Thursday, October 9, 2025

 _*చంద్రోదయ ఉమా వ్రతం - అట్లతద్దె*_
[ 9-10-2025 గురువారం]
✳️🌻🌻🌻🌻🔯🌻🌻🌻🌻✳️

💐 *పరమ పవిత్రమైన భారతదేశము నందు జన్మించిన స్త్రీలకు మన పూర్వులు చక్కని, పవిత్రమైన పుణ్య ప్రదమైన అత్యంత ఫలప్రదమైన అనేక నోములు వివరించి చెప్పారు. వృథా కాలక్షేపం చేయక స్త్రీలు వ్రతములు ఆచరించి ఫలం అనుభవించండి.*
     🪷┈┉┅━❀🌀❀┉┅━🪷

     ✳️ _*అట్లతద్ది - కథ*_ ✳️
             
_*అట్లతద్దోయ్ - ఆరట్లోయ్ - ముద్దపప్పోయ్ మూడట్లోయ్*_ అంటూ శ్రవణానందకరంగా, హాస్యరసస్ఫోరకంగా వినబడే నినాదాలను ఎరగని ఆంధ్రులంటూ ఒకతరం (దాదాపు 25 సం.లు) క్రిందటి దాకా ఎవరూ వుండేవారు కాదు♪. కాని, ఆ శ్రవణానంద - హాస్యస్ఫోరకాల వెనకాల ముసలి భర్తలతో వేగలేని యువతుల -మండిన గుండెల, ఎండినగొంతుల నెత్తురు పడిన ధ్వని ఏమిటో తెలియజెప్పే కథయిది♪.

🪷 ఆలోచించగలిగితే ఆంధ్రదేశమంతటా గాకపోయినా, ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో - తెల్లవారిందనడానికి గుర్తుగా మైకులు కాకుండా  - కోళ్ళకూతలే వినబడుతూన్న తావుల్లో. ఈ రోజుకీ కూడా ఆరోగ్యవంతుడైన పడుచు భర్తకోసం ఆడపిల్లలు పట్టే నోము - _*"అట్లతద్ది"*_

✳️ _*కథ:*_

 🪷 అనగనగా *"సునామ"* అని ఒక రాకుమార్తె ఉండేది♪. అట్లతద్ది నోము నోచుకుంటే ఆరోగ్యవంతుడైన పడుచు మొగుడు వస్తాడని పెద్దవాళ్ళు చెప్పగా విని, ఆమెకూడా తన ఈడు పిల్లలతో కలసి అట్లతద్ది నోము పట్టింది♪. పగలంతా పచ్చి మంచినీళ్ళయినా ముట్టకుండా ఉపవాసం వుంది♪.

కాని - సునామ, అత్యంత సుకుమారియైన రాచపిల్లకదా♪! అందువల్ల పగలు నాలుగో ఝాముకే నీరసించి పడిపోయింది♪. అది చూసి ఆమె అన్నగార్లంతా కంగారు పడ్డారు♪. ఆమె ఉపవాసం సంగతి తెల్సుకున్నారు♪. చంద్రోదయం చూసేదాకా ఎంగిలి పడకూడదనే నియమమూ విన్నారు♪. అయినా చెల్లెలి మీద ప్రేమ వలన - చేరువలో వున్న చింత చెట్టుకో అద్దాన్ని కట్టి, దానికెదురుగా వేటు దూరంలో ఆరికె కుప్పని తగలబెట్టి , చెల్లెల్ని తట్టిలేపి - కూర్చోబెట్టి - అద్దంలో కనుపించే ఆరెకె కుప్పమంటని చూపించి, అదే చంద్రుడని భ్రమింపచేశారు♪. చంద్రోదయమైందన్న అన్నలమాటల్ని నమ్మి, చంద్రదర్శనం చేశానని తృప్తిపడి, సునామ ఎంగిలిపడింది♪. కాలంగడుస్తోంది♪. 

🪷 సునామ యీడేరింది, పెద్దవాళ్ళంతా కలిసి ఆమెకూ, ఆమె తోటి పిల్లలకూ కూడా పెళ్ళిసంబంధాలు చూడసాగారు♪. అందరి పిల్లలకీ పడుచు భర్తలే లభించారు♪. కాని, సునామకు మాత్రం యెన్ని సంబంధాలు చూసినా 'ముసలి' పెళ్ళికొడుకులే తప్ప, పడుచువాళ్ళు కుదరటం లేదు♪. అందుకు సునామ చాలా దు:ఖించింది♪. ఇంకొన్నాళ్ళగితే ముసలీ ముతకా అని చూడకుండా పెద్దవాళ్ళు తననెవరో ఒకళ్ళకి కట్టబెట్టేస్తారనే భయంతో - ఓ రోజున, ఎవరికీ చెప్పకుండా ఊరి చివరి అడవిలోకి పారిపోయింది♪. 

🪷 అదృష్టవశాన ఆ రాత్రి, లోక సంచారార్థం అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూసి, పలకరించి, విషయం తెలుసుకుని - "అమ్మాయీ! అట్లతద్ది నోము పట్టి, ఉపవాసం ఉండలేక నువ్వు స్పృహతప్పావు♪. అప్పుడు నీ అన్నయ్యలు నీ మీద ప్రేమతో ఆరికె కుప్పకు నిప్పు పెట్టి, ఆ మంటని అద్దంలో చూపించి, అదే చంద్రబింబమని చెప్పారు♪. అది నమ్మి నువ్వు - చంద్రోదయ పూర్వమే ఎంగిలి పడ్డావు♪. అది నోముకు ఉల్లంఘన మయ్యింది♪. అందువల్లనే నోము సరిగ్గా నోచిన నీ మిత్రురాళ్ళకి పడుచు మొగుళ్ళు లభించి, నీకు మాత్రం ముసలి సంబంధాలే వస్తున్నాయి♪• ఇప్పుడింటికి వెళ్ళి మరలా ఆ నోమును పట్టి, సరిగ్గా నోచుకుంటే, తప్పనిసరిగా నీకు తగిన యువకుడితోనే నీ పెండ్లి జరుగుతుంది" అని చెప్పారు♪.

🪷 అందుకు ఆనందించిన సునామ, యింటికి మరలివచ్చి - ఈసారి అతిశ్రద్ధగా అట్లతద్ది నోము నోచుకుంది♪. తత్ఫలితంగా ఆమెకు అందగాడూ - ఆరోగ్యవంతుడూ అయిన పడుచువాడితో పరిణయమైంది♪. సునామ భర్తతో సుఖంగా కాపురం చేసుకుంది. 

✳️ _*విధానం:*_

🪷 ఆశ్వీయుజ బహుళ తదియ నాడు రాత్రి నాలుగవ ఝాములోనే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకోవాలి. ఆ రాత్రి చంద్రోదయమయ్యే వరకూ కటికోపవాసముండి, చంద్రదర్శనమైన తర్వాత, శుచిస్నాతలై అట్లు వేసి - గౌరీదేవికి పది అట్లు నైవేద్యం పెట్టి, ఒక ముత్తయిదువుకు పది అట్లు వాయనమిచ్చి, కథ చెప్పుకుని, అక్షతలు వేసుకుని, అనంతరమే భోజనం చెయ్యాలి♪. ఇలా పది సంవత్సరాలు చేసుకుని, తదుపరి ఉద్యాపన చేసుకోవాలి. 

✳️ _*ఉద్యాపన :*_

🪷 పదిమంది ముత్తయిదువలకు - ఒక్కొక్కళ్ళకు - 1 నల్లపూసలకోవ, లక్క జోళ్ళు, 1రవికెల గుడ్డ, దక్షిణ తాంబూలములతో కలిపి పదేసి అట్లు చొప్పున వాయనమిచ్చి, వారికి భోజనాలు పెట్టి, ఆశీస్సులు తీసుకోవాలి♪. 

🪷 దీనినే _*చంద్రోదయ గౌరీవ్రతము*_ అని కూడా అంటారుట!
     
🙏 _*హిందూ సాంప్రదాయాలను ఆచరించుదాం - తరించుదాం*_ 💐

           ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

✳️🌻🌻🌻🌻🔯🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment