Thursday, September 24, 2026

బుర్రలో ఎవరిదో ప్రోగ్రామ్, వేల మంది భక్తుల్ని వదిలేశాడు ||JK explains about Freedom Vs Conditioning

బుర్రలో ఎవరిదో ప్రోగ్రామ్, వేల మంది భక్తుల్ని వదిలేశాడు ||JK explains about Freedom Vs Conditioning

Author Name:Beyond Civils

Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1Ifm_i5elao





Title: బుర్రలో ఎవరిదో ప్రోగ్రామ్, వేల మంది భక్తుల్ని వదిలేశాడు ||JK explains about Freedom Vs Conditioning

Author Name: Beyond Civils

Description: In this video, we explore philosopher Jiddu Krishnamurti's (JK) profound teachings on Psychological Conditioning vs. True Freedom.
​From childhood, our family, religion, caste, and social systems imprint a blueprint onto our minds, shaping what we wear, who we worship, and how we react. Jiddu Krishnamurti was groomed by the Theosophical Society to be the next "World Teacher," yet in 1929, he walked away from thousands of devotees, vast wealth, and immense power, declaring: "Truth is a pathless land."
​Discover why stepping away from authority, understanding the psychological "elephant and the rope" conditioning, and cultivating non-judgmental self-observation is the only gateway to genuine inner freedom.
​Video Chapters
​00:00 - Are You Living Your Life, or Society's Program?
​00:48 - What is Psychological Conditioning?
​00:58 - The Theosophical Society & Grooming of a World Teacher
​01:24 - 1929: Renouncing Followers & "Truth is a Pathless Land"
​02:00 - Why You Shouldn't Blindly Follow Any Guru or Authority
​02:39 - The Parable of the Elephant and the Rope
​03:45 - How Past Memories & Biases Rule Our Emotions
​04:10 - The Path to True Freedom: Pure Self-Observation
​#JidduKrishnamurti #JKrishnamurti #Philosophy #PsychologicalConditioning #Mindset #SelfAwareness #TruthIsAPathlessLand #SpiritualFreedom #BeyondCivils #SelfDiscovery

Transcript:
(00:02) మీరు వేసుకున్న బట్టలు మీరు సెలెక్ట్ చేశారా లేదా సొసైటీ సెలెక్ట్ చేసిందా? మీరు నమ్మే దేవుడు మీరు కనుక్కున్నారా లేదా పుట్టింట్లో రెడీమేడ్ గా ఇచ్చారా? మీరు ప్రేమించే వ్యక్తిని మీరు చూస్ చేశారా లేక కులం మతం ఫ్యామిలీ స్టేటస్ ముందే డిసైడ్ చేసేసిందా? మనం అనుకుంటాం నేను నా ఇష్ట ప్రకారమే బతుకుతున్నానని [సంగీతం] కానీ నిజం ఏంటంటే పుట్టినప్పటి నుండి మనల్ని ఒక ఫ్యాక్టరీలో తయారు చేసిున్నట్టు ప్రోగ్రాం చేస్తారు.
(00:32) [సంగీతం] పేరెంట్స్, టీచర్స్, రిలీజియన్, సొసైటీ అందరూ కలిసి మీ బుర్రలో నువ్వు ఇలానే ఉండాలి అనే బ్లూప్రింట్ పెడతారు. మీరు తీసుకుంటున్న ప్రతి డెసిషన్ వెనుక ఎవరో ఒకరు ముందే గీసిన గీత ఉంటుంది. దీన్నే కృష్ణమూర్తి కండిషనింగ్ అన్నాడు. [సంగీతం] కృష్ణమూర్తి అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి పేదవాడు ఒక థియోసఫికల్ సొసైటీ అనే ఆర్గనైజేషన్ ఇతని పిక్ చేసింది.
(01:02) ఎందుకంటే వాళ్ళ నమ్మకం ప్రకారం [సంగీతం] కృష్ణమూర్తి వరల్డ్ టీచర్ గా ఒక కొత్త మెస్సయ్యలా రాబోతున్నాడు. ఒక పిల్లాడిని చిన్నప్పటి నుండే నువ్వు దేవుడివి నువ్వు ప్రపంచాన్ని మారుస్తావని కల్టు పెంచింది. వేలాది మంది భక్తులు ఒక ఎంటైర్ రిలీజియస్ ఆర్గనైజేషన్ అని [సంగీతం] ఇతని కోసమే క్రియేట్ చేశారు. కానీ 1929 లో వేలాది మంది ఫాలోవర్ల ముందు నిలబడి కృష్ణమూర్తి ఏం చేశాడో తెలుసా? ఆ ఆర్గనైజేషన్ే రద్దు చేసేసాడు.
(01:32) సత్యం అనేది ఒక దారి లేని భూమి అని చెప్పి నన్ను ఎవరు ఫాలో అవ్వద్దు ఏ గురువుని ఏ ఆర్గనైజేషన్ ని ఫాలో అవ్వద్దు అని స్పష్టంగా చెప్పాడు. [సంగీతం] వేలమంది భక్తులు ఆస్తులు పవర్ ఇలా అన్ని వదిలేసుకున్నాడు కృష్ణమూర్తి [సంగీతం] ఎందుకంటే అతనికి అర్థమైంది తనని ఒక దేవుడిలా చూసేవాళ్ళు కూడా తనని కండిషనింగ్ లోనే ఉంచుతున్నారని ఒక కొత్త బానిసత్వాన్ని పాత బానిసత్వ స్థానంలో పెడుతున్నారని కృష్ణమూర్తి బతికినంత కాలం ఒకటే మాట చెప్పాడు.
(02:08) మీరు ఏ అథారిటీని ఏ గురువుని ఏ బుక్ ని నమ్మి బతకొద్దు. మీ మనసుని మీరే అబ్సర్వ్ చేసుకోండి. అప్పుడే నిజమైన స్వేచ్ఛ వస్తుందని చెప్పాడు. ఇది వినడానికి బాగానే ఉంటుంది. కానీ ప్రాక్టికల్లీ ఇది చాలా డిస్టర్బింగ్ ఐడియా ఎందుకంటే మనం చిన్నప్పను నేర్చుకున్నది అథారిటీని ఫాలో అవ్వడం రూల్స్ పాటించడం [సంగీతం] గ్రూప్ లో మర్జ్ అవ్వడం కృష్ణమూర్తి చెప్పేది దానికి పూర్తిగా వ్యతిరేకం.
(02:35) [సంగీతం] నువ్వు ఒంటరిగా ఆలోచించు ఎవరిని బ్లైండ్లీ ఫాలో అవ్వకని చెప్పాడు. ఒక ఊర్లో ఒక చిన్న ఏనుగు ఉండేది. ఆ ఏనుగును చిన్న తాడుతో ఒక చెట్టుకి కట్టేసేవాళ్ళు ఆ చిన్న ఏనుగు ఎంత లాగినా తాడు తెగలేదు. కొన్ని రోజుల తర్వాత అది లాగడం మానేసింది. ఏళ్లు గడిచాయి ఆ ఏనుగు పెద్దదయింది. ఇప్పుడు దానికి ఆ చెట్టును కూడా పెగిలించే శక్తి ఉంది. [సంగీతం] కానీ ఇప్పటికీ అదే చిన్న తాడుతో దాన్ని కట్టేస్తే అది కదలడం లేదు.
(03:05) [సంగీతం] ఎందుకంటే దాని బుర్రలో ఇంకా అదే నమ్మకం ఉంది. నేను దీన్ని తెంచలేనని ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు అడిగాడు ఇంత బలమైన ఏనుగు ఈ చిన్న తాడును ఎందుకు తెంచలేదని బదులుగా పక్కనున్న ఓల్డ్ మ్యాన్ నవ్వి ఇలా చెప్తాడు. తాడు దాన్ని కట్టడం లేదు నాయనా దాని జ్ఞాపక శక్తి దాన్ని కట్టేసిందని మనుషులం కూడా అంతే [సంగీతం] మనల్ని కట్టేసింది కులం మతం ఫ్యామిలీ రూల్స్ సొసైటీ భయంఅనే తాళ్లు కాదు మనం చిన్నప్పటి నుండి నమ్మిన నమ్మకం [సంగీతం] నేను ఇలాగే ఉండాలి ఇది తెంచలేను అనే అసలు తాడు కృష్ణమూర్తి చెప్పిన కండిషనింగ్ థియరీ ఇక్కడే ఆగిపోదు. ఇది కేవలం మతం
(03:47) గురించో కులం గురించో కాదు [సంగీతం] ప్రతి ఆలోచన ప్రతి ఎమోషన్ ప్రతి రియాక్షన్ కూడా గతంలో మనం అక్యుములేట్ చేసిన మెమరీ నుండే వస్తుందని అతను చెప్పాడు. మనం ఎవరినైనా ప్రేమించినా ద్వేషించినా భయపడినా అది నేను అనే ఫ్రెష్ థాట్ నుండి రావట్లేదు. ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ నుండి ఫాస్ట్ కండిషనింగ్ నుండి వస్తుంది.
(04:13) అందుకే కృష్ణమూర్తి చెప్పిన ప్రకారం నిజమైన స్వేచ్ఛ అంటే ఏదో సాధించడం కాదు. ఇది ఒక కాన్స్టంట్ అవేర్నెస్ [సంగీతం] మీ మనసు ఏ క్షణంలో ఏ పాటర్న్ లో పని చేస్తుందో దాన్ని గమనించడం. ఏ జడ్జ్మెంట్ లేకుండా [సంగీతం] ఏ కరెక్షన్ లేకుండా కేవలం అబ్సర్వ్ చేయడం ఇదే జిడ్డు కృష్ణమూర్తి జీవితాంతం చెప్పిన మాట. మీ కండిషనింగ్ ని మీరు గుర్తించగలిగితే అదే మొదటి అడుగు అంతకుమించి అతను ఏ ఫార్ములా ఇవ్వలేదు.
(04:43) ఏ షార్ట్ కట్ చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఫార్ములా ఇచ్చినా అది కూడా ఇంకో కొత్త ఐడియా మాత్రమే అవుతుంది. హు

No comments:

Post a Comment