూ సంస్కృతిలో ఇలా పుట్టిందే గోత్రం అనే వ్యవస్థ. గోత్రం అంటే ఒకే మూల పురుషుడి నుంచి వచ్చిన వంశం అన్నమాట. పురాతన కాలంలో రక్త సంబంధీకులను గుర్తించేందుకు పెట్టుకున్న అద్భుతమైన గుర్తు ఈ గోత్రం అని చెప్పుకోవచ్చు. వేల ఏళ్ల క్రితం ఒక వ్యక్తికి పుట్టిన పిల్లలు వలసల రూపంలో విడిపోయి ఎక్కడెక్కడో నివసిస్తూ ఉంటారు. అలాంటి వారు ఒక 10 20 తరాల తర్వాత చూస్తే ఎవరికెవరు తెలిసే అవకాశమే ఉండదు.
(02:06) ఇలాంటి పరిస్థితుల్లోనూ వారు తమవారేనని గుర్తించగలిగేది ఏదో ఒక సమయంలో వీరు తమ రక్త సంబంధకులేనని చెప్పగలిగేది ఒక్క గోత్రం మాత్రమే ఆ విధంగా ఒకే గోత్రం ఉన్నవారు అన్నదమ్ములు అక్క చెల్లెలు అవుతారు. కాబట్టి వారి మధ్య పెళ్లి నిషిద్ధం అనే రూల్ పెట్టారు. ఆ విధంగా గోత్రం అనేది ఒక అలవాటుగా ఆచారంగా పవిత్ర సాంప్రదాయంగా మారిపోయింది. ఓకే ఇక్కడి వరకు బాగుంది.
(02:32) మరి ఒకే గోత్రానికి చెందిన అన్న కూతురిని పెళ్లి చేసుకోవడం నిషిద్ధం అని రూల్ పెట్టిన పెద్దలు అక్క కూతురిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఎలా అనుమతించారు? అందులో కూడా మన రక్తం వాట ఉంటుంది కదా కాబట్టి అక్క బిడ్డను పెళ్లి చేసుకోవడం కూడా తప్పే కదా అంటే నిజానికి అవును కానీ ఇక్కడ కావాలని మన పూర్వీకులు ఒక లూప్ హోల్ పెట్టారు.
(02:51) స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో మన దేశంలో భూస్ీలింగ్ చట్టం తెచ్చారు. మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. దాని ప్రకారం 50 ఎకరాల చేంజ్ మాత్రమే ఒక వ్యక్తి పేరున ఉండాలి. మిగిలింది ఎంత ఉన్నా సరే ప్రభుత్వం తీసుకొని భూమి లేని వారికి పంచుతుంది. ఇది చట్టం కానీ ఇందులో లూఫ్ హోల్స్ పెట్టేశారు. సాగుభూమి మాత్రమే అంతకన్నా ఎక్కువ ఉండకూడదు తోటల రూపంలో మరికొన్ని ఎకరాలు ఉంచుకోవచ్చు.
(03:15) కుటుంబ సభ్యుల పేరు మీద పెల్లం భార్యా బిడ్డల పేరు మీద మరికొన్ని ఎకరాలు ఉంచుకోవచ్చు. బంధువుల పేరున ఇంకొన్ని రాయొచ్చు. సరిగ్గా ఇట్లాంటి బొక్కనే గోత్రంలో కూడా పెట్టారు. అదే అక్క కూతురిని పెళ్లి చేసుకునే రూల్ దాన్నే ఇప్పుడు మనం మేనరికం అని పిలుస్తున్నాం. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకల్లో మేనరికం అనేది శతాబ్దాలుగా ఒక పవిత్రమైన ఆచారంగా సాగింది.
(03:39) ఇప్పటికి ఇలాంటి పెళ్లిలు నూటికో కోటికో ఎక్కడో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. మరి దీన్ని ఎందుకు పెట్టారు అనేది తర్వాత చూద్దాం. అంతకన్నా ముందుగా దీన్ని ఎలా సమర్ధించుకున్నారు మన పెద్దలు అనేది ఇప్పుడు చూద్దాం. మనది పితృస్వామిక వ్యవస్థ. తండ్రి పేరు మీదనే సమాజం ముందుకు సాగుతుంది. మన అమ్మాయిని ఒకే గోత్రం ఉన్నవారికి ఇవ్వకుండా వేరే గోత్రం ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం.
(04:00) ఆ విధంగా అమ్మాయి తన పుట్టింటి గోత్రాన్ని వదిలేసి భర్త ఇంటి గోత్రంలోకి మారిపోద్ది. [గొంతు సవరించుకోవడం] టెక్నికల్ గా చూసినప్పుడు ఆమె గోత్రం మారిపోయింది. అంటే ఇప్పుడు ఆమె మన గోత్రం అమ్మాయి కాదు. కాబట్టి ఆమెకు పుట్టే పిల్లలు కూడా పుట్టింటి గోత్రానికి చెందిన వారు కాదు. కాబట్టి ఆమె బిడ్డను వేరే గోత్రానికి చెందిన పిల్ల పేరిట తిరిగి మన ఇంటికే కోడలుగా తెచ్చుకోవచ్చు అని డిసైడ్ చేశారు.
(04:22) ఈ విధంగా వందలు వేల సంవత్సరాలుగా మేనరికం వివాహాలు సాగుతున్నాయి. మరి ఈ లూఫోలు ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. దీని వెనకున్నది ఆధ్యాత్మిక కారణం కాదు. ఇతరతర కారణాలు కూడా కావు. ఉన్నది ఒకే ఒక్క బలమైన కారణం అదే ఆర్థికం. అవును కేవలం ఆర్థిక కారణంతోనే మేనరికం వివాహాలు పుట్టుకొచ్చాయి. మనుషులు అడవుల్లో వేట దశ నుంచి వ్యవసాయంలోకి మారిన తర్వాతనే పెళ్లి పుట్టింది.
(04:49) ఆ పెళ్లితోనే నా భూమి నా ఆస్తి నా వారసత్వం అనే స్వార్థం పెరిగింది. ఈ స్వార్థం అక్క బిడ్డను పెళ్లి చేసుకునేలా చేసింది. మనవరాలిని ఇంటి కోడలుగా తెచ్చుకునేలా చేసింది. ఒక తండ్రికి అమ్మాయి అబ్బాయి ఉంటే అమ్మాయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. ఆమెకు ఇప్పుడు ఇస్తున్నట్టుగా కట్నం రూపంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఉన్న భూమిలోనే కొంత వాటాను పసుపు కుంకుమ రూపంలో ఇచ్చేవారు.
(05:09) బంగారం కూడా ఇచ్చేవారు. ఆ రోజుల్లో భూమి లేకపోతే బతుకు లేనట్టే ఇవాళ భూమి లేకపోయినా ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ నాడు భూమి లేకపోతే దాదాపుగా కూలీలుగానే బతకాల్సిన పరిస్థితి చాలా మందిది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అమ్మాయిని ఒట్టి చేతులతో పంపలేం. అలా పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవారు కాదు.
(05:28) అలాగని ఉన్న కొద్దిపాటి భూమిలో ఆమెకు వాటా ఇస్తే మనకు సరిపోదు. ఇక ఇంట్లో అమ్మాయిలే ఐదారుగురు ఉంటే ఆ కుటుంబం కష్టాలు చెప్పడానికి మాటలు చాలు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంటి బిడ్డకు పుట్టిన కూతురిని మన చిన్నోడికి ఇచ్చి పెళ్లి చేస్తే కూతురికి కట్నంగా వెళ్ళిన భూమి తిరిగి మన ఇంటికే వస్తుంది. ఇది మొదటి ప్లాన్ ఇక రెండో ఆలోచన కూడా ఉంది.
(05:49) ఇవాల్టి మాదిరిగా ఫోన్లు లేవు బస్సులు రైలు కూడా లేవు. కూతురిని ఎక్కడో దూరంగా ఇచ్చి పెళ్లి చేస్తారు. అలా ఆమె దూరమైపోద్ది. పండగలకు పబ్బాలకు వస్తున్నా కూడా కాలక్రమంలో అవి కూడా మరింతగా తగ్గిపోతాయి. దాంతో దూరం ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఆమె కూతురిని మన ఇంటికే తెచ్చుకుంటే మళ్ళీ మన బంధం బలపడుతుంది. అంతేకాదు చిన్నప్పటి నుంచి మేనకోడలిగా మనవరాలిగా మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి మన మనస్తత్వం తెలుస్తుంది.
(06:16) మన పని విధానం తెలుసు మన కుటుంబ పద్ధతులు వ్యవహారాలు తెలుసు అందువల్ల సర్దుకుపోతుంది. ఇంటిని సరిదిద్దుకుంటుంది. అలా కాకుండా వేరే అమ్మాయిని మన ఇంటి కోడలుగా తెచ్చుకుంటే ఎలాంటి మనస్తత్వం కలిగిన పిల్ల వస్తుందో కుటుంబంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఇలా ఆలోచించారు. ఇక మూడో కారణం బలం బలగం వ్యవసాయం కనిపెట్టిన తొలినాడాలలో ఒక గుంపు మరో గుంపు మీద దాడి చేసి సంపద మొత్తం దోచుకెళ్ళేవారని గత వీడియోలో చెప్పుకున్నాం.
(06:43) ఈ అనుభవం కాలక్రమంలో శతాబ్దాల పాటు పనిచేసింది. మేడరికం వివాహాలు చేసుకుంటూ మన కుటుంబాన్ని బంధుత్వాన్ని విస్తరించుకుంటూ పోవడం ద్వారా మన బలగం పెరుగుతూ వెళ్తుంది. తద్వారా శత్రువులు మనపై దాడికి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇలా మన ఆస్తి మన చుట్టూనే తిరుగుతుంది. మన ఆడపిల్ల దాని వారసత్వం కూడా మన కళ్ళ ముందే ఉంటుంది.
(07:05) ఇంకా మన బలం పెరుగుతుంది. ఈ మూడు బలమైన కారణాలతో మేనరిక వివాహాలకు పచ్చజెండా ఊపారు మన పూర్వీకులు. ఇది దక్షిణ భారతదేశంలోని పరిస్థితి. ఇక ఉత్తర భారతదేశానికి వెళ్తే అక్కడ భిన్నమైన పరిస్థితులు ఉండేవి. ఒకే హిందూ సంస్కృతిలో రెండో రూపం కనిపిస్తుంది అక్కడ. నార్త్ లో మేనదికం వివాహాలు పూర్తిగా నిషిద్ధం. అక్కడ మేనకోడల్ని పెళ్లి చేసుకోవడం పాపంగా భావిస్తారు.
(07:27) ఎందుకంటే మన దగ్గర ఉన్నట్టుగా ఆడపిల్లకు ఆస్తిలో ఎలాంటి భాగం ఇచ్చేవారు కాదు వాళ్ళు. పూర్వకాలంలో ఉత్తరాదిన మితాక్షర అనే చట్టం అమల్లో ఉండేది. దీని ప్రకారం ఆస్తి హక్కులు కేవలం మగపిల్లలకు మాత్రమే ఉండేవి. ఆడపిల్లలకు ఏమీ ఇచ్చేవారు కాదు. కాబట్టి పెళ్లి ద్వారా ఆస్తి బయటకు పోతుందనే భయం వారికి లేదు. ఇలా ఆస్తిని కాపాడుకోవాల్సిన అవసరం లేకపోవడంతో జీవశాస్త్ర నియమాలను కఠినంగా పాటించారు.
(07:51) నార్త్ లో సపిండా అనే నియమాన్ని తెచ్చారు. దీని ప్రకారం ఇంట్లో ఒక వివాహం చేస్తున్నప్పుడు తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు కనీసం ఐదు తరాల వరకు చూస్తారు. ఈ తరాల్లో ఎక్కడ రక్త సంబంధం మ్యాచ్ అయినా పెళ్లి చేసుకోరు. దీంతో పాటు గ్రామం బయటనే వివాహం అనే మరో రూల్ కూడా పాటిస్తారు. అంటే సొంత ఊరిలో ఉండేవారంతా అన్నదమ్ములుగా భావిస్తారు.
(08:14) ఆదిమానవుల కాలంలో ఒకే గుంపులో ఉన్నవారు పెళ్లి చేసుకోవద్దని గుర్తించారని వీడియో మొదట్లో చెప్పుకున్నాం కదా ఆ విధానాన్ని పాటిస్తూ వేరే ఊరి నుంచి పెళ్లికూతురిని పెళ్లి కొడుకుని తెచ్చుకుంటారు. ఈ విధంగా ఉత్తరాది వారు కొత్త ప్రాంతాల వారితో పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త బంధుత్వాలు ఏర్పరుచుకునే వ్యూహాన్ని అనుసరిస్తే దక్షిణాది వారు ఉన్న సంపదను ఉన్న బంధాన్ని మనలోనే భద్రంగా దాచుకునే వ్యూహాన్ని అమలు చేశారు.
(08:37) మరి ఇలాంటి వివాహాలు కేవలం భారత్లో మాత్రమే ఉన్నాయా అంటే ఎంత మాత్రమో కాదు. దాదాపుగా ప్రపంచంలోని ప్రతి చోట ప్రతి మతంలోనూ ఈ మేడరికం తరహా పెళ్లిలు ఉన్నాయి. ఏదో ఒక రూపంలో రక్త సంబంధీకులను పెళ్లి చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కజిన్ వివాహాలు అత్యధికంగా జరిగేది ముస్లిం సమాజంలో దీని వెనుక కూడా బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి. అరబ్ దేశాల్లో పూర్వం తెగల మధ్య తీవ్రమైన యుద్ధాలు జరిగేవి.
(09:03) తమ తెగ యొక్క రహస్యాలు, అధికారం, ఒంటెలు, గుర్రాలు, భూములు ఇవన్నీ వేరే తెగ చేతుల్లోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో వారు కజిన్ వివాహాలను ప్రోత్సహించారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది. కాబట్టి ఆ ఆస్తి బయటకు పోకూడదంటే కుటుంబంలోనే పెళ్లిళ్లు చేయడం వారికి కూడా మనలాగే అనివార్యమైంది. నేటికి పాకిస్తాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో దాదాపు 40% నుంచి 60% వరకు వివాహాలు కజిన్స్ మధ్య జరుగుతున్నాయని అంచన.
(09:31) ఇక యూదుల సాంప్రదాయంలో మేనమామ మేనకోడల వివాహాలకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. వారి పవిత్ర గ్రంథమైన తాల్మూడు ప్రకారం ఒక వ్యక్తి తన సోదరి కుమార్తెను వివాహం చేసుకోవడం అనేది చాలా గొప్ప కార్యం. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది వారి మైనారిటీ. ప్రపంచవ్యాప్తంగా యూదుల సంఖ్య చాలా తక్కువ. ఆ కారణంగా వారు ఇతర తెగలతో ఇతర జాతులతో నిరంతరం వేదింపుల గురవుతూ దారులకు గురవుతూ బతికారు.
(09:55) ఇలాంటి పరిస్థితుల్లో తమ గుర్తింపును సంస్కృతిని సంపాదించిన ఆస్తులను కోల్పోకుండా ఉండడానికి వారు తమ బంధువుల పరిధిలోనే పెళ్లిళ్లు చేసుకునే పద్ధతిని గట్టిగా పాటించారు. అటు క్రిస్టియానిటీలో చూస్తే పాత నిబంధన ప్రకారం మేనరికం వివాహాల నిషేధం. దీన్ని క్యాథలిక్కులు బలంగా పాటించేవారు. కానీ ఆ తర్వాత ప్రొటెస్టెంట్లు వచ్చిన తర్వాత కజిన్ మ్యారేజెస్ జరిగాయి.
(10:17) యూరోప్ లోని కింగ్డమ్స్ అన్నీ తమ కిరీటాలు సామ్రాజ్యాలు వేరే దేశాల రాజుల పరం కాకూడదని శతాబ్దాల పాటు అన్నదమ్ముల అక్క చెల్లెల పిల్లల మధ్య పెళ్లిళ్లు జరిపించారు. బ్రిటన్ క్వీన్ విక్టోరియా తన సొంత మొదటి కజిన్ అయిన ప్రిన్స్ ఆల్బర్ట్ ను పెళ్లి చేసుకుంది. బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన అధికారిక రికార్డుల ప్రకారం క్వీన్ విక్టోరియా ప్రిన్స్ ఆల్బర్ట్ ఒకే వంశానికి చెందిన వారని స్పష్టంగా తెలుస్తుంది.
(10:41) ఇంకా వెనక్కు వెళ్లి ప్రాచీన ఈజిప్టు ఫారో కింగ్స్ పెళ్లిళ్లు చూస్తే భయంకరంగా అనిపిస్తాయి. వారు తమను తాము దేవుళ్లుగా భావించేవారు. అలాంటి తమ దేవ రక్తం ఇతర మనుషుల రక్తంతో కలవకూడదని సింహాసనం బయటకు పోకూడదని సొంత సోదరీ మనలను కూతుర్లను సైతం వివాహం చేసుకున్నారు. వీటన్నింటిని dఎన్ఏ పరీక్షల ద్వారా ప్రూవ్ చేశారు కూడా. ఈ విధంగా అన్నకూతురిని వద్దని అక్క కూతురిని మాత్రమే పెళ్లి చేసుకోమని చెప్పడం వెనుక ఎలాంటి దైవిక రహస్యాలు లేవు.
(11:08) దాని వెనక ఉన్నది కేవలం సంపదను భూమిని ఇంటి పరిధిలోనే దాచుకోవాలనే ఆర్థిక స్వార్థం మాత్రమే. నాటి కాలంలో రవాణ సౌకర్యాలు లేకపోవడం ఆస్తులు విడిపోకూడదనే కారణాల వల్ల ఆనాటి పెద్దలు ఆస్తి కోసం జీవశాస్త్రంతో రాజీపడ్డారు. ఈ విధంగా ఆస్తిని అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మనుషులు వేసిన ఈ మాస్టర్ ప్లాన్ పైకి బాగానే కనిపిస్తుంది.
(11:31) కానీ ప్రకృతిని మనం ఎల్లకాలము మోసం చేయలేం కదా జీవశాస్త్ర నియమాలను ఉల్లంఘించినందుకు మానవజాతి భయంకరమైన మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. రాజుల నుంచి సామాన్యుల వరకు ముక్కులు మూతులు వంకరపోయి దవడలు నలిగిపోయి మెదడు పరిమాణం పెరగక మానసిక వైకల్యాలతో పుట్టిన వారికి పుట్టే వారికి లెక్కే లేదు. కాబట్టి ఈ 21వ శతాబ్దంలో ఆస్తుల కంటే మన పిల్లల ఆరోగ్యమే ముఖ్యంగా చూడాలి.
(11:55) ఇప్పుడు కూడా అధికారం కోసమో మరో కారణంతోనో ఈ ఆచారం కొనసాగిస్తే పుట్టబోయే పిల్లల జీవితాలను చేజేతుల నాశనం చేసిన వారే అవుతారు. ఉన్న సంపద అంతా వైద్యానికే తగలేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవద్దని ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో చేసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ముందే జెనటిక్ కౌన్సిలింగ్ ఇంకా ప్రీమరిటల్ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
(12:21) ఇది ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి చారిత్రక మానవ పరిణామ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సెలవ్

No comments:

Post a Comment