Monday, October 13, 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(242వ రోజు):--
        1975 లో హాంబోల్ట్ రాష్ట్ర విశ్వ విద్యాలయంలో జరిగిన శిబిరం తర్వాత చిన్మయమిషన్ పశ్చిమ విభాగం స్థాపించబడింది. పిన్నలూ, పెద్దలూ, అన్నిమతాలవారూ, సమా జంలోని అన్నివర్గాలవారూ తూర్పు కు గాని, పడమరకుకాని పరిమితం కాని సత్యాన్ని ప్రయోజనకరమైన రీతిలో గ్రహించడానికి వీలుగా ప్రపంచజనులను మేల్కొలపడానికి స్వామీజీ తనకు నిశ్చయించుకున్న లక్ష్యాన్ని పాశ్చాత్యదేశాల్లో ప్రచారం చేయడమే ఈసంస్థ ముఖ్యోద్దేశం.
        ఈ సంస్థ అమెరికా, కెనడా, ట్రినిడాడ్, మెక్సికో, దక్షిణఅమెరికా, వెస్టిండీస్ లలో చిన్మయమిషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పఠనబృందాలు, వేదాంతపాఠాల తరగతులు, చిన్నచిన్న శిబిరాలు, పిల్లలకు బాలవిహార్ కేంద్రాలు, స్వామీజీ ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను నిర్వ హించడానికి స్థానికకేంద్రాలు బాధ్య త వహిస్తాయి. ముఖ్యకార్యాలయం చాలాఏళ్లపాటు నళిని,బిల్ బ్రౌనింగ్ ల స్వస్థలమైన నాపా, కాలిఫోర్నియా లో ఉంది. మిషన్ కు సంబంధించిన సమాచార పత్రికలనూ, గ్రంథాలనూ ప్రచురించే బాధ్యతను స్వచ్చందంగా స్వీకరించిన ఆ దంపతులిద్దరూ 20 ఏళ్లపాటు సంస్థకు ఆలంబనగా నిలి చారు. 1989 లో శాన్ యోసే, కాలి ఫోర్నియాలో కొంత ఆస్తిని కొనటం ద్వారా సంస్థ కార్యక్రమాలను వృద్ధి చేయటానికీ, తరగతులను నిర్వహిం చడానికీ సానుకూలమైంది. సంస్థకు అధిపతిగా భారతదేశంనుంచి స్వామి తేజోమయానంద ఈకేంద్రం లోనూ, వాషింగ్టన్, డి.సి.; ఫ్లింట్, మిచిగాన్; హౌస్టన్, టెక్సాస్ లవంటి దేశంలోని పెద్ద నగరాల్లోనూ బోధన కార్యక్రమాలు చేపట్టారు. గ్రంథాలు, టేపులు, సమాచార పత్రిక, మననం అనే త్రైమాసిక పత్రిక,- వీటి ప్రచురణ పంపిణీల బాధ్యతలను మాత్రం బ్రౌనింగ్ దంపతులే కొనసాగించారు. 
       స్వామీజీ ఏటేటా అమెరికా వచ్చి ఐదారు పెద్ద నగరాలలో ఉన్న విశ్వ విద్యాలయాల్లో ఉపన్యసించేవారు. 1977లో మాత్రం ఇందిరాగాంధీ దేశంలో విధించిన అత్యవసరపరి స్థితిని బాహాటంగా విమర్శించటం చేత ఆయనకు పాస్పోర్ట్ జారీచెయ్య డం ఆలస్యం చేశారు; ఈకారణం వల్ల ఆయన రాలేకపోయారు. 1979 లో నార్తకెరొలినాలోని రెడ్ వుడ్ కంట్రీలో 8 ఎకరాల భూమి కొని సాందీపని సాధనాలయపు నమూ నా లో ఒక ఆశ్రమపాఠశాల స్థాపిం చారు. ఆస్థలంలో ఉన్న రహదారి బంగళా 50 మంది విద్యార్థులు నివాసానికి సరిపోతుంది. భవనపు భోజనశాలలో కొంతభాగం తరగతు లు నిర్వహించడానికి కేటాయించ బడింది. స్వామి దయానంద (శ్రీ నట రాజన్ అయ్యర్ -పూర్వాశ్రమంలో) సాందీపని నుంచి వచ్చి అధికారి గానూ,మూడేళ్లపాటు జరిగే పాఠ్య కార్యక్రమానికి ముఖ్యాచార్యునిగాను బాధ్యతలు స్వీకరించారు. మొదటి రోజున స్వామీజీ ఉపన్యసించారు.
        🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺    

No comments:

Post a Comment