Home
Shorts
You
PRATIKULA VEDAM
48 minutes ago (edited)
🟡వేగంగా పరిగెడుతున్న నీడను పట్టుకోవాలని చూస్తే ఏమవుతుంది? ఎంత పరిగెత్తినా అది దొరకదు, పైగా నువ్వు అలిసిపోతావు. మనసులో వచ్చే 'Negative Thoughts' తో మనం చేసే యుద్ధం కూడా అచ్చం ఇలాంటిదే.
Negative Thoughts రాకుండా ఆపాలి. ఇదే కదా మనందరి Target? ఎన్నో బుక్స్ చదువుతాం, వీడియోలు చూస్తాం, ధ్యానం, మెడిటేషన్లు చేస్తాం. కానీ రియాలిటీ ఏంటంటే, నువ్వు ఎంత ఆపాలని చూస్తే అవి అంత దారుణంగా నీ మీద attack చేస్తాయి. ఇక్కడ అసలు ప్రాబ్లం నీ ఆలోచనల్లో లేదు, ఆ ఆలోచనలను నువ్వు చూస్తున్న విధానంలో ఉంది.
🔴First of all, అసలు ఈ Negative, Positive అనేవి ఎక్కడున్నాయి? నిజానికి అవేమీ లేవు. ఇవి మన బ్రెయిన్ తన భద్రత కోసం క్రియేట్ చేసుకున్న folders మాత్రమే. ఒక ఆలోచన వస్తుంది, అది నీ ego కి నచ్చితే దాన్ని POSITIVE అంటావు, నచ్చకపోతే భయపడిపోయి 'NEGATIVE' అని లేబుల్ వేస్తావు.
కానీ ఇక్కడే logical గా ఆలోచించు. నీకు ఒక Negative thought వచ్చింది. వెంటనే నువ్వు "దీన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలి" అనుకుంటావు. ఆ కంట్రోల్ చేయాలి అనుకుంటున్న ఆ 'నేను' ఎవరు? నీకు కోపం వచ్చినప్పుడు, "నేను శాంతంగా ఉండాలి" అని order వేస్తున్న ఆ 'నేను' ఎక్కడి నుంచి వచ్చాడు?
🔵దీని వెనక ఉన్న పచ్చి నిజం ఏంటంటే.. ఆ 'నేను' అనేది కూడా ఇంకొక ఆలోచనే..
అంటే నీ బ్రెయిన్ లో పుట్టిన ఒక ఆలోచన, తనని తాను ఒక boss లాగా ఫీల్ అయ్యి, బ్రెయిన్ లోనే పుట్టిన మిగతా ఆలోచనలను కంట్రోల్ చేయాలని చూస్తోంది. దొంగే పోలీసు డ్రెస్ వేసుకుని దొంగను వెతుకుతున్నట్టు అన్నమాట. ఆలోచన ఆగిపోతే, ఆలోచించేవాడు కూడా ఉండడు. ఆలోచించేవాడు (Thinker), ఆలోచన (Thought) రెండూ వేరు వేరు కాదు, రెండు ఒక్కటే. ఈ basic logic miss అయ్యి, జీవితాంతం ఒక ఆలోచనతో ఇంకో ఆలోచనను కొట్టి చంపాలని చూస్తూ పిచ్చోళ్ళం అవుతున్నాం.
🧠మరి ఈ thoughts కి ఇంత power ఎక్కడి నుంచి వస్తోంది? నీ గతంలోంచి. From your past. గతం అనేది ప్రాణం లేని ఒక చచ్చిన శవం లాంటిది. కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రతి కొత్త situation కి, నీ పాత భయాలను లింక్ చేసి నువ్వే దానికి ప్రాణం పోస్తున్నావు. పాత memory కొత్త దాని మీద attack చేస్తోంది. దీన్నే మనం 'జీవితానుభవం' అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. నువ్వు ఎంతసేపూ నీ past లో బ్రతుకుతున్నావు కాబట్టే, వర్తమానంలో ఏ పని ఇష్టంగా చేయలేకపోతున్నావు. ఇష్టం లేని పని చేయడానికి నీకు మళ్ళీ ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రత కోసం నీ మీద నువ్వే artificial గా pressure పెట్టుకుని, అది కుదరక Negative thoughts కి బలి అవుతున్నావు.
🟡సరే, దీన్ని ఆపడం ఎలా? Negative thoughts ని అణచివేసి, Positive thoughts మీద focus చేద్దామా?
బొత్తిగా ఏ మాత్రం బుర్రలేని వాళ్ళు చేసే పని ఇది. దేన్నో ఒకదాన్ని అణచివేయడం అంటే.. నీకు ఉన్న problem ని ఇంకో కొత్త problem తో కవర్ చేయడం. నిన్ను నువ్వు అణచివేసుకోవడం మొదలుపెడితే, లోపల సంఘర్షణ పెరిగిపోయి అది ఉన్న ప్రాబ్లం కంటే పెద్ద cancer లా మారుతుంది.
"మరి ఆలోచనల వేగాన్ని తగ్గించాలా?" అని అడగొచ్చు. అసలు వేగాన్ని తగ్గించడానికి try చేసేది ఎవరు? మళ్ళీ ఆ 'ఆలోచించేవాడే' కదా! అంటే మళ్ళీ పాత trap లోకే వెళ్తున్నావు. దేనినైనా సరే కంట్రోల్ చేయాలి, అదుపు చేయాలి అని నువ్వు చేసే ఏ చిన్న మానసిక ప్రయత్నమైనా సరే.. అది నీ భ్రమ మాత్రమే.
🔵దీనికి solution ఏ గురువు దగ్గరో, ఏ Meditation technique లోనో దొరకదు. అసలు దీన్ని ఒక 'problem' లాగా చూడటం మానేయ్. దాన్ని మార్చాలి, ఆపాలి, అణచివేయాలి అనే ఉద్దేశం లేకుండా.. just అలా చూస్తూ ఉండడం అలవాటు చేస్కో. ఒక thought వస్తే, just దాన్ని observe చెయ్. Judge చేయకు. విశ్లేషించకు. ఇది ఎందుకు వచ్చింది అని post mortem చేయకు. Just స్క్రీన్ మీద ఒక సినిమా చూసినట్టు చూస్తూ ఉండిపో. నువ్వు దాన్ని ఆపాలి అనుకున్న క్షణమే, నీకు నువ్వే దానికి పవర్ ఇస్తున్నట్టు. Just చూస్తూ వదిలేస్తే, దానికదే పుడుతుంది, దానికదే చచ్చిపోతుంది.
ఇప్పుడు నిన్ను నువ్వే ఈ ప్రశ్నలు వేసుకో:
1️⃣Negative thoughts ని ఎలా ఆపాలి?" అని వెతుకుతున్నావు కదా... అసలు వాటిని ఎందుకు ఆపాలి అనుకుంటున్నావు?
2️⃣ఆపాలి అంటే, ఆ ఆలోచనల నుంచి తప్పించుకోవాలనే కదా?
3️⃣తప్పించుకోవాలి అంటే, ఆ ఆలోచనల పట్ల నీలో భయం ఉన్నట్టే కదా?
4️⃣మరి భయంతో మొదలైన ఏ ప్రయత్నమైనా, నీకు భయాన్ని మిగుల్చుతుందా లేక ప్రశాంతతనా?
5️⃣అసలు "ఇది Negative ఆలోచన" అని దానికి లేబుల్ వేసింది ఎవరు? నీ మనసే కదా?
6️⃣తనకి తానే ఒక ఆలోచనకు Negative' అని బోర్డు తగిలించి, మళ్ళీ తనే దాన్ని ఆపాలి అని గింజుకుంటున్న నీ మనసు.. నిజంగా solution వెతుకుతోందా? లేక 'సమస్యను పరిష్కరించడం' అనే సాకుతో ఎప్పటికీ తన ఉనికిని కాపాడుకోవాలని plan చేస్తోందా?
-PRATIKULA VEDAM
15
http://youtube.com/post/UgkxfdLboQ1djzGinSlIbk79unIY5xJ6A4oF?si=7oo01QxWAAACiaxJ
No comments:
Post a Comment