Monday, October 13, 2025

 🦚 జ్ఞాన ప్రసూనాలు 🚩
12/10/2025

1) ఎల్లప్పుడూ భగవంతుడి మీదనే మనస్సును నిలుపుకోవాలి. మొదట కొంత శ్రమ చేయవలసి ఉంటుంది.
తర్వాత మనసుకు భగవత్ ధ్యానం,స్మరణ అలవాటు అయేకొద్ది నీ ప్రయత్నం తగ్గి నీ మనసే నిన్ను అటువైపు లాగుకొని వెళ్తుంది.

2) ఈ ప్రపంచంలో ఎవరికైనాసరే తొంభైతొమ్మిది మంచి పనులు చేసి, ఒక్క చెడు పని చేస్తే చాలు; ఆ వ్యక్తి చేసిన మేలునంతా మరచి పోయి ఆ ఒక్క కీడునే గుర్తుంచుకుంటాడు.
కాని అదే భగవంతుడి విషయం ఇందుకు పూర్తిగా భిన్నం.
తొంభై తొమ్మిదిసార్లు పాపకృత్యాలు చేసి ఒక్కసారి భగవంతుడికి ఇష్టమైన మంచి పని చేస్తే చాలు -నీ దుష్ప్రవర్తన నంతటిని ఆయన క్షమిస్తాడు.
సామాన్యులు చూపించే ప్రేమకు, భగవంతుని ప్రేమకు మధ్య యింతటి వ్యత్యాసం ఉంది.

3) ఎండు కట్టెలను చిదుగులను పోగుచేసి కష్టపడి ఎవడైనా మంట రాజేస్తే దాని సెగతో అనేకులు చలికాచుకొంటారు.
అలాగే తీవ్ర జపతపాలను గావించి ఈశ్వర సాక్షాత్కారం పొందిన మహనీయుల సాంగత్యం చెయ్యటంచేతా వారి సదుపదేశాలను అనుసరించటంచేతా అనేకులు తమ మనస్సును భగవంతుడిమీద లగ్నం చేసుకోగలరు.

4) ఒక్క “నేను“ నుంచే అన్ని నేనులూ పుట్టుకొచ్చాయి. కాబట్టి అన్ని నేనులకు "నేను" అనేది ఇంటి పేరు.

5) ఆధ్యాత్మిక సాధనల్లో తేడాలుంటాయిగాని 'ఆత్మానుభవం' లో తేడాలుండవు.

No comments:

Post a Comment